ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీవర్స్ కమ్యూనిటీని ఒక్క వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ (WWO) నిర్వహించిన USA–North East Regional Conference–2026 ఘనంగా జరిగింది. న్యూజెర్సీలోని Royal Albert’s Palace వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాల నుంచి వీవర్స్ కమ్యూనిటీ సభ్యులు, ప్రొఫెషనల్స్, డాక్టర్లు, బిజినెస్ ఓనర్స్, ఎంట్రప్రెన్యూర్స్, విద్యార్థులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వీవర్ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు.. పరస్పర పరిచయాలు, కమ్యూనిటీ బంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం లభించింది.

పద్మశాలి, దేవాంగ, తొగట వీర క్షత్రియ, భావసార క్షత్రియ, కర్నాభక్తులు, కుర్ని, పట్టుసాలి, స్వకులసాలి, ఖత్రి, కురిమిశెట్టి, సాలియార్, సౌరాష్ట్రియన్, కైకల తదితర వీవర్ కమ్యూనిటీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

WWO ఆధ్వర్యంలో వీవర్స్ కమ్యూనిటీ సాధికారత, సామాజిక సేవ, ఆర్థిక సహాయం, పరస్పర సహకారం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ భవిష్యత్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలనే లక్ష్యాన్ని నిర్వాహకులు వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీవర్ కమ్యూనిటీలను అనుసంధానిస్తూ “ఒక్కటిగా.. మరింత బలంగా” ముందుకు సాగేందుకు ఈ కాన్ఫరెన్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.

WWO ఫౌండర్స్ చైర్మన్ అంజన్ కర్నాటితో పాటు ఫౌండర్స్ హరినాథ్ పోలిచెర్ల, రాజ్ అడ్డగట్ల, రమేష్ మునుకుంట్ల, శారధి కార్యంపూడి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా సాగింది.

వీవర్స్ కమ్యూనిటీ ఐక్యత, సేవా కార్యక్రమాలు, యువత భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈ కాన్ఫరెన్స్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది.