బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మరియు ఆమె భర్త ఆనంద్ అహుజా లండన్‌లోని అత్యంత ఖరీదైన Notting Hill ప్రాంతంలో భారీ ఆస్తుల కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈ జంట సుమారు రూ.270 కోట్ల విలువైన మాన్షన్‌ను కొనుగోలు చేసి, దానిపై మరో రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేసి రీనోవేషన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడేమిటంటే, ఆ మాన్షన్‌కు సమీపంలోని ఐదు ఫ్లాట్లను కూడా సుమారు రూ.51 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అవి ఇంటి సిబ్బంది కోసం ఉపయోగించనున్నారనే ప్రచారం స్థానికుల్లో ఆందోళనకు దారితీసింది.

అయితే, ఈ కొనుగోళ్లలో తమ ప్రత్యక్ష సంబంధం లేదని, అవి కేవలం పెట్టుబడి కోసం మాత్రమే తీసుకున్న ఫ్లాట్లు అని జంట ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బ్రిటిష్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.