21944 వార్తలు







నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని గడ్డి మందు తాగింది. గమనించి కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమ్స్ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని వైష్ణవి తండ్రి రాజయ్య తెలిపారు.


హైదరాబాద్: పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం వైపు వెళ్తున్న ఓ కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనిలించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు.







శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో కొత్త స్పిన్నర్‌కు అవకాశం దక్కింది. 33 ఏళ్ల సారాంశ్ జైన్‌ను ఎంపిక చేయడంతో.. అందరి దృష్టి ఇప్పుడు అతడిపై పడింది. అతడు భిన్నమైన ఆఫ్ స్పిన్నర్ అని.. శ్రీలంకతో టెస్టుల్లో తుది జట్టులో తప్పకుండా ఉంటాడని.. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ‘‘శ్రీలంకతో తొలి టెస్టులో తప్పకుండా రవీంద్ర జడేజా ఆడతాడు. గత మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్‌కూ అవకాశం ఉంది. ఇక కుల్దీప్ కూడా ఆడాలి. ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు అవుతారు. ఇక సారాంశ్ జైన్‌ను ఏడో స్థానంలో తీసుకోవడం ఖాయమే. అతడు భిన్నమైన ఆఫ్ స్పిన్నర్... బ్యాటింగ్ కూడా చేయగలడు. రిషబ్ పంత్ ఐదు, శుభ్‌మాన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తారు. యశస్వి జైస్వాల్ - కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. సాయి సుదర్శన్, బుమ్రా ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. సాయి సుదర్శన్ లేకపోవడం జట్టుకు లోటే. అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ ఆడతాడు. దేశవాళీల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. కానీ, ఫస్ ఛాయిస్ మాత్రం సాయి సుదర్శనే’’ అని అశ్విన్ అన్నాడు.


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో ఒక ఇంటిపై పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పిడుగు పడిన తీవ్రతకు ఆ ఇంట్లోని విద్యుత్ వైరింగ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. టివి, ఫ్రిజ్, ఇన్వర్టర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. భవనం గోడలకు స్వల్పంగా పగుళ్లు ఎర్పడ్డాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సిద్దిపేట ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపనని, మీ ఆరోగ్యం కంటే నాకు ఏదీ ఎక్కువకాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్ కు చెందిన సింధు క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈనెల 29, 30న రెండు రోజులపాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. ఈ మేరకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకునేందుకు పట్టణంలోని పలు వార్డుల నుంచి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.... వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చాలామంది మహిళలు మూడు, నాలుగవ స్టేజీలో వ్యాధి ముదిరిన దశలో వైద్య సహాయం కోసం తన దగ్గరికి వచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేస్తేనే ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం హైదరాబాద్ కు వెళ్లి వ్యయప్రయాసలు పడకుండా ఉండేందుకు సింధు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పార్థసారధిని సిద్దిపే



