24815 వార్తలు



అసూస్ భారత మార్కెట్‌లో కొత్త అసూస్ అసూస్ ప్యాడ్ T3201 ట్యాబ్‌ను ఆగస్టు 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్‌లో 2.8K OLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్, 9000mAh బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్లు అందించనుంది. కంపెనీ ఇప్పటికే ఈ ట్యాబ్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ధర ఎంత ఉండొచ్చు? అసూస్ ప్యాడ్ T3201 అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం..ఈ ట్యాబ్ భారత మార్కెట్‌లో రూ.40,000 ధర పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ధర, సేల్స్ వివరాలు ఆగస్టు 6న లాంచ్ ఈవెంట్‌లో వెల్లడికానున్నాయి. ఫీచర్లు( అంచనా) డిస్‌ప్లే: అసూస్ ప్యాడ్ T3201లో 12.2 అంగుళాల 2.8K రిజల్యూషన్ కలిగిన డ్యూయల్-లేయర్ OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్తో వస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, డిజిటల్ క్రియేటివ్ పనులకు అద్భుతమైన విజువల్ అనుభవం లభించనుంది. పన



వర్షాకాలం ప్రారంభమైన వెంటనే దోమలు, కలుషిత నీరు, తేమ వాతావరణం కారణంగా అనేక అంటువ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, జలుబు, దగ్గు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పరిశుభ్రత పాటించడం, స్వచ్ఛమైన నీరు తాగడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఏమిటి? వాటి బారిన పడకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దామా? వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు 1. డెంగ్యూ: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు కనిపించవచ్చు. 2. వైరల్ ఫీవర్ (ఫ్లూ): జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, శరీర నొప్పులు ప్రధాన లక్షణాలు. 3. టైఫాయిడ్: కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, కడుపు నొప్పి, అలసట కనిపిస్తాయి. 4. జలుబు, దగ్గు: వాతావరణ మార్పులు, వైరస్‌ల వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. 5. కలరా, విరేచనాలు: కలుషిత నీరు, ఆహారం వల్ల విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన











ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షా ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటి ధరపై 50 శాతం వరకు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ సబ్సిడీ ఎవరికీ వర్తిస్తుంది?: ఈ పథకం సాధారణ ప్రజల కోసం కాదు. కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన బైక్ టాక్సీ పైలట్లు, ఆటోరిక్షా ఆపరేటర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు డ్రైవర్ల నిర్వహణ ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. 70 కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు: సబ్సిడీతో పాటు రాష్ట్రంలో ఈవీ వినియోగం సులభతరం చేసేందుకు ప్రభుత్వం సుమారు 70 కొత్త EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులు ఛార్జింగ్ సమస్య లేకుండా సుదూర ప్రయాణాలు కూడా సులభంగా చేయగలుగుతారు. ఈ కొత్త విధానం ఎందుకు?: కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్-డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం, పరిశుభ్రమైన రవాణాను ప్రోత్సహించడం గోవా ప్ర


హైదరాబాద్: మెహదీపట్నంలో విజయనగర్ కాలనీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం తప్పింది. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తులోని బెడ్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.



స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈ ఏడాది భారత మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వోల్వో EX90ను విడుదల చేయనుంది. 2026 ఆగష్టు 19న ఇండియాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో కంపెనీ నుంచి రానున్న రెండో ఎలక్ట్రిక్ వాహనం. అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన బ్యాటరీ ఎంపికలు, అత్యున్నత భద్రతా ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లు వోల్వో EX90ను 800V ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు. ఇందులో 92kWh, 106kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. 1. 92kWh బ్యాటరీ వేరియంట్‌లో రియర్-వీల్ డ్రైవ్ (RWD) మోటార్ ఉంటుంది. ఇది 333 హెచ్‌పీ పవర్, 480Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం 565 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. 2. 106kWh బ్యాటరీ వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ AWD సెటప్ ఉంటుంది. దీని బేస్ మోడల్ 456 హెచ్‌పీ పవర్, 670Nm టార్క్ అందిస్తుంది. టాప్ పెర్ఫా

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన K సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. కంపెనీ దీనిని ఒప్పో K15 పేరిట చైనాలో జూలై 24న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో విడుదలైన ఒప్పో K15 ప్రో, ఒప్పో K15 ప్రో ప్లస్ మోడళ్లకు కొనసాగింపుగా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ధర ఎంత ఉండవచ్చు?ఒప్పో K15 ధరకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ జూలై 24న జరిగే లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో మంచి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గ్రే, వైట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫీచర్లు( అంచనా) డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. అలాగే IP69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ప్రాసెసర్: పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌తో పాటు టైడల్ ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ల