‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న యంగ్ హీరోయిన్ శ్రీదేవి అప్పాల.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. జాబిలి పాత్రలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఆ సినిమా తర్వాత భారీ క్రేజ్ వచ్చింది. రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘కోర్ట్’ మూవీ ఆమె కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

తర్వాత ‘బ్యాండ్ మేళం’లో హర్ష్ రోషన్‌తో కలిసి నటించి మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ‘హైకు’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ టీమిండియా యంగ్ క్రికెటర్‌తో శ్రీదేవి ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్లేనని, కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.