అమెరికాలోని న్యూయార్క్ నగరం మరోసారి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదిక కానుంది. ఆగస్టు 16న న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే, వెస్ట్ 43వ స్ట్రీట్ నుంచి వెస్ట్ 44వ స్ట్రీట్ వరకు ఇండియా డే పరేడ్ ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భారతీయులు, తెలుగు ప్రవాసులు హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో న్యూయార్క్, న్యూ ఇంగ్లాండ్, న్యూ జెర్సీ మిడ్-అట్లాంటిక్ ప్రాంతాల నాయకత్వ బృందాలు, సభ్యులు, వాలంటీర్లు కలిసి నిర్వహిస్తున్నారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ పరేడ్‌లో భారతీయ సంస్కృతి, వారసత్వం, ఐక్యతను చాటే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ సినీ నటీ పూజా హెగ్డే, నటుడు అడివి శేష్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

TANA అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, EVP శ్రీనివాస్ లావు, BOD రవి పొట్లూరి, ట్రెజరర్ రాజా కాసుకుర్తి, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సంపల్లి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగ్, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరితో పాటు ప్రాంతీయ ప్రతినిధులు, ఫౌండేషన్ ట్రస్టీలు కార్యక్రమం విజయవంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే వీధుల్లో భారత జెండాలతో జరిగే ఈ పరేడ్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భారతీయులు పాల్గొని దేశభక్తిని చాటనున్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, ఐక్యతను ఘనంగా చాటే ఈ ఇండియా డే పరేడ్‌కు భారీగా తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

WhatsApp Image 2026-08-13 at 9.33.47 PM.jpeg