తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఒహాయో వ్యాలీ విభాగం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 2026 ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రీడా మహోత్సవం ఆగస్టు 1వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.
పోటీలు Avery Park, 7401 Avery Rd, Dublin, OH 43017 లో నిర్వహించబడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒహాయో వ్యాలీ తెలుగు యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా, రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావా, ఒహాయో వ్యాలీ స్పోర్ట్స్ చైర్ వీర ప్రతాప్ సమన్వయం చేస్తున్నారు.
క్రికెట్ ద్వారా తెలుగు యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, పరస్పర స్నేహభావం పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లు, క్రీడాకారులు పోస్టర్‌లోని QR కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.














