టాలీవుడ్ నిర్మాతలు మరియు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు D. సురేశ్ బాబు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అన్ని వర్గాలు ఏకాభిప్రాయానికి రావడంతో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు.
తాత్కాలిక ఒప్పందం ప్రకారం టికెట్ ధరలు పెరిగితే ఎగ్జిబిటర్లకు అదనంగా 7.5 శాతం రెవెన్యూ షేర్ ఇవ్వనున్నారు. అలాగే ప్రీమియర్ షోలకు ప్రత్యేక ఫిక్స్‌డ్ రేట్లు ఖరారు చేశారు. ఏ-సెంటర్లలో ఒక్కో షోకు రూ.25 వేలు, బీ-సెంటర్లలో రూ.15 వేలు, సీ-సెంటర్లలో రూ.5 వేలు ఇవ్వనున్నారు.
అంతేకాదు, భవిష్యత్తులో ఎగ్జిబిటర్ల కోసం శాశ్వత శాతం-షేరింగ్ విధానాన్ని తీసుకురావాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. జూన్ 2026 చివరి నాటికి దీనిపై పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.














