21936 వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ నితేష్ తివారీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'రామాయణ పార్ట్ 1' ట్రైలర్ వచ్చేసింది. గురువారం(జూలై 30) ఉదయం మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రాముడు, సీత, రావణుడు, శూర్పణఖ, ఇతర కీలక పాత్రలను పరిచయం చేశారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.రామానంద్ సాగర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ట్రైలర్‌లో రణబీర్ శిక్షణా దశలు, ముఖ్యంగా విలువిద్యలో ఆయన నైపుణ్యం, ప్రావీణ్యం కనిపిస్తాయి. అలాగే, సీతాదేవి స్వయంవర ఘట్టం కూడా ఇందులో చూపించారు. సీతాదేవిగా సాయిపల్లవి నటించారు. దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్, ఆయన భార్య కైకేయి పాత్రలో లారా దత్తా, మంథర పాత్రలో షీబా చద్దా నటించగా.. యశ్ రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ నటిస్తున్నారు. ఆయన సోదరి శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇక..రాక్షస యువరాజు, శూర్పణఖ భర్త అయిన విద్యుజ్జిహ్వుడి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్న








నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ ఐరోపా దేశాలను కార్చిచ్చు కకావికలం చేస్తోంది. ఫ్రాన్స్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తుండగా, గ్రీస్‌లో విధి నిర్వహణలో ముగ్గురు ఫైర్‌ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన వేడి, కరవు, బలమైన గాలుల కారణంగా ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నైరుతి ఫ్రాన్స్‌లోని గిరోండే ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు పారిస్ నగరానికి నాలుగు రెట్ల విస్తీర్ణంలో వ్యాపించిందని అధికారులు తెలిపారు. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. […] The post దక్షిణ ఐరోపా దేశాలను కకావికలం చేస్తున్న కార్చిచ్చు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. The post నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 52 మంది విద్యార్థినులు జ్వరం, ఒళ్లు నొప్పుల బారిన పడ్డారు. తీవ్రంగా ఉన్న 7 మందిని ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారికి కళాశాలలోని వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఈఓ బాధితులను పరామర్శించారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. The post ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత appeared first on Navatelangana.











మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై సమావేశం కానున్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీబ్యారేజీల మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై చర్చించనున్న ఎన్‌డిఎస్తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తాంఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతాంకర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంమన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఈనెల 31వ తేదీన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం నిర్వహించనుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. బ్యారేజీల భద్రత, మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీనిచ్చారు. అటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని మంత్రి ఉత్తమ్ చాలెంజ్ చేశారు.ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌తో తెలంగాణ రా

పిసిసి పనితీరుపై ఏఐసిసి సీరియస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంమంత్రులకు, ఎంఎల్‌ఎలకు మధ్య అంతరం ‘సర్’ ఆశించిన విధంగా సాగడం లేదు జెడ్‌పిటిసి, ఎంపిటిసి, ఐదు కార్పొరేషన్ల ఎన్నికలకు పార్టీ సమాయత్తం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ నామినేటెడ్ పదవులపైనా సమాలోచనలుతాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించిన నేతలుమన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి పని తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు జిల్లాల్లో మంత్రులకు-ఎమ్మెల్యేలకు మధ్య, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయం కొరవడిందని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) ఆశించిన విధంగా జరగడం లేదని కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభి