సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఉమ్మడి కుటుంబ నేపథ్యంలోని భావోద్వేగాలు, యాక్షన్‌ను దర్శకురాలు నందిని రెడ్డి అద్భుతంగా మేళవించారని కొనియాడారు.
ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే చిరంజీవి ట్వీట్‌లోని ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
“జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత-రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొనడంతో, ‘కొత్త అధ్యాయం’ అంటే సమంత గర్భవతి అన్న సంకేతమేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే, మెగాస్టార్ ప్రశంసలకు సమంత భావోద్వేగంగా స్పందించారు. తన సినిమాను మెచ్చుకున్నందుకు చిరంజీవికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనలాంటి లెజెండరీ వ్యక్తి నుంచి అభినందనలు అందుకోవడం కల నెరవేరినట్టుగా ఉందని పేర్కొన్నారు.



%2Fmovietalkies%2Fmedia%2Fmedia_files%2F2025%2F12%2F01%2Fsamantha-prabhu-raj-nidimoru-wedding-2-2025-12-01-13-56-31.jpeg&w=1920&q=75)











