భారతీయ శాస్త్రీయ నృత్యమైన భరతనాట్య కళా వైభవాన్ని చాటిచెప్పేలా టాంపాలో ‘సఖా & మహామాయ — An Evening of Bharatanatyam’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. రుద్రం డాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 2026న ఈ ప్రదర్శన జరగనుంది.

సాయంత్రం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు న్యూ టాంపా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో రెండు ప్రధాన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ‘సఖా’ (A Man As Friend) పేరుతో పి. ప్రవీణ్ కుమార్ సోలో భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే ‘మహామాయ’ (The Supreme Goddess) పేరుతో రుద్రం డాన్స్ కంపెనీ నృత్య కళాకారులు గ్రూప్ ప్రదర్శన చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి తారా బిక్కోసాని, రుద్రం డాన్స్ కంపెనీ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. పి. ప్రవీణ్ కుమార్ కాన్సెప్ట్, కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హిల్స్‌బరో ఆర్ట్స్ కౌన్సిల్ గ్రాంట్ ఈ కార్యక్రమానికి మద్దతు అందిస్తోంది.

టికెట్ ధరలు

VIP – $35 | Regular – $25 | Student – $15 | 8 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం

వేదిక: New Tampa Performing Arts Center, 8550 Hunters Village Rd, Tampa, FL 33647
తేదీ: సెప్టెంబర్ 5, 2026
సమయం: సాయంత్రం 4:30 – 7:30
Email: rudramdancecompany@gmail.com

భరతనాట్య ప్రియులు, కళాభిమానులు ఈ ప్రత్యేక సాయంత్రాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

rudra flayer.png