25301 articles

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య ఆదివారం దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్.. తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (111 నాటౌట్) సెంచరీతో చెలరేగిపోయాడు. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుమార్ కుశాగ్ర (63 నాటౌట్) అర్థ శతకం సాధించాడు. అంతకు ముందు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం జోడించి శుభారంభం అందించారు అభిమన్య రనౌట్ కాగా.. సౌత్ జోన్ బౌలర్లలో చామ మిలింగ్ 2, త్రిపురాణ విజయ్ ఒక వికెట్ పడగొట్టారు.

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. తమిళ నటుడు, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ కీలక పాత్రలో మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న తెలుగు సిరీస్ ‘పంచనామా’. ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిద్దె విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం థ్రిల్ పంచేలా దీన్నొక క్రైమ్ మిస్టరీ థ్రిలర్‌గా తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు చనిపోవడం వెనుక కారణం ఏంటి? దాన్ని పోలీస్ ఆఫీసర్ భరత్ ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. శివాజీ రాజా, మేథా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాథికా ప్రీతి, సూర్య, శ్రీజ, మోహన్ వ్రీవాత్సవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.




అమరావతి: తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎఎస్ షర్మిల సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ సోమల రఘురామ్‌కు తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయనున్నట్లు తెలిపారు. వరుడి కుటుంబానిది కర్నూలు జిల్లా కాగా.. అమెరికాలో స్థిరపడ్డారని తెలిపారు.


హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రావాలనేది డైవర్షన్ లో భాగమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ పై చట్టం చేయాలని, ఉద్యమకారులపై వేసిన కేకే కమిటీ ఏమైంది? అని కవిత ప్రశ్నించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. డిజిపి సివి ఆనంద్ వచ్చాక క్రైమ్ రేట్ పెరిగిందని, డిజిపి ప్రయోషన్ తో వచ్చారా? పైరవీతోనా అని ప్రశ్నించారు. తనపై అసభ్య పోస్టులు పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్ ను వేటుతో సరిపెట్టారని, అదే పోస్టు తమ కుటుంబ సభ్యులపై పెడితే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని కవిత విమర్శించారు.


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో భవనం కూలినట్లు సమాచారం అందగానే.. సహాయక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఢిలీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు ఎదురుగా ఉండే ఈ భవనంలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఈ భవనాన్ని విద్యార్థుల పేయింగ్ గెస్ట్ హాస్టల్‌గా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో చాలా మంది గదుల్లోనే ఉన్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.



న్యూఢిల్లీ : దేశంలోని ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థల వద్ద సుమారు రూ.98,000 కోట్ల విలువైన ఇన్వెంటరీ నిలిచిపోయిందని వెక్టర్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. మెరుగైన ఇన్వెంటరీ నిర్వహణ ద్వారా ఇందులో రూ.29,000-39,000 కోట్ల వరకు నిధులను తిరిగి సమీకరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్కింగ్ క్యాపిటల్‌లో విడుదలయ్యే మొత్తంలో రూ.4,000-5,600 కోట్లు ఎంఎస్‌ఎంఈ రంగం నుంచే సమకూరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దేశంలోని ఆటో విడిభాగాల తయారీదారుల్లో సుమారు 80 శాతం ఎంఎస్‌ఎంఈలే ఉన్నాయి. వెక్టర్ కన్సల్టింగ్ గ్రూప్ రూపొందించిన ‘ది బ్రోకెన్ ఫ్లైవీల్: బిల్డింగ్ ఎ ఫ్యూచర్-రెడీ ఆటోమోటివ్ సప్లై ఎకోసిస్టమ్’ అనే వైట్‌పేపర్ ప్రకారం.. వినియోగ ఆధారిత సరఫరా విధానాలను అనుసరించే సంస్థలు సాధారణంగా తమ ఇన్వెంటరీని 30-40 శాతం వరకు తగ్గించగలుగుతున్నాయి. తమ అమలు అనుభవాల ఆధారంగా ఈ అంచనాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ అధ్యయనం కోసం 2026 జూలై-ఆగస్టు మధ్య 21 మంది సీనియర్ పరిశ్రమ ప్రతినిధుల నుంచి సమాచారాన్ని సేకరించారు.


మహిళల ఆసియాకప్‌లో భాగంగా శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడింది. అద్భుతమైన బౌలింగ్‌తో పాక్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 55 పరుగులకే ఆ జట్టును ఆలౌట్ చేశారు. అక్కడే పాకిస్థాన్ పరువు పోయింది. అయినా కూడా పాక్ పొగరు తగ్గలేదు.. భారత్ ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వికెట్ సమర్పించుకుంది. ఈ క్రమంలో పెవిలియన్ వైపు చేయి చూపిస్తూ ఫాతిమా సంబరాలు చేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమె తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఓ ఫాతిమా సనా సెండాఫ్‌ది ఏముంది.. షెఫాలీ గతంలో కేథరిన్ బ్రంట్ వంటి వారినే చూసింది. ఇలాంటి సిల్లీ విషయాల్లో ఆమె చాలా కూల్‌గా ఉంటుంది,.’ అని ఒక నెటిజన్ ‘‘పాకిస్థాన్ జట్టుకు ఓడిపోవడడాకే కాదు.. తమ పరువు తామె ప పోగొట్టుకోవడానికి కూడా సృజనాత్మక మార్గాలు వెతుకుతోంది’ కామెంట్ చేశాడు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ప్రజలు పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నారు కానీ, తెలంగాణ వచ్చాక నిధులు, నియామకాలు కేవలం మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి దక్కాయని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంతిళ్లు కట్టుకోవాలనే పేదల కల..పదేళ్ల పాటు నెరవేరలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ..సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ విద్య, వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివితే సరిపోదని స

హైదరాబాద్: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి రాథోడ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే.

హైదరాబాద్: నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీగా మారింది. చాక్లెట్ ఇస్తానని బాలుడిని మహిళ ఎత్తుకెళ్లింది. ఆమెతో పాటు ఇంకొకరు వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయి 24 గంటలు గడిచిన బాలుడి ఆచూకీ లభించలేదు. ఏడు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఏదైనా ముఠా కిడ్నాప్ చేసింది? లేక పిల్లలు లేకపోవడంతో కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సంధ్య, నరేష్ అనే దంపతు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడో కాన్పు కోసం నిజామాబాద్‌లో జిజిహెచ్‌లో చేరారు. నరేష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి టీ తాగాడు. గ్లాసులను పక్క డస్ట్ బీన్ లో వేసేందుకు ముందుకు వెళ్లాడు. ఓ మహిళ చాక్లెట్ ఇస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లింది. మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లాడు. ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి చెప్పడంతో ఆస్పత్రిలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్: తమ పదవులకు ఎసరొస్తుందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పచ్చ కాంగ్రెస్ పెత్తనం పెరుగుతుందని అచ్చ కాంగ్రెస్ కు భయం అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే వాళ్లు ధర్నాలు చేస్తున్నారని, అంతర్గత సంక్షేభం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ధర్నా డ్రామా అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొండా సురేఖతో మొదలైన సంక్షేభం కొనసాగుతుందని తెలియజేశారు. హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, సమయానికి నరసింహస్వామి ఏం చేశారో మాజీ సిఎం కెసిఆర్ అలా చేస్తారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.



Virat Kohli Announces Retirement from Test Cricket
RRR 2: SS Rajamouli Officially Announces Sequel