మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఓ క్రాస్ఓవర్ అథ్లెట్‌గా అదిరిపోయే లుక్‌లో కనిపించారు. క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్.. మూడు ఆటలతో మాస్ అవతార్‌లో చెర్రీ ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చారు.
“పెద్ది గుళ్లో దేవుడు కాదు.. గ్రౌండ్‌లో దేవుడు” అంటూ వచ్చే ఎలివేషన్ షాట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో చరణ్ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఆకట్టుకోగా.. పవర్‌ఫుల్ గురువు పాత్రలో శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.
విలన్‌గా దివ్యేందు ఇంపాక్ట్ చూపించగా, జగపతిబాబు, బోమన్ ఇరానీ సహా భారీ తారాగణం కనిపించింది. ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ కుంటుకుంటూ కనిపించిన సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క్లైమాక్స్‌లో పారా అథ్లెట్ ట్విస్ట్ ఉంటుందా? అనే ఆసక్తి పెరిగింది.
ఎఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ‘పెద్ది’ ఈ ఏడాది బిగ్ హిట్ అవుతుందనే హైప్ పెరుగుతోంది.














