🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5178 articles

అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ రద్దు
Older
Telangana

అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ రద్దు

అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలిసింది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన వారికి ఎల్పీజీ సబ్సిడీని రద్దు చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే చమురు కంపెనీలకు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. అయితే, ఈ నిబంధన 2015 డిసెంబర్ నుంచే అమల్లో ఉన్నప్పటికీ, గతంలో వినియోగదారులు స్వచ్చందంగా సబ్సిడీ వదులుకునేవారు. కానీ, ఇప్పుడు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాన్‌కార్డ్ డేటా ఆధారంగా ఎవరి ఆదాయం నిర్ణీత పరిమితికి మించి ఉందో గుర్తించి, వారి సబ్సిడీని తొలగించేందుకు జాబితాలను సిద్ధం చేసినట్టుగా తెలిసింది. ఈ కొత్త విధానం ప్రకారం, కేవలం గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయం మాత్రమే కాకుండా, వారి జీవిత భాగస్వామి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీరిద్దరిలో ఎవరి ఆదాయం రూ. 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హులుగా ప్రకటించనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులకు వ

Admin2 days ago👁 1
శ్రీవాణి పేరు మార్చి చంద్రవాణి ట్రస్ట్ అని పెట్టండి: భూమన కరుణాకర్ రెడ్డి
Older
పచ్చి మామిడితో నోరూరించేలా…
Older
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు నోటీసులు
Older
Telangana

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు నోటీసులు

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్‌కు పేట్‌బషీరాబాద్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌లోని బండి సాయిభగీరథ్ ఇంటికి వెళ్లి అతడు అందుబాటులో లేకపోవడంతో అతడి మేనమామ వంశీకృష్ణకు పేట్‌బషీరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బండి సాయి భగీరథ్ తనపై అత్యాచారం చేశాడని, పలుమార్లు మద్యం తాగించి మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న సాయిభగీరథ్‌ను విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసిపి రితిరాజ్ ఆధ్యర్యంలో ఏర్పాటైన సిట్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే డిసిపి రితిరాజ్ సమక్షంలో పోలీసులు మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. బాలిక చెప్పిన వివరాల మేరకు కేసులో సెక్షన్ 5(1), రెడ్‌విత్ 6 సెక్షన్లను కలిపారు.పరారీలో భగీరథ్... పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయిభగీరథ్ పోలీసులకు చిక్కకుండా పరారైనట్లు తెలిసిం

బౌలింగ్లో ఇరగదీసిన సన్‌రైజర్స్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వాషి, సాయి.. SRH టార్గెట్ ఎంతంటే!
Older
సన్ రైజర్స్  టార్గెట్ 169
Older
Telangana

సన్ రైజర్స్ టార్గెట్ 169

ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ జోస్ బట్లర్‌లు విఫలమయ్యారు. నితీశ్ సంధు 14 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఓపెనర్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సాయి సుదర్శన్ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వాషింగ్టన్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుందర్ 33 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో సాకిబ్, ప్రఫుల్ హింగె రెండేసి వికెట్లను పడగొట్టారు.

అలర్ట్: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..
Older
రేపటి నుంచి ట్రంప్ చైనా పర్యటన
Older
Telangana

రేపటి నుంచి ట్రంప్ చైనా పర్యటన

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ప్రస్తుత ప్రపంచ స్థాయి ఉద్రిక్తతల దశలో ట్రంప్ చైనా సందర్శన కీలక పరిణామం అయింది. ఈ నెల 13 న ట్రంప్ చైనాకు వస్తున్నారని అధికార వర్గాలు నిర్థారించాయి,. పది సంవత్సరాల వ్యవధి తరువాత ట్రంప్ తాము తరచూ తగవుకు దిగే చైనాకు వస్తున్నారు. మూడు టి లు టెహ్రాన్, తైవాన్, ట్రేడ్ అంశాలతో వచ్చే ట్రంప్ బీజింగ్‌లో చైనా అధినేత జి జిన్‌పింగ్‌తో ముఖాముఖీ సమావేశం కానున్నారు. జిన్‌పింగ్‌ను ట్రంప్ ఇటీవలే గుడ్ , స్మార్ట్ అని పొగిడారు. తనకు చైనా నేతతో మంచి సంబందాలు ఉన్నాయని తెలిపారు. చైనాతో ఆదరణీయ వ్యాఖ్యలతో ట్రంప్ జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సదస్సుకు దిగుతారు. ట్రంప్ ఇటీవలి కాలంలో తమ సైనిక ఆర్థిక చర్యలతో ప్రపంచ వ్యాప్తంగాదౌత్యపరమైన తీవ్ర పరిణామాలను తీసుకువస్తున్న దశలో ట్రంప్ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. ప్రత్యేకించి మధ్యప్రాచ్యంలో రగులుకున్న వాతావరణం ప్రస్తుతానికి సద్దుమణిగినా ఇప్పటికీ శాశ్వత శాంతి నెలకొనకపోవడం పలు ప్రశ్నలకు దారితీసింది. ట్రంప్, జిన్‌పింగ్ చర్చలలో ప్రధానంగా ప్రత్యేకించి ఇరాన్ వైఖరి ప్రస్తావనకు రానుంది. హర్మూజ్ ర

విజయ్ ఒఎస్‌డిగా జ్యోతిష్యులు రాధన్
Older
Telangana

విజయ్ ఒఎస్‌డిగా జ్యోతిష్యులు రాధన్

తమిళనాడులో సిఎం విజయ్‌కు చాలాకాలంగా జ్యోతిష్యులుగా ఉన్న రాధన్ పండిట్ వెట్రివల్‌కు ప్రత్యేక గౌరవం కల్పించారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి(రాజకీయాలు) ఒఎస్‌డిగా మంగళవారం నియమించారు. ఎన్నికలలో విజయ్ పార్టీ విజయం, ప్రభుత్వ స్థాపన తరువాత ఆయనకు ఈ స్థానం కల్పించారు. రాధన్ పండిట్‌కు జ్యోతిష్యం చెప్పడంలో మంచి పేరుంది. పలువురు రాజకీయ నాయకులకు ఆయన ఎప్పుడూ సరైన సలహాలు ఇస్తూ , నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ వచ్చారు. ఈసారి ఎన్నికలో విజయ్ పార్టీ టివికె విజయం తధ్యం అని ఆయన జోస్యం చెప్పారు. విజయ్ ఈసారి తమ ప్రమాణస్వీకార ముహుర్తం కూడా ఈ జ్యోతిష్యుడి సూచనలను తూచా తప్పకుండా పాటించి ఖరారు చేసుకున్నాడు. విజయ్ రాజకీయ రంగప్రవేశం తరువాత ప్రతి నిర్ణయం కూడా ఈ జ్యోతిష్యుడి ఆదేశాల మేరకు పాటిస్తూ వచ్చాడు. ఆయననే ఇప్పుడు తన ఒఎస్‌డిగా ఏర్పాటు చేసుకున్నారు.

హైదరాబాద్ అంటేనే పెహల్వాన్ల అడ్డా... అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక పెహల్వాన్: మంత్రి వివేక్ వెంకటస్వామి
Older
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్
Older
Telangana

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్

ఇలాంటి ప్రశ్నాపత్రాల అక్రమ రవాణా సాధారణంగా అత్యంత గోప్యంగా నిర్వహిస్తారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో నెట్‌వర్క్‌ను విస్తరించడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిపై నిఘా ఉంచిన సీబీఐ, ప్రశ్నాపత్రం లీక్ చైన్‌లో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ‘రేపటి పరీక్షలో ఇవే వస్తాయి’ అనే ఒక సందేశంతో ప్రారంభమైన ఈ వ్యవహారం చివరకు దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రశ్నాపత్రం మాఫియాను బయటపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.దర్యాప్తు వివరాల ప్రకారం, సికర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మొదట ప్రశ్నాపత్రాన్ని రూ.30 వేలకే తనకు పరిచయమైన ఒక విద్యార్థికి విక్రయించాడు. ఆ విద్యార్థి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికర్‌కు చెందినవాడిగా గుర్తించారు. పరీక్షకు కేవలం ఒక రోజు ముందు ఆ ఎంబీబీఎస్ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని సికర్‌లో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న తన తండ్రికి పంపించాడు. ‘నాన్నా.. సికర్‌కు చెందిన ఓ స్నే

పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‎కు పోలీసుల నోటీసులు
Older
పటాన్ చెరులో అగ్నిప్రమాదం... శ్రీరామ్ వెహికల్ ఫైనాన్స్ గోదాంలో మంటలు..
Older
మెగా హీరోకి థియేటర్ల షాక్.. జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం: తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం
Older
IPL 2026: ఐపీఎల్లో ఈ క్రికెటర్ల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు.. వాళ్లు పేర్లు తెలిస్తే షాకే!
Older
సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన 2008 డిఎస్సి  టీచర్లు
Older
Telangana

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన 2008 డిఎస్సి టీచర్లు

అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ౨౦౦౮ డిఎస్సి అభ్యర్థులు 1175 మందికి ఉపాధ్యాయులు గా నియమించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆ ఉపాధ్యాయులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మహాత్మా జ్యోతి బా ఫూలే ప్రజాభవన్‌లో 2008 డిఎస్సి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 సంవత్సరాలుగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమకు చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికల పోస్టింగ్స్ మార్చాలని వారు సిఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సర్వీస్ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
Older
Telangana

రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం(మే 13) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,67,285 మంది, రెండో సంవత్సరం ప్రైవేట్ విద్యార్థులు 1,31,073 మంది హాజరుకానున్నారు.

రైల్ రోకో కేసులో టిఆర్ఎస్ చీఫ్ కు సమన్లు
Older
Telangana

రైల్ రోకో కేసులో టిఆర్ఎస్ చీఫ్ కు సమన్లు

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో చేపట్టారు. కల్వకుంట్ల కవితతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు చేపట్టిన రైల్ రోకో కారణంగా సిర్నపల్లి- ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్‌లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును నిలిపివేశారు. రైల్ రోకో చేపట్టిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్‌ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్‌ఎస్ నాయకులపై రైల్వే చట్టం కింద 147, 74(ఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజర

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ
Older
Telangana

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. హాస్పిటల్ ఎ,బి,సి బ్లాకులన్నీ మంత్రి కలియ తిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ల్యాబ్‌లు, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్‌మెంట్లను మంత్రి పరిశీలించారు.ఆసుపత్రి ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిని సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గుండె సంబంధిత వ్యాధుల

మీ నిర్ణయం కరెక్ట్ కాదు: జ్యోతిష్యుడిని OSDగా నియమించడంతో CM విజయ్‎పై విమర్శలు..!
Older
అస్సాం సిఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం
Older
Telangana

అస్సాం సిఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ,కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అస్సాంలో వరుసగా రెండోసారి సిఎం పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా హిమంత నిలిచారు. ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులు ప్రమాణం చేశారు. అస్సాంలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. 126 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయేకు 102 మంది సభ్యుల బలముంది. బీజేపీ ఒక్కటే 82 సీట్లు గెల్చుకోగా, దాని కూటమి భాగస్వాములైన ఎజీపీ, బీపీఎఫ్ చెరో 10 సీట్లు దక్కించుకున్నాయి. దీంతో ఎన్డీయే రాష్ట్రంలో వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సోనియా నివాసంలో సందడి
Older
Telangana

సోనియా నివాసంలో సందడి

కరళలో కాంగ్రెస్ సారధ్య కూటమి గెలిచినా ఇప్పటీక ముఖ్యమంత్రి ఎవరు ? అనేది చిక్కుముడిగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం కెపిసిసి మాజీ అధ్యక్షులు మురళీధరన్‌తో చాలా సేపు సమావేశం అయ్యారు. తరువాత పలువురు పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. వెంటనే నాయకుడిని ఎంపిక చేయాలని ఈ సందర్భంగా రాహుల్ నిర్ణయించినట్లు వెల్లడైంది. మంగళవారం రాత్రి కానీ, బుధవారం ఉదయం కానీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకోగానే కేరళ విషయంపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. సిఎంగా ఒకరిని ఎంపిక చేసిన తరువాత విషయాన్ని మేడం సోనియా గాందీతో మాట్లాడి రాహుల్, ఖర్గే తుది నిర్ణయం ప్రకటిస్తారని మురళీధరన్ తెలిపారు. కేరళలో కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్ ఘన విజయం సాధించింది సిఎం పదవికి పోటీలో కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, సీనియర్ నేతలు విడి సతీశన్, రమేష్ చెన్నితాల ఉన్నారు. ముగ్గురికి హై కమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉండటంతో ఎవరు సిఎం అవుతారనేది సస్సెన్స్‌గా మారింది. కేరళ సిఎం ఎంపిక వ్యవహారంపై ఇప్పుడు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో సందడి నెలకొంది.

సనాతన ధర్మం పనికిరానిది ..రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్
Older
Telangana

సనాతన ధర్మం పనికిరానిది ..రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్

డిఎంకె నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సనాతన ధర్మం ప్రజలను మతం పేరిట విభజిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి . 2023 సెప్టెంబర్‌లో లో కూడా సనాతన ధర్మంపై ఇదే వ్యాఖ్యలు చేసి, పలు తీవ్రస్థాయి విమర్శలకు గురి అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. సనాతన ధర్మం అనేక అనర్థాలకు దారితీస్తోందని, విభేదాలను పెంచుతోందని, తమిళనాడులో ఈ వాదాన్ని తలెత్తనిచ్చేది లేదని ఉద్బేగభరితంగా తెలిపారు. తమిళ గీతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి ప్రాధాన్యత ఉండాల్సిందేనని, అతి క్రమణను సహించేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో అదికారిక లేదా ఏ ఇతర కార్యక్రమాల్లో అయిన జాతీయ గీతానికి ముందుగానే తమిళ తాయ్ వజతూ గీతాలాపనం ఉండాల్సిందే అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏ అధికారిక కార్యక్మంలో అయినా, ఇతర చోట్ల అయినా ముందు వందేమాతరం తరువాత జనగణమన తరువాతనే వేరే గీతాలను ఆలాపించాల్సి ఉంటుందని అధికారిక ఉత్తర్వులతో నోటిఫికేషన్ వెలువరించింది. విజయ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం దశలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావి

బెంగాల్‌లో కేంద్రం చోర్‌బజార్ నియామకాలపై రాహుల్ మండిపాటు
Older
Telangana

బెంగాల్‌లో కేంద్రం చోర్‌బజార్ నియామకాలపై రాహుల్ మండిపాటు

పశ్చిమ బెంగాల్‌లో బిజెపి , ఎన్నికల సంఘం సంయుక్తంగా ఇప్పుడు ఏకంగా చోర్ బజార్ ఏర్పాటు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో అధికారం మారిన తరువాత ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి నియామకాలపై రాహుల్ మంగళవారం స్పందించారు. ఇంతకు ముందు దొంగకు కొరడా దెబ్బలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ పద్థతి మారినట్లుందని ఆయన స్పందించారు. ఎంత పెద్ద చోరీ చేస్తే అంత పెద్ద నజరానా అనే బాపతుగా వ్యవహారం మారిందని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మాజీ సిఇసి మనోజ్ అగర్వాల్‌ను నియమించారు. ఇక ఇంతకు ముందు సర్ నిర్వాహకుడుగా ఉన్న సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రి సువేందుకు ప్రధాన సలహాదారు చేశారు. ఇది బెంగాల్‌లో వీరు ఓట్ల చోరీని విజయవంతం చేసినందుకు దక్కించుకున్న ప్రతిఫలం అని రాహుల్ సామాజిక మాధ్యమంతో తెలిపారు. ఇప్పుడు కథ అంతా కూడా బిజెపిఇసి చోర్ బజార్ , పవర్ లూఠీ అయిందని విమర్శించారు. సర్ ద్వారా లక్షల ఓట్లను తొలిగించడంలో పావు కదిపిన అధికారిని ఇప్పుడు సిఎం ఏకంగా తన సలహాదారుడిగా పెట్టుకుని , ఆయన పట్ల ఉదారభావం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA