తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12, 2026న చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. పెన్సిల్వేనియాలోని ఎక్స్టన్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.
ఎక్స్టన్‌లోని Tri Ridges Chess Club, 666 Exton Commons, Exton, PA 19341 వేదికగా మధ్యాహ్నం 12:30 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 20 డాలర్లు.
టోర్నమెంట్‌లో U500, U900, U2000 రేటింగ్ విభాగాలతో పాటు 8–12 ఏళ్ల పిల్లలు, పెద్దల కోసం అన్‌రేటెడ్ విభాగాలు ఉంటాయి. మొత్తం 5 రౌండ్ల Swiss System G25 D5 ఫార్మాట్‌లో పోటీలు నిర్వహించనున్నారు.
టోర్నమెంట్‌కు ఫణి కంఠేటి, నాయుడమ్మ నవరసతి, ధీరజ్ జాలరి, జోషువా ఆండర్సన్ (TD), డా. నరేన్ కొండపల్లి (TANA President), శ్రీనివాస్ లావు (TANA EVP), రవి పొట్లూరి (TANA Board of Director), వెంకట్ సింగ్ (TANA Benefits Coordinator) తదితరులు సహకరిస్తున్నారు.














