21952 వార్తలు


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో ఒక ఇంటిపై పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పిడుగు పడిన తీవ్రతకు ఆ ఇంట్లోని విద్యుత్ వైరింగ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. టివి, ఫ్రిజ్, ఇన్వర్టర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. భవనం గోడలకు స్వల్పంగా పగుళ్లు ఎర్పడ్డాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సిద్దిపేట ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపనని, మీ ఆరోగ్యం కంటే నాకు ఏదీ ఎక్కువకాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్ కు చెందిన సింధు క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈనెల 29, 30న రెండు రోజులపాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. ఈ మేరకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకునేందుకు పట్టణంలోని పలు వార్డుల నుంచి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.... వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చాలామంది మహిళలు మూడు, నాలుగవ స్టేజీలో వ్యాధి ముదిరిన దశలో వైద్య సహాయం కోసం తన దగ్గరికి వచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేస్తేనే ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం హైదరాబాద్ కు వెళ్లి వ్యయప్రయాసలు పడకుండా ఉండేందుకు సింధు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పార్థసారధిని సిద్దిపే






మంగళవారం అర్ధరాత్రి భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత మిషిర్ బెస్రా అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు వ్యతిరేక పోరులో భద్రతా దళాలకు ఇది అత్యంత భారీ విజయంగా భావిస్తున్నారు, ఎందుకంటే ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో క్రియాశీలకంగా ఉన్న చివరి అత్యున్నత స్థాయి మావోయిస్టు నాయకులలో ఈయన ఒకరు.ఆయన తలపై రూ.1 కోటి రివార్డు ఉండటం గమనార్హం. ఈ ఆపరేషన్ లో ఆయనతోపాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.




ఎపిలో పోగాకు రైతులు మరోసారి రోడ్డెక్కారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రకాశం జిల్లా రైతులు రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. ముదిగొండ బ్రిడ్జి, టంగటూరు టోల్ గేట్ వద్ద హైవేను దిగ్భంధించారు. టోల్ ప్లాజా వద్ద రైతులు పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు.. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల అకస్మిక ఆందోళన, రాస్తారోకోతో జాతీయ రహదారిపై గంటల తరబడి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలని రైతులు కోరుతున్నారు.



మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా నీటి సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే వర్షాలు పడలేదనే కారణాన్ని చూపుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా వచ్చే సంవత్సరం వరకు మన రిజర్వాయర్లలోని నీటితో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వొచ్చని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. కానీ వర్షాలు పడలేదు, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, వ్యవసాయ మంత్రి తుమ్మల అంటున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. వీళ్లకు అవగాహన ఉండి మాట్లాడుతారో, లేక అవగాహన లేక మాట్లాడుతారో అర్థం కాదలేదని, మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా ఇచ్చేందుకు చేతకాక, అవగాహన లేక వర్షాలు పడలేదని ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు.


వెంకటేశ్ దగ్గుబాటి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. నారా రోహిత్, నివేతా పేతురాజ్, రాజా ప్రజ్వల్ను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వీడియోలను రిలీజ్ చేశారు. చిట్టిబాబుగా వెంకటేశ్, ఆయన భార్య స్వర్ణగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రలను పరిచయం చేశారు. తాజాగా ఈ జంట కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాత్రలో యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ చిట్టి బాబుతో తాను ప్రేమలో ఉన్నానని చెబుతుంది. దీంతో చిట్టి బాబు ‘ఈసారి ఎవరు కార్ మెకానికా’ అని అడగటం.. ఆ తర్వాత సంపూర్ణ చెప్పే సమాధానం నవ్వులు పూయిస్తుంది. సంపూర్ణ పాత్ర చిట్టిబాటు జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతుందో వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆక్టోబర్ 2వ తేదీను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచింది.దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రాగల 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది .అన్నారం - చండ్రుపల్లి మధ్యలో లోలెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహిస్తుంది. దీంతో కాళేశ్వరం, మద్దెలపల్లి, పలుగుల వెళ్లే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు వస్తుండగా మిర్యాలగూడ వద్ద ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పిఎస్‌కు పోలీసులు తీసుకొచ్చారు. తనపై దాడి చేయడంతో పాటు లైంగికంగా వేధించాడని ఈనెల 18న అత్తాపూర్ పోలీసులకు మహిళా ట్రైనీ ఐపిఎస్ ఫిర్యాదు చేసింది. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 20న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కృష్ణారెడ్డి కనిపించకుండా పోయాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. ట్రైనీ మహిళా ఐపిఎస్‌కు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ట్రైనీ మహిళా ఐపిఎస్ గొంతుపై మరకలు, చెంపపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఎడమ కాలిపై సైతం గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

