TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

22141 వార్తలు

మహంకాళీ బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం
తెలంగాణ

మహంకాళీ బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, ఆగస్టు 3న నిర్వహించే రంగం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఇఒ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామతీర్థ శర్మ, వేణుమాధవ శర్మ వేదమంత్రోచ్చారణలతో మంత్రిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవీవర ప్రసాద్, మంత్రి సోనాల్, మల్లిఖార్జున్, గంటా గీత, కిరణ్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.

Adminజూలై 27, 2026 - సోమవారం👁 16
హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక..రోడ్డుపై మురికినీరు వదిలితే రూ.15వేలు ఫైన్
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క
తెలంగాణ

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క, అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి సీతక్క ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సీతక్కతోపాటు కెటిఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

'Sri Sri' First Song Out: దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.. పూజా హెగ్డేతో కెమిస్ట్రీ అదుర్స్!
ఆందోళనకారులకు అండ:  కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వెబ్‌సైట్.. రూ. కోటి ఫండ్ ప్రకటించిన కపిల్ సిబల్
పలు రాష్ట్రాల్లో విద్యార్థుల నిర్బంధాలు.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక
తెలంగాణ

పలు రాష్ట్రాల్లో విద్యార్థుల నిర్బంధాలు.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక

అసోం, బెంగాల్, బీహార్‌లో విద్యార్థులు, నిరసనకారుల నిర్బంధంపై సీజేపీ ఆందోళనకేంద్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి విద్యార్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడరాదు లీగల్ సాయంతో విద్యార్థుల విడుదలకు చర్యలు తీసుకుంటాం లిఖిత పూర్వక హామీ మంగళవారం ఇస్తామని చెప్పిన కేంద్రం మాట నిలుపుకోవాలి ప్రభుత్వంపై నమ్మకంతోనే దేశవ్యాప్త సమ్మెను సస్పెండ్ చేశాం ఇచ్చిన మాటకు కట్టుబడకుంటే విశ్వాసరాహిత్యమే అవుతుంది మాట తప్పితే తదుపరి కార్యాచరణ తప్పదన్న సీజేపీ న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలకు దిగిన విద్యార్థులను అరెస్టు చేస్తున్నట్టు అసోం, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి వార్తలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్త ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరింది. సీజేపీ ప్రకటనను ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.సీజేపీ సారథ్యంలో విద్యార్థులు చేపట్టిన 36 రోజుల నిరసన ధర్మేంద్ర ప్రధా

విద్యార్థులపై ఎకె 47తో కాల్పులు.. కానిస్టేబుల్ సస్పెండ్
తెలంగాణ

విద్యార్థులపై ఎకె 47తో కాల్పులు.. కానిస్టేబుల్ సస్పెండ్

25న బీహార్ బంద్ సందర్భంగా ఘటనప్రభుత్వాల వైఖరిపై రాహుల్, తేజస్వీ మండిపాటు కేసులు పెట్టబోమన్న ప్రధాని హామీ ఏమైందని ప్రశ్న న్యూఢిల్లీ/పాట్నా: ఈ నెల 25న బీహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఓ పోలీసు అధికారి ఎకె 47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. బంద్ కారణంగా దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడకు బుల్లెట్ తగిలిందని కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.కాల్పుల ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవ

రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్:  రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది
ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయండి.. ప్లీజ్: భట్టికి విహెచ్ విజ్ఞప్తి
తెలంగాణ

ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయండి.. ప్లీజ్: భట్టికి విహెచ్ విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయండి ఫ్లీజ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముఖ్య భూమిక పోషించారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు మరణించారని, బలిదానాలు చేశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్‌మెంట్ పక్కాగా జరిగిందన్నారు. వైఎస్ ఉన్నంత వరకూ సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రియంబర్స్‌మెంట్ సక్రమంగా చేయడం లేదన్నారు. వైఎస్ శిష్యునిగా చెప్పుకునే భట్టివిక్రమార్క ఈ విషయంలో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బిసిలంతా తనపై వత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచిందన్నారు. విద్యార్థుల పోరాటం శుభసూచికంగా ఆయన అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందన్నారు. విద్యారులకు నష్టం జరుగుతుందని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారని ఆయన తెలిపారు. 21 ఏళ్ళకే యువత ఎన

విజయ్ ‘జన నాయగన్’ షోలు నిలిపివేత.. ఇదే కారణం
తెలంగాణ

విజయ్ ‘జన నాయగన్’ షోలు నిలిపివేత.. ఇదే కారణం

చెన్నై: తమిళనాడు సిఎం నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి మరో సమస్య వచ్చి పడింది. చెన్నైలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా షోలను నిలిపివేశారు. సినిమా మధ్యలోనే షోను నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లకు మైనర్లు రావడంతో.. షోను ఉన్నట్టుండి నిలిపివేశారు. ఆదివారం ఉదయం చెన్నైలోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేశారు. ‘ఎ’ రేటెడ్ సినిమాలకు మైనర్లను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. దీంతో షో ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల గందరగోళం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో సెన్సార్ బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మరింత దృష్టి పెట్టాయి. మైనర్లతో వచ్చే వారిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశాయి.

లోక్‌సభ వాయిదా.. ఆ బిల్లుపై మంగళవారం చర్చ
తెలంగాణ

లోక్‌సభ వాయిదా.. ఆ బిల్లుపై మంగళవారం చర్చ

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2014 పరక్షల (అకరమ పద్ధతుల నివారణ’) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌‌సభ ముందుకు వచ్చినా.. బిల్లపై చర్చించడం సాధ్యం కాలేదు. ఓ వైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండానే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదయం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు అనంతరం లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగ ప్రారంభమైన వెంటనే.. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మరోసారి సభను మధ్యాహ్నం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పేపర్ లీక్‌ (సవరణ) చర్చకు రాకుండా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చించి.. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.

కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!
హాస్టళ్లలో దొంగతనాలు జరిగితే యజమానులపైన ఎఫ్‌ఐఆర్: కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్
రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను పంపాలి: మాజీ క్రికెటర్
తెలంగాణ

రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను పంపాలి: మాజీ క్రికెటర్

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జాతీయ జట్టులో టి-20ల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడిని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ ఆటగాడు ఫారూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను ఓపెనర్‌గా పంపించి శుభ్‌మాన్ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని సూచించారు. దీంతో మిడిలార్డర్ బలంగా మారుతుందని పేర్కొన్నారు. ‘‘గిల్ ఒక క్లాస్ ప్లేయర్. ప్రస్తుతం జట్టులో అతనే అత్యుత్తమ బ్యాటర్ అని నా అభిప్రాయం. అయితే శుభ్‌మాన్ ఆరంభంలోనే దూకుడగా ఆడే రకం కాదు. వన్డేల్లో ఎడమ, కుడి చేతి వాటం కాంబినేషన్ బాగుంటుంది. రోహిత్‌కు జోడీగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన వైభవ్‌ను పంపాలి. వైభవ్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్‌లో రోహిత్ ఎక్కువగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ బ్యాట్‌కి పని చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మూడు, గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావాలి. అప్పుడు బ్యాటింగ్ లైనప్ పటిష్టం అవుతుంది’’ అని ఫారూక్ అన్నారు.

ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్
తాడిచెర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్
శ్రీదేవి చివరి సినిమా ‘మామ్‌’ సీక్వెల్‌లో ఖుషీ కపూర్
తెలంగాణ

శ్రీదేవి చివరి సినిమా ‘మామ్‌’ సీక్వెల్‌లో ఖుషీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’. 2017లో వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. 2018లో శ్రీదేవి చనిపోయిన తర్వాత ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తోంది. ‘ది ఆర్చీస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఖుషీ.. ఆ తర్వాత ‘నాదానియాన్’, ‘లవ్యాపా’ వంటి చిత్రాల్లో నటించారు. కానీ, ఆమెకు సక్సెస్‌ను అందించలేకపోయాయి. దీంతో మామ్ 2తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో.. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాని నోయిడా, గ్రీస్ ప్రాంతాల్లో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Arshdeep Singh: ఈమె.. నా మనిషి ..నటితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన అర్ష్ దీప్ సింగ్
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!
కొత్త సీజన్.. కొత్త హీరోతో ఓటిటిలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్
తెలంగాణ

కొత్త సీజన్.. కొత్త హీరోతో ఓటిటిలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్

ఓటిటిలోకి వచ్చే సినిమాలో ప్రేక్షకులను ఎంత అలరిస్తాయో.. అందులో వచ్చే వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ ‘వదంది’. 2022లో ఈ సిరీస్ తొలి సీజన్ వచ్చింది. ఎస్‌జె సూర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో కూడా వచ్చిన ఈ సిరీస్‌కి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ‘వదంది : ది మిస్టరీ ఆప్ మణి’ పేరిట తీసిన ఈ వెబ్ సిరీస్‌లో శశి కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ దీన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. ఆ వ్యక్తిని ఎలా జైలు నుంచి విడిపించాడు? చివరకు ఏమైంది అనేదే ఈ సిరీస్ స్టోరీ.

గాంధీ మార్గంతోనే ఉద్యమ విజయం సాధ్యమైంది: సోనమ్ వాంగ్ చుక్
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం
తెలంగాణ

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం

సంవత్సరం గడిచినా ప్రారంభం కానీ పనులుమాజీ మున్సిపల్ చెర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్ నవతెలంగాణ-అచ్చంపేటఅచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని, సంవత్సరం గడిచినా వివిధ కాలనీలో పనులు ప్రారంభం కాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ విమర్శించారు. సోమవారం మాజీ కౌన్సిలర్లు మన్ను పటేల్ రమేష్ రావులతో కలిసి ఐదవ వార్డులో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ లోని వివిధ వార్డులో ఎక్కడ వేసిన గొంగళి […] The post అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం appeared first on Navatelangana.