అమెరికాలోని తెలుగు యువతలో కోడింగ్, టెక్నాలజీ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు నిర్వహించిన TANA Youth Codeathon 2026 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌లో జరగనుంది.

కోడాథాన్‌లో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అభినందించడంతో పాటు, ఈ కార్యక్రమంలో విజేతల ప్రకటన చేయనున్నారు. అంతేకాదు, పాల్గొన్నవారితో పాటు విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, TANA అభిమానులు ఎవరైనా పాల్గొనేలా ప్రత్యేకంగా లైవ్ Kahoot! ఛాలెంజ్ నిర్వహించనున్నారు.

Kahoot ఛాలెంజ్‌లో విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించనున్నారు. సరదా, విజ్ఞానం, పోటీతో సాగనున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని యువ కోడింగ్ ప్రతిభను ప్రోత్సహించాలని TANA నిర్వాహకులు కోరుతున్నారు.

తేదీ: ఆగస్టు 15, 2026
సమయం: సాయంత్రం 5:00 PM EST

వేదిక: Zoom
Zoom: https://us06web.zoom.us/j/83809668562

WhatsApp Image 2026-08-13 at 9.21.36 AM (1).jpeg