5472 articles


సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు బయట ఉన్నారని, ఇది ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ప్రధానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత స్వాగతానికి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17నే మోడీ జన్మదినం కూడా కావడం తెలంగాణ ప్రజలకు మరింత గొప్ప భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోందని రాంచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే రూ.9,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ దేశానికి అంకితం చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే


నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జాఆ్ల బాల భవన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభివృద్ధి కమిటీ సభ్యులు హమీద్ ఖాన్, పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షురాలు వెన్న కవిత రెడ్డి, యోగ గురువు నాగేశ్వర్ రావు హాజరై నటరాజ స్వామికి సరస్వతి దేవి చిత్ర పటానికి పూల మాలలు వేశారు. తదుపరి చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా అమ్మ గురించి, మహిళా, ఆడబిడ్డ విలువ […] The post సూర్యాపేట బాల భవన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన విజయ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తిరు సి జోసెఫ్ విజయ్‌కు అభినందనలు, ఆయన పదవీ బాధ్యతల దశలో శుభాకాంక్షలు, తమిళ ప్రజల జీవితాలు విలసిల్లే దిశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు.
నవతెలంగాణ – హైదరాబాద్‌హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగం, విదేశీ మారక ద్రవ్యం ఆదా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌ను […] The post పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: ప్రధాని నరేంద్ర మోడీ appeared first on Navatelangana.




హైదరాబాద్ : బిజెపి పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బిసిలకు అన్యాయం చేస్తూనే ఉందని, బిసిలకు ద్రోహం చేస్తున్న బిజెపి చరిత్రలో పతనం కాక తప్పదని అఖిలపక్ష నేతలు తీవ్రంగా హెచ్చరించారు. జాతీయ జనగణనలో సమగ్ర కులగణన చేపడతామన్న ప్రధాని హామీని విస్మరించినందుకు నిరసనగా ఆదివారం ప్రధాని తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ బిసి సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో షాద్‌నగర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఓబిసి స్టేట్ చైర్మన్ ఈర్లపల్లి శంకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాం, బిఆర్‌ఎస్ శాసనమండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస

నవతెలంగాణ-మద్నూర్ఆదివారం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు మద్నూర్ మండలంలోని సోమూరు గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు సోమూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం సురక్షితమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పాలన దేశ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు […] The post ప్రధాని మోడీ సభకు భారీగా తరిలిన సోమూర్ ప్రజలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-మద్నూరడివిజన్ స్థాయి ప్రజావాణిని స్థానిక ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ ఎండీ ముజీబ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని మరోసారి ఆయన గుర్తు చేశారు. The post డివిజన్ స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: తహశీల్దార్ appeared first on Navatelangana.

బంగారం కొనుగోలుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బంగారం ధర భారీగా పోరిగిపోయిందని.. ఏడాదిపాటు ప్రజలు బంగారం కొనడం ఆపేయాలని సూచించారు. ఇక, వంట నూనెల వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలని చెప్పారు. అలాగే, ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు. విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నామని.. రసాయన ఎరువుల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. వ్యవసాయంలో డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నాంమని.. వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని అన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని.. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోగలమని మోడీ చెప్పారు.
నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఉషా సంతోష్ మేస్త్రీ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంతోష్ మేస్త్రి అత్తగారు వారు కుటుంబ సభ్యులతో ఆదివారం మహారాష్ట్ర నుండి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దీంతో సర్పంచ్ అత్తగారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీరు మహారాష్ట్ర నుంచి వచ్చి మమ్మల్ని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. The post సర్పంచ్ సంతోష్ మేస్త్రీకి ఘన సన్మానం appeared first on Navatelangana.

చెన్నై: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మూడు పథకాలను ప్రకటించారు. ఉచిత విద్యుత్, మహిళా భద్రత, డ్రగ్స్ నిరోధక చర్యల పథకాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకాలతో కూడిన ఫైలుపైనే విజయ్ తొలి సంతకం చేశారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రెండు నెలల్లో వారు వాడే 500కు పైగా యూనిట్ల విద్యుత్‌లో 200 యూనిట్ల వరకూ ఎటువంటి బిల్లు లేకుండా చేశారు. రాష్ట్రంలో మహిళలు భద్రతాయుతంగా తిరిగేందుకు సింగ పెన్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి మహిళల భద్రతకు తగు ఏర్పాట్ల అధునాతన సాంకేతిక పరికరాలు, అవసరం అయిన సిబ్బంది ఉంటుం సింగపెన్ అంటే తమిళంలో సివంగి అనే అర్థం ఉంది. మాదకద్రవ్యాల ఆటకట్టుకు 65 యాంటి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. డ్రగ్స్ ప్రవేశం, రవాణా, వాడకానికి ఈ బృందాలు ఎక్కడికక్కడ చెక్ పెడుతాయి.
తహశీల్దార్ రవికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుజనగణన-2027లో భాగంగా మొదటి దశలో ఇండ్ల గణన సోమవారం నుండి జూన్ 9 వరకు కొనసాగుతుందని ఇందుకు ప్రజలు అధికారులకు సహకరిస్తూ పూర్తి సమాచారం ఇవ్వాలని మండల తహశీల్దార్ రవికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇండ్ల గణనకి సంబంధించి ఉపాధ్యాయులు గణకులుగా మండలంలోని ఆయా గ్రామాల్లోని నివాస యోగ్యమైన,నివాస యోగ్యం కాని ప్రతీ ఇంటిని,పాఠశాలలను,హాస్టల్స్ ని, వాణిజ్య పరమైన ఇండ్లను కూడా సందర్శించి గణన చేస్తారని […] The post జనగణనకు ప్రజలు సమాచారం అందించాలి appeared first on Navatelangana.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో సంజూ శాంసన్(28), రుతురాజ్ గైక్వాడ్(42), ఉర్విల్ పటేల్(65)లు ధనాధన్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయాన్ని అందుకుంది. దీంతో లక్నో ప్లేఆఫ్ చేరుకోకుండానే ఇంటిదారి పట్టనుంది.అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ 33 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సులతో 85 పరుగులు చేశాడు. చివర్లో షహబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలింగ్‌లో ఓవర్‌టన్ 3, అన్షుల్ 2. నూర్ 1 వికెట్ తీశారు.
ఆర్.సీత,పీ ఓ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శినవతెలంగాణ-ఆలేరు టౌన్ బీ జే పీ ఎంపీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనతో మోడీ మాట్లాడుతున్న భేటీ బచావో,భేటీ పడావో అనే మాట వట్టి బూటకమని తేలిపోయిందని,మోడీ మాట్లాడే బచావో నిజమైతే బీ జే పీ,మంత్రి కొడుకు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ, ఆలేరు పట్టణంలో ఆదివారం ప్రగతిశీల […] The post మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగికదాడితో మోడీ బేటీ బచావో-బేటి పడావో వట్టి బూటకం appeared first on Navatelangana.
మిల్లర్ల అక్రమ కటింగ్‌లను అరికట్టాలని డిమాండ్నవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అనంత రాజేందర్ రెడ్డి, సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఏపీఎం బాలచంద్రయ్య, ఐకేపీ సీసీ రాజు, వీఓఏ తొల్ల రాజు యాదవ్, డిప్యూటీ సర్పంచ్ రెసోజు శ్రీనివాసులు, వార్డు సభ్యులు భారతమ్మ, […] The post ఉప్పరపల్లిలో ఐకేపీ సెంటర్ ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణను నెంబరు వన్ చేయడమే తమ లక్ష్యమని.. తెలంగాణ అభివృద్ధికి మోడీ సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.పీఎం మోడీ హైదరాబాద్ ఆదివారం హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంవోత్సవాలు చేశారు ప్రధాని మోడీ.ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా […] The post అభివృద్ధిపై అందరం దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.