21936 వార్తలు

నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలతో రైతుల్లో చిగురించిన ఆశలు నాట్లకు సిద్ధమౌతున్న రైతులు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం వేములవాడ మూలవాగుకు భారీగా వరద గోదావరిఖని, మంథనిల మధ్య నిలిచిపోయిన రాకపోకలు అత్యధికంగా ఏటూరు నాగారంలో 152 మి.మీ. వర్షపాతం ఎల్లంపల్లికి జలకళ నంది పంపుహౌస్‌లో 4 బాహుబలి మోటార్లు ప్రారంభంమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నా యి. మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతుల్లో సా గుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వ ర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ శా ఖలు, వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తుండగా, తాజాగా కురిసిన వర్షాలు గ్రామీణ ప్రాంతాల రైతుల్లో ఆనందాన్ని తీసుకొచ్చాయి. చాలా రోజులుగా ఎండిపోయిన వాగులు, వంకలు, చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమవడంతో రైతులు సాగు పనులపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి.

విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదంబిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో రభసవిద్యార్థులపై పోలీసుల దమనకాండకు హోంమంత్రి అమిత్‌షాయే బాధ్యుడని తీవ్ర ఆరోపణ ఎన్‌డిఎ నేతల అభ్యంతరం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధంరాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ న్యూఢిల్లీ: దేశంలోని లక్షలాది మంది అభ్య ర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం తీ సుకువచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు- 2026’కు లోక్‌సభ బుధవారం ఆమో దం తెలిపింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీ క్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. బిల్లులో ఇందుకు అవ సరమైన సవరణలు పొందుపరిచామని కేం ద్రం తెలిపింది. అనుభవాల నుంచి పాఠాల ను నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి తాము తీసుకు వచ్చిన స వరణ బిల్లే నిదర్శనమని పేర్కొంది. నీట్ పేపర్ లీక్, అవకతవకలు, విద్యా వ్యవస్థపై పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వంటి వరుస పరి

ట్రైనీ ఐపిఎస్ వేధింపులపై ప్రాథమిక ఆధారాలు లభ్యం ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితురాలు పరిచయం ప్రేమకు దారితీసిన స్నేహంఎన్‌పీఏ శిక్షణలో ఇద్దరి మధ్య బలపడిన సంబంధంఆ తర్వాత మనస్పర్ధలు బెదిరింపులకు దిగిన ఉదయ్‌కృష్ణారెడ్డి కేసు వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జనార్ 14 రోజుల రిమాండుకు ఉదయ్మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కేసు నేపథ్యాన్ని హైదరాబాద్ నగర కమిషనర్ వి.సి సజ్జనార్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయ్‌కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పని చేశాడని, యూపిఎస్‌సి రాసి 2025 బ్యాచ్‌లో ఐపిఎస్‌గా ఎంపికయ్యాడని, ఉదయ్‌కృష్ణారెడ్డి 2025 డిసెంబర్ నుంచి ఎన్‌పీఏ శ

సుప్రీం తీర్పుతో కీలక ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకిసీతమ్మ సాగర్‌తో 36 టిఎంసిల నీటి నిల్వ సామర్ధం సీతారామ లిఫ్ట్‌తో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి తుమ్మలమన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి రి జర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు రా ష్ట్ర సాగునీటి రంగానికి ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశంలో ప్ర త్యేక చొరవ చూపి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీ ర్పుతో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమున్న సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సీతమ్మసాగ ర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు రాష్ట్ర జలవనరుల చరిత్ర

వచ్చే పదేళ్లకు ప్రణాళికలుమూడు రెట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంన్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) భవిష్యత్ అవసరాల కోసం భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో భాగంగా 2037 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.17 లక్షల కోట్ల భారీ మూలధన వ్యయం చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుకోవాలని ఈ ప్రభుత్వ రంగ సంస్థ లక్ష్యంగా […] The post ఎన్‌టీపీసీ రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు appeared first on Navatelangana.

64 శాతం వాటాల కొనుగోలుకు ప్రయత్నం21 నౌకాశ్రయాల నిర్వహణపై దృష్టి..!న్యూఢిల్లీ : బ్రిటన్ లోని అతిపెద్ద పోర్టుల ఆపరేటర్ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఎబిపి)లో 63.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్) తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం. 2031 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ యూటిలిటీ కంపెనీగా ఎదగాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్ల ఆధీనంలో ఉన్న ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి […] The post బ్రిటన్ ఏబీపీపై అదానీ పోర్ట్స్ కన్ను appeared first on Navatelangana.

నెల రోజుల్లోనే కోస్పి సూచీ 43 శాతం పతనంసియోల్ : చైనా నుంచి వస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) పోటీ మరోవైపు చిప్ తయారీ దిగ్గజాల షేర్లు భారీగా కుప్పకూలడంతో దక్షిణ కొరియా ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కోస్పి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీ భారీ నష్టాలను చవిచూడటంతో గత నెల రోజుల వ్యవధిలోనే రికార్డు గరిష్ఠాల నుంచి ఏకంగా 43 శాతానికి పైగా పతనమైంది. మంగళవారం మార్కెట్ ఆరంభంలోనే […] The post సంక్షోభంలో దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ appeared first on Navatelangana.

నిరసనకారులతో చర్చలు జరపాల్సిందిదేశవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తల అభిప్రాయంన్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో దేశ ప్రజల నుంచి ఈ నిరసనకు మద్దతు లభిస్తోంది. కాగా ఢిల్లీలో నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ శ్రేణుల్లో సైతం అసంతృప్తి వ్యక్తమవుతోంది. యువత ఆగ్రహం నిజమైనదేనని, పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగం ప్రజల్లో నిరసనకారుల పట్ల సానుభూతిని […] The post యువత వైపే ప్రజల సానుభూతి appeared first on Navatelangana.

రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనవతెలంగాణ-కొంపల్లిపులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. బుధవారం ‘గ్లోబల్ టైగర్ డే’ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమీ ఆధ్వర్యంలో డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పులుల సంరక్షణ, ఆరోగ్యకరమైన అడవులు.. జీవ వైవిధ్యానికి ప్రతీక అని అన్నారు. […] The post పులుల సంరక్షణలో భాగస్వాములు కావాలి appeared first on Navatelangana.

రూ.1.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా : స్పీక్ అధ్యక్షులు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్‌నవతెలంగాణ – బంజారాహిల్స్కబ్జాదారుల చెరలో ఉన్న సుమారు రూ.1.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని స్పీక్ అధ్యక్షులు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్ అన్నారు. హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ […] The post హైడ్రా కమిషనర్ తొలగింపుపై అప్పీలుకు వెళ్తాం appeared first on Navatelangana.

కిలో రూ.550 లకు అమ్మిన వ్యాపారులునవతెలంగాణ -అచ్చంపేటవిశాఖ నుంచి కొందరు చేపల వ్యాపారులు బుధవారం అచ్చం పేటకు ట్యూనా అనే సముద్రపు చేపలు విక్రయించడానికి తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప 60 కిలోల పైగా ఉంటుంది. కిలో 550 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయించారు. పట్టణ ప్రజలు చేపల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మనిషి బరువు, గుండెజబ్బులను నియంత్రించే పోషకాలు ట్యూనా చేప మాంసంలో ఉంటాయని వ్యాపారులు వినియోగదారులకు వివరించారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడానికి […] The post అచ్చంపేటలో సముద్రపు చేపల విక్రయాలు appeared first on Navatelangana.

మేషంఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన ఋణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. మిధునం చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. కర్కాటకం చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. సింహం ఋణదాతల ఒత్తిడులు చికాకు కలిగి

న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈనెల 24న పెద్దలసభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. సవరించిన బిల్లు ప్రకారం ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఆలపించే సమయంలో ఎవరైనా ఆటంకం కలిగించినా క్రిమినల్ చర్యగా భావించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.వందేమాతరం బిల్లులో భాగంగా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్-1971’లో సవరణలు చేయాలని కేంద్రం ఇటీవల ప్రతిపాదించింది. జాతీయ గీతమైన ‘జనగణమన’ ప్రస్తుతం ఈ చట్టపరమైన రక్షణ లభిస్తోంది. తాజాగా సవరించిన వందేమాతరం బిల్లుతో ఈ చట్టపరమైన రక్షణ వందేమాతరానికీ వర్తిస్తుంది. వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించడంతో పాటు దోషులకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు.వందేమాతర 150వ వార్షికోత్సవం సందర్భంగా బిల్లుకు సవరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ గేయాన్ని బకించంద్ర ఛటోపాధ్యాయ రచించగా, ఆ తర్వాత ఆయన నవల ‘ఆనందమఠ్’లో దానిని చేర్చారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో శక్

న్యూఢిల్లీ: జనన మరణాలు నమోదులో జాప్యం జరుగుతుండటంపై కేంద్రం మరింత కఠిన నిబంధనలను తెచ్చింది. ఈ జాప్యాన్ని నివారించి సకాలంలో వీటిని రిజిస్టర్ చేసేలా పౌరులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొంది. ఇందుకు సంబంధించి ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ బరత్స్ అండ్ డెత్స్ (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ విపక్ష సభ్యుల నిరసనల మధ్య బుధవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్‌లో ఏడాది నుంచి రెండేళ్లు జాప్యం చోటుచేసుకుంటే జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం), సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. వారి సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2 సంవత్సరాలకు మించి జాప్యం జరిగితే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం-1969 ప్రకారం వీటి నమోదు తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం జారీ చేసే సర్టిఫికెట్‌కు లీగల్ ఐడెంటిటీ ఉంటుంది. 2023లో దీనిని సవరించారు. సవరించిన చట్ట నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వీటిని సమర్ధవంతంగా అడ్డుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ‘శత్రువులను మనం అత్యంత ఘోరంగా దెబ్బకొట్టబోతున్నాం.. వారికి గట్టిగా బుద్ధి చెబుతాం’ అని ట్రంప్ ఒక ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో తెలిపారు. సంఘటన వివరాల ప్రకారం, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గారడ్స్ కారప్స్ అర్ధరాత్రి వేళ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే వాటిని గాల్లోనే కూల్చేసింది. ఈ దాడిలో అమెరికా సైనిక సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించేందుకు ఇరాన్‌పై అమెరికా తాత్కాలికంగా దాడులు నిలివేసిన తర్వాత యూఎస్ స్థావరంపై టెహ్రాన్ దాడి చేయడం ఇదే ప్రథమం, కాగా, జోర్డాన్ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడిని కువైట్, ఖతార్ దేశా


మన తెలంగాణ/హైదరాబాద్ : గోల్డ్ స్కామ్ కేసులో టాలీవుడ్ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే రూ.2.21 కోట్ల గోల్ స్కామ్ కేసులో ’లఫూట్ గ్యాంగ్’ నిర్మాత కే.లక్ష్మీకాంత్ రెడ్డిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాంపల్లి 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాధితుడు రాకేష్ బలరాం గౌడ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి, విడతల వారీగా రూ.2.21 కోట్లు తీసుకుని, బంగారం ఇవ్వకుండా, డబ్బు తిరిగి చెల్లించకుండా మో సం చేసినట్లు కంప్లైంట్‌లో ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే... తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తగిన చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించ గా రూ.2.21 కోట్లు కావడంతో దర్యాప్తును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు


మన తెలంగాణ/హైదరాబాద్‌ః జెన్-జి మహిళలను అవమానించిన బిజెపి ఎంపీ కంగనా రనౌత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేసిన జెన్-జి ఉద్యమ మహిళలపై మండి నియోజకవర్గం ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అక్కడ ఉన్న మహిళలు చదువుకోలేదు, అన్పడ్, గవార్, మంచి గృహిణి కూడా కాలేరు వంటి వ్యాఖ్యలు కంగన చేశారని ఆమె తెలిపారు. జెన్ జి అమ్మాయిలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ చేశారని ఆమె విమర్శించారు. ఎంపీ కంగన ఒక మహిళగా ఉండి మహిళలపై ఇలా మాట్లాడడం సిగు చేటని అన్నారు. ఎంపీ కంగన వెంటనే క్షమాపణ చెప్పి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు.


షర్మిలా ధన్‌ఖడ్… యువతరం మాత్రమే క్రీడల్లో రాణించి పతకాలు సాధించగలదనే అపోహను పటాపంచలు చేసింది. క్రీడల్లో సత్తా చాటడానికి వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించింది. తనను శారీరకంగా కుంగదీసిన పోలియో మహమ్మారిని ఎదిరించి గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. నలభై ఏండ్ల వయసులో షాట్‌పుట్ ఎఫ్57 విభాగం ఫైనల్లో ఏకంగా 9.81 మీటర్ల దూరం గుండును విసిరి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కామన్వెల్త్ క్రీడల పారా అథ్లెటిక్స్‌లో భారత […] The post విధిరాతను ఎదిరించి..స్వర్ణ చరిత్రను లిఖించి appeared first on Navatelangana.

వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది, కాళ్లకు బురద అంటుకోవడంతో పాటు.. ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. ఈ కాలంలో పాదాలను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. క్లీన్‌గా ఉంచుకోండి..పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. వర్షాకాలం బయట నుంచి రాగానే.. పాదాలను లిక్విడ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే.. నీటితో […] The post వర్షాకాలంలో ఇలా…. appeared first on Navatelangana.

హీరో రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందు తోంది. ఫస్ట్ గ్లింప్స్, చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. […] The post ‘ఇరుముడి’ రిలీజ్ ఎప్పుడంటే? appeared first on Navatelangana.