21938 వార్తలు

హీరో రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందు తోంది. ఫస్ట్ గ్లింప్స్, చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. […] The post ‘ఇరుముడి’ రిలీజ్ ఎప్పుడంటే? appeared first on Navatelangana.

శర్వా హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మి రాధామోహన్ సమర్పణ. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 800 మందికి పైగా జూనియర్ […] The post ‘భోగి’ భారీ క్లైమాక్స్ పూర్తి appeared first on Navatelangana.


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో పరిచయం అవుతు న్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై […] The post సర్ర్పైజ్ అవుతారు appeared first on Navatelangana.

హీరో అక్కినేని నాగ చైతన్య ‘పళ్ళబురుసు’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఫోక్ చార్ట్‌బస్టర్ ‘కొత్త సోకు’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, ఈ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేసింది. నాగచైతన్య లాంచ్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ప్రేక్షకులకు వినోదభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది.వేపపుల్లతో పళ్లు తోముకుంటున్న హీరోను చూసి గ్రామస్థులు ‘పళ్ళబురుసు తెలీదా?’ అని ప్రశ్నిం చడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ […] The post ‘పళ్ళబురుసు’ తెలీదా? appeared first on Navatelangana.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. దీంతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పొలాల్లో నిల్వ నీరు తొలగించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షాలు తగ్గే వరకు ఎరువులు, పురుగుమందుల పిచికారీని తాత్కాలికంగా నిలిపివేయాలని వ్యవసాయ వాతావరణ కేంద్రం సూచించింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలవకూడదని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.


రాష్ట్రంలో మెగా పోలీసు నియామకాలుపోలీసు, ఎస్‌పిఎఫ్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల త్వరలో ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్ వెల్లడించిన పోలీస్ నియామక మండలి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్), ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి శ్రీనివాసరావు బుధవారం నాలుగు వేర్వేరు నియామక నోటిఫికేషన్లు విడుదల చేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతంతో పాటు వివిధ భద్రతా విభాగాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు. ఈ నియామకాల్లో పోలీసు శాఖకే అత్యధిక పోస్టులు కేటాయించారు. 148 సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్),14 రిజర్వ్ ఎస్‌ఐ (ఏఆర్), 12 రిజర్వ్ ఎస్‌ఐ (టిజిఎస్‌పి), మూడు రిజర్వ్ ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్‌సిపిఎల్),27 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పిబి) పో


నవతెలంగాణ-హైదరాబాద్ : ద ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ (ఒడిషా AM/NS KHPC), పూరీ ఎంతో వైభవోపేతమైన వేడుకతో తమ రెండవ వార్షికోత్సవాన్ని సంబరం చేసింది. దీనిలో భాగంగా జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై తమ సామర్థ్యం ప్రదర్శించిన సెంటర్ యొక్క అథ్లెట్స్ కు సత్కారం మరియు ఖో ఖో ఎంపిక ట్రయల్స్ 2026 ద్వారా ఆశాజనక అథ్లెట్స్ యొక్క కొత్త బ్యాచ్ ను చేర్చుకోవడం వంటివి ఉన్నాయి. భారతదేశపు భవిష్య […] The post ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో తెలుగు కంటెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈరోజు ప్రేక్షకులు మొబైల్‌లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, […] The post దక్షిణాదిపై స్టోరీ టీవీ భారీ అడుగు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో తమ రెండవ స్టోర్ ను, దేశవ్యాప్తంగా తమ 19వ స్టోర్‌ను ప్రారంభించినట్లు మిస్సమ్మ ప్రకటించింది. ఈ స్టోర్ ప్రారంభంతో పాటుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సాంప్రదాయ వస్త్రాలను ప్రదర్శించే ప్రత్యేక ఫెస్టివ్ షోకేస్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. భారతదేశంలో పండుగల వస్త్రధారణ ఒకే సాధారణ శైలిని అనుసరించదు. ప్రతి ప్రాంతానికి రంగు, వస్త్రం, నమూనాలు, అంచులు మరియు సందర్భానుసారంగా చీరను ధరించే విధానంలో దాని స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. మిస్సమ్మ యొక్క పండుగ ప్రదర్శన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు సంబంధించిన కలెక్షన్ ల ద్వారా ఈ వైవిధ్యాన్ని […] The post విజయవాడలో నూతన స్టోర్‌ను ప్రారంభించిన మిస్సమ్మ.. appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణను ఆగస్టు 17కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంలో న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ కేసులోని ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం విదితమే. విచారణలో భాగంగా ఛార్జ్జిషీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు, ఎలక్టానిక్ ఆ రాలు, సిసిటివి ఫుటేజీలను తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం చార్జిషీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు, పత్రాల కాపీలను తదుపరి విచారణ నాటికి నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

– సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల హర్షంనవతెలంగాణ-సత్తుపల్లి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక తీర్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మైలురాయి లాంటి ‘సీతమ్మ సాగర్’ బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి, దాదాపు 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా […] The post ‘సీతమ్మసాగర్’ ప్రాజెక్టుకు బిగ్ రిలీఫ్ appeared first on Navatelangana.

ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి...!హైకోర్టులోనూ చుక్కెదురు : నాలుగు వారాలకు వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితు డు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వర కు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, అం తకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్, ప్రాసిక్యూషన్ (పిపి) మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి. డిఫెన్స్ అడ్వ కేట్ వాదనలు వినిపిస్తూ పోలీసులు బిఎన్‌ఎస్ సెక్షన్ 35(3) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని, తన క్లయింట్‌కు ఎలాంటి ముందస్తు నోటీ సులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారన్నారు. సరైన ప్రాథమిక విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం చట్ట ప్రకారం చెల్లదని, తగిన ఆధారాలు లేక పోయినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి రిమాండ్‌ను తిరస్క రించి బెయిల్ మంజూరు చేయాల


ఖరగ్‌పూర్: ఐఐటి ఖరగ్‌పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి(36) బుధవారం మధ్యాహ్న సమయంలో క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. సమాచారం అందుకున్న హిజ్లీ ఔట్ పోస్టు పోలీసులు వెంటనే క్యాంపస్‌లోని బిసి రాయ్ అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన గదిని పోలీసులు సీల్ చేసి దర్యాప్తు చేపట్టారు.


మనతెలంగాణ/హైదరాబాద్: హైడ్రాకు అందమైన భాష్యం చెప్పి, తమ ఇష్టాలకు అనుగుణంగా వాడుకుంటూ, పెద్దల భూములను రక్షించుకుంటూ పేదల ఇళ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేశారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తీసివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం కోసమే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడినట్లు రంగనాథ్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. దుర్గంచెరువు వద్ద ఉన్న నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజీ లాంటి వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు. హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్‌టిఎల్‌లో ఉన్న ఇళ్ల వద్దకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. రంగనాథ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. హైడ్రాను బ్లాక్ మెయిలింగ్‌కు సాధనంగా వాడుకోవటం సబబు కాదని, మంత్రులు అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి



మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థులను ‘ఇడియట్స్‘ అని అవమానించిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులను అవమానించడం భావ్యం కాదని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులను అవమానించినందుకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘నీట్’ సంస్కరణలపై చర్చను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన తూర్పారపట్టారు. అప్పడు కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం చేసిన ప్రకటన, యూ-టర్న్‌తో విద్యార్థులు ఆత్మబలిదానాలకు దిగారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గుళ్లకు బలైన విద్యార్థులపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ’యూత్ డిక్లరేషన్’ పేరిట ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. యువతను మభ్య
