
5185 articles

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. హాస్పిటల్ ఎ,బి,సి బ్లాకులన్నీ మంత్రి కలియ తిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ల్యాబ్‌లు, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్‌మెంట్లను మంత్రి పరిశీలించారు.ఆసుపత్రి ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిని సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గుండె సంబంధిత వ్యాధుల


అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ,కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అస్సాంలో వరుసగా రెండోసారి సిఎం పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా హిమంత నిలిచారు. ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులు ప్రమాణం చేశారు. అస్సాంలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. 126 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయేకు 102 మంది సభ్యుల బలముంది. బీజేపీ ఒక్కటే 82 సీట్లు గెల్చుకోగా, దాని కూటమి భాగస్వాములైన ఎజీపీ, బీపీఎఫ్ చెరో 10 సీట్లు దక్కించుకున్నాయి. దీంతో ఎన్డీయే రాష్ట్రంలో వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కరళలో కాంగ్రెస్ సారధ్య కూటమి గెలిచినా ఇప్పటీక ముఖ్యమంత్రి ఎవరు ? అనేది చిక్కుముడిగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం కెపిసిసి మాజీ అధ్యక్షులు మురళీధరన్‌తో చాలా సేపు సమావేశం అయ్యారు. తరువాత పలువురు పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. వెంటనే నాయకుడిని ఎంపిక చేయాలని ఈ సందర్భంగా రాహుల్ నిర్ణయించినట్లు వెల్లడైంది. మంగళవారం రాత్రి కానీ, బుధవారం ఉదయం కానీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకోగానే కేరళ విషయంపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. సిఎంగా ఒకరిని ఎంపిక చేసిన తరువాత విషయాన్ని మేడం సోనియా గాందీతో మాట్లాడి రాహుల్, ఖర్గే తుది నిర్ణయం ప్రకటిస్తారని మురళీధరన్ తెలిపారు. కేరళలో కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్ ఘన విజయం సాధించింది సిఎం పదవికి పోటీలో కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, సీనియర్ నేతలు విడి సతీశన్, రమేష్ చెన్నితాల ఉన్నారు. ముగ్గురికి హై కమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉండటంతో ఎవరు సిఎం అవుతారనేది సస్సెన్స్‌గా మారింది. కేరళ సిఎం ఎంపిక వ్యవహారంపై ఇప్పుడు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో సందడి నెలకొంది.

డిఎంకె నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సనాతన ధర్మం ప్రజలను మతం పేరిట విభజిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి . 2023 సెప్టెంబర్‌లో లో కూడా సనాతన ధర్మంపై ఇదే వ్యాఖ్యలు చేసి, పలు తీవ్రస్థాయి విమర్శలకు గురి అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. సనాతన ధర్మం అనేక అనర్థాలకు దారితీస్తోందని, విభేదాలను పెంచుతోందని, తమిళనాడులో ఈ వాదాన్ని తలెత్తనిచ్చేది లేదని ఉద్బేగభరితంగా తెలిపారు. తమిళ గీతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి ప్రాధాన్యత ఉండాల్సిందేనని, అతి క్రమణను సహించేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో అదికారిక లేదా ఏ ఇతర కార్యక్రమాల్లో అయిన జాతీయ గీతానికి ముందుగానే తమిళ తాయ్ వజతూ గీతాలాపనం ఉండాల్సిందే అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏ అధికారిక కార్యక్మంలో అయినా, ఇతర చోట్ల అయినా ముందు వందేమాతరం తరువాత జనగణమన తరువాతనే వేరే గీతాలను ఆలాపించాల్సి ఉంటుందని అధికారిక ఉత్తర్వులతో నోటిఫికేషన్ వెలువరించింది. విజయ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం దశలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావి

పశ్చిమ బెంగాల్‌లో బిజెపి , ఎన్నికల సంఘం సంయుక్తంగా ఇప్పుడు ఏకంగా చోర్ బజార్ ఏర్పాటు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో అధికారం మారిన తరువాత ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి నియామకాలపై రాహుల్ మంగళవారం స్పందించారు. ఇంతకు ముందు దొంగకు కొరడా దెబ్బలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ పద్థతి మారినట్లుందని ఆయన స్పందించారు. ఎంత పెద్ద చోరీ చేస్తే అంత పెద్ద నజరానా అనే బాపతుగా వ్యవహారం మారిందని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మాజీ సిఇసి మనోజ్ అగర్వాల్‌ను నియమించారు. ఇక ఇంతకు ముందు సర్ నిర్వాహకుడుగా ఉన్న సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రి సువేందుకు ప్రధాన సలహాదారు చేశారు. ఇది బెంగాల్‌లో వీరు ఓట్ల చోరీని విజయవంతం చేసినందుకు దక్కించుకున్న ప్రతిఫలం అని రాహుల్ సామాజిక మాధ్యమంతో తెలిపారు. ఇప్పుడు కథ అంతా కూడా బిజెపిఇసి చోర్ బజార్ , పవర్ లూఠీ అయిందని విమర్శించారు. సర్ ద్వారా లక్షల ఓట్లను తొలిగించడంలో పావు కదిపిన అధికారిని ఇప్పుడు సిఎం ఏకంగా తన సలహాదారుడిగా పెట్టుకుని , ఆయన పట్ల ఉదారభావం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.



తమిళనాడు సిఎం విజయ్ సంచలన నిర్ణయం చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ప్రార్ధనా మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీనిపై ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు , పాఠశాలలు, కళాశాలలతో పాటు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ( టిఎఎస్‌ఎంఎసి) ఆధ్వర్యంలో నడుస్తున్న వాటన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4765 మద్యం రిటైల్ దుకాణాలు టిఎఎస్‌ఎంఎంసి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా మూసివేయడానికి గుర్తించిన 717 దుకాణాల్లో, 276 ప్రార్థనా స్థలాల సమీపంలో , 186 విద్యాసంస్థలు, మరో 255 బస్‌స్టాండ్‌ల సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ తాజా ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవి మూతపడనున్నాయి.

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ చేసిన ప్రతి ఒక్కరిని జైలులో వేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వలోనే రీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేస్తామని, ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయమని, రద్దు అయిన పరీక్షకు సంబంధించి ఫీజులను విద్యార్థులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నీట్ లీకేజీ వ్యవహరంపై సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తామన్నారు. రాజస్థాన్‌లో పేపర్ […] The post నీట్ పేపర్ లీకేజీ..కేసు దర్యాప్తు సీబీఐకి appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని అడ్వాలపల్లిలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ,విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం గుడుంబా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో పది లీటర్ల నాటు సారాయి,వంద లీటర్ల పులియపోసిన బెల్లం పానకం స్వాదినపర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.గుడుంబా తయారు చేసిన,విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. The post గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు appeared first on Navatelangana.
అకాల వర్షాలతో పొంచిఉన్న ప్రమాదంఅప్రమత్తంగా ఉండాలని..నిపుణుల సూచననవతెలంగాణ – మల్హర్ రావువేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి.వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.ఉరుములు,మెరు పులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉంది.ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ఫోన్ను వినియోగించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు.పిడుగుపాటు సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వెలుతురుతో పాటు విద్యుత్ శక్తి విడుదల అవుతుంది.అసలు పిడుగు ఎలా పడు తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విష యాలపై నిపుణులు పలు సూచనలు చెబుతున్నారు. మెరుపు, ఉరుము, […] The post వేసవిలోనూ పిడుగుపాటు.! appeared first on Navatelangana.

సీఎం చేతులమీదుగా రూ.లక్ష నగదు అందుకున్న ప్రిన్స్ పాల్ విజయ దేవినవతెలంగాణ – మల్హర్ రావురాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన కళాశాలలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు పురస్కారాన్ని అందజేస్తోంది.ఇందులో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో కళాశాల పేరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు గాను తాడిచర్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయ దేవి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు ప్రారంభంలో […] The post ఉత్తమ బోధనకు తాడిచెర్ల కళాశాలకు నగదు ప్రోత్సాహకం appeared first on Navatelangana.
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్నవతెలంగాణ – మల్హర్ రావుకేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరతను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్,పిక కిరణ్ డిమాండ్ చేశారు.మంగళవారం కొయ్యుర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథపై పోస్కోయాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.కానీ అతన్ని ఇంతవరకు అరెస్టు చేయకపోవడానికి కారణం ఇతడు బిజెపికి చెందిన […] The post బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ -పరకాల మాజీ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ధర్మపత్ని దొమ్మటి కళావతిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎంపీ స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమెకు గుండె శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో, ప్రస్తుతం అందుతున్న వైద్యం మరియు కోలుకుంటున్న తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కళావతి త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ ఆకాంక్షించారు. […] The post దొమ్మటి సాంబయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి appeared first on Navatelangana.
సాయి భగీరథ అరెస్టుకు అశ్వారావుపేట లో నిరసనమైనర్ బాలికకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ప్రదర్శననవతెలంగాణ – అశ్వారావుపేటకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో అశ్వారావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికపై జరిగిన […] The post బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి: బీఆర్ఎస్ డిమాండ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – అశ్వారావుపేటగ్రామీణ ప్రజల విద్య, వైద్యం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బస్ సర్వీసులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో కొత్తగూడెం – అశ్వారావుపేట నూతన బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పల్లె రవాణా వ్యవస్థ మెరుగుపడుతోందన్నారు.తన ప్రత్యేక కృషితో అశ్వారావుపేట మండల గ్రామీణ ప్రజలకు మరింత రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కొత్తగా […] The post బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.



