ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) డల్లాస్ చాప్టర్‌కు 2026–2028 కాలానికి నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడా ఆధ్వర్యంలో ఈ ప్రకటన వెలువడింది. కొత్తగా ఎన్నికైన డల్లాస్ చాప్టర్ నాయకత్వ బృందానికి అభినందనలు తెలుపుతూ, సమాజ సేవ, యువత సాధికారత, తెలుగు సంస్కృతి పరిరక్షణలో వారు విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.
డల్లాస్–ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్‌లో తెలుగు సమాజాన్ని మరింత బలోపేతం చేయడం, యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగనుంది.
నాట్స్ డల్లాస్ చాప్టర్ నాయకత్వం (2026–2028)
చాప్టర్ కోఆర్డినేటర్: కిరణ్ నారే
జాయింట్ చాప్టర్ కోఆర్డినేటర్: పావని నున్నా
కమిటీ ఛైర్మన్లు
ప్రోగ్రామ్స్ & ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్: బదరి బియ్యపు (చైర్), సుధీర్ మేడపాటి (కో-చైర్)
ఉమెన్ ఎంపవర్‌మెంట్: సౌజన్య రావెల్ల
కమ్యూనిటీ సర్వీస్: కార్తీక్ మేడపాటి
సోషల్ మీడియా: సతీష్ బొజంకి
వెబ్ & మీడియా: పునీత్ పోటు
హెల్ప్‌లైన్: ఆది గోపాలం
స్పోర్ట్స్ కమిటీ: హృదయ్ దండు (చైర్), పవన్ వంకమామిడి (కో-చైర్)
ఫండ్‌రైజింగ్: నరేన్ శివ
మెంబర్‌షిప్: రోహిత్ సుంకర
యువజన కమిటీ
చైర్: గౌతమ్ కంచర్ల
కో-చైర్: రిషిక్ ఖండవల్లి
సభ్యులు: సాన్వి గుల్లపల్లి, సంజనా కలిదిండి, ఈషాన్వి గోవాడ, ధ్రువ్ పెదిరెడ్డి, వేద నిడిగంటి, అద్వైత్ నారే.
ఈ సందర్భంగా నాట్స్ జాతీయ నాయకత్వం మాట్లాడుతూ, కొత్త కమిటీ సమిష్టి కృషితో డల్లాస్ ప్రాంతంలో తెలుగు సమాజానికి మరింత చేరువై సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు, యువత అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. కొత్త నాయకత్వానికి తెలుగు సంఘాల ప్రతినిధులు, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.











