కెనడాలో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ కెనడా ఎన్‌ఆర్‌ఐ టీమ్ ఏర్పాట్లు చేసింది.
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన సేవలను, ప్రజల కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ.. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై ఆయన ఆశయాలను యువతకు పరిచయం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మిస్సిసాగాలోని Palacio Event Centreలో ఈ కార్యక్రమం జరగనుంది. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని.. పరస్పరం ఆత్మీయంగా కలుసుకునేలా ఫ్యామిలీ గ్యాదరింగ్‌గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి రుసుము లేదని స్పష్టం చేశారు. డిన్నర్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ కెనడా ఎన్‌ఆర్‌ఐ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పెద్దలు, యువత, కుటుంబ సభ్యులు పాల్గొని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించనున్నారు.













