మ్యూనిటీ సేవ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘Adopt a Highway’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13, 2026 ఆదివారం ఉదయం 9 గంటలకు మెకానిక్స్‌బర్గ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
Woods Drive, Mechanicsburg, PA వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 6 Warm Sunday Way, Mechanicsburg, PA 17050 సమావేశ స్థలంగా నిర్ణయించారు. హైవే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి తానా మిడ్ అట్లాంటిక్ ప్రెసిడెంట్ డా. నరేన్ కోడాలి, TANA EVP శ్రీనివాస్ లావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే ఫణి కాంతేటి (Mid Atlantic Regional President), వెంకట్ సింగు (TANA Benefits Coordinator) సమన్వయంలో కార్యక్రమం కొనసాగనుంది.
ప్రధాన సమన్వయకర్తలుగా సతీష్ చుండ్రు, వేదసాయి అబ్బూరి, ఆశిత చౌదరి కోట, జెస్సీ గుండాల, సంజన చౌదరి ముప్పా వ్యవహరిస్తున్నారు.
కార్యక్రమానికి సోహన్ సింగు, సంజన కోట, ఆద్య పైడి, లాస్య బొమ్మినేని, శ్రీయ నిమ్మగడ్డ, సుజల్ రామచంద్రన్ తదితరులు సహకరిస్తున్నారు. కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.














