తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) 2027–2028 టర్మ్‌కు సహోదర్ పెద్దిరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు, సభ్యులు, ప్రవాస తెలుగు ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

సంఘం అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరింత అభివృద్ధి సాధించి, ప్రవాస తెలుగు సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2027–2028 కాలానికి అధ్యక్షుడిగా ఎన్నికైన సహోదర్ పెద్దిరెడ్డికి TTA వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వివిధ చాప్టర్ల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని, సంస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్మన్ డా. మోహన్ రెడ్డి పట్లొల్ల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, వంశీ రెడ్డి కంచరకుంట్ల సహోదర్ పెద్దిరెడ్డికి అభినందనలు తెలుపుతూ, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

అలాగే టీటీఏ AC, EC, Board of Directors, Standing Committees, RVPs, RCs సభ్యులు కూడా తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి కొత్త విజయాలను అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Congratulations, Sahodar Peddireddy Garu, on your election as President of the Telangana America.jpg