జాన్వీ కపూర్ భోపాల్‌లో జరిగిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఈవెంట్‌లో తన స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన డీప్ పర్పుల్ లెహంగా సెట్‌లో ఆమె రాజకుమారిలా మెరిశారు. సీక్విన్లు, జరీ ఎంబ్రాయిడరీ, తెల్లటి పూసలతో అలంకరించిన బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హై వేస్టెడ్ ఏ-లైన్ స్కర్ట్, గోల్డ్ జరీ వర్క్‌తో మరింత గ్రాండ్‌గా కనిపించింది. మృదువైన షిఫాన్ దుపట్టాను స్టైలిష్‌గా డ్రాప్ చేయడం ఆమెకు రాయల్ టచ్‌ను ఇచ్చింది.
సెలబ్రిటీ స్టైలిస్ట్ మేగన్ కన్సెసియో పర్యవేక్షణలో సిద్ధమైన ఈ లుక్‌లో ఆభరణాలు మరో హైలైట్‌గా నిలిచాయి. మహేష్ నోతందాస్ కలెక్షన్‌కు చెందిన భారీ బంగారు నెక్లెస్, ముత్యాల డిజైన్లు, జుంకీలు, హాత్‌ఫూల్‌తో జాన్వీ మరింత రాజసంగా కనిపించారు. పర్పుల్ దుస్తులు, బంగారు ఆభరణాల కలయికతో ఆమె నిజంగానే దేవతలా మెరిసిపోయారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె స్టైల్ సెన్స్ యువతకు స్ఫూర్తిగా మారుతోంది.














