23343 వార్తలు

నవతెలంగాణ – హైదరాబాద్ : రేషన్ కార్డులో పేరు ఉండి, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువతకు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శుభవార్త తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళలకు బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో 30 రోజుల ఉచిత శిక్షణ, వసతి, భోజనం, శిక్షణ సామగ్రి అందించనుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌తో పాటు స్వయం ఉపాధి కోసం ముద్ర లోన్ సదుపాయం కూడా […] The post రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. appeared first on Navatelangana.


హైదరాబాద్: యువతపై జరుగుతున్న దాడులు దారుణం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఉద్యమ పార్టీగా తమకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంని అన్నారు. ఇందిరాపార్కు దగ్గర బిఆర్ఎస్ వి నిరసనలు చేపట్టారు. నల్లచొక్కా ధరించి నిరసనలో కెటిఆర్ పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కెటిఆర్ నినాదాలు చేశారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీకతీతంగా యువత పోరాడుతున్నారని, యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం మాట్లాడాలని.. వారికి అండగా ఉండాలని నిరసన చేపడుతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషమని, పిల్లలపై పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఢిల్లీ ఘటన చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయని, మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసిందని అన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోడీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యమా ఉలికిపడు అని పిలుపునిచ్చారు. ఈ జనరేషన్ చావుకు భయపడే జనరేషన్ కాదని.. ఈ జనరేషన్ ఐటీ, ఇడి, సోదాలకు భయపడేవారు కాదని సూచించారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యో


నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ‘మన్నర్ వాగైయరా’ చిత్రం నిర్మాణం కోసం ఫైనాన్షియర్ గోపి వద్ద నుంచి తీసుకున్న సుమారు రూ.4.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విమల్ విఫలమయ్యారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో గోపి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు విచారణ అనంతరం విమల్‌కు శిక్ష పడింది. అయితే, […] The post చెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి (26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో నివాసం ఉంటూ ఉద్యోగం […] The post అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడి మృతి.. appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : జంతర్‌మంతర్‌లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన సూచనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే హక్కు యూనివర్సిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘సమయం వచ్చినప్పుడు మీరే జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు. The post యూనివర్సిటీలపై రాహుల్ ఫైర్ appeared first on Navatelangana.

హరారే: టీం ఇండియా టి-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టి-20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అర్థశతకంతో రాణించగా బౌలింగ్‌లో కూడా భారత్ అద్భుతంగా రాణించింది. దీంతో కెప్టెన్‌గా శ్రేయస్ ఫుల్ ఖుషీ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘దీని కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ప్రణాళికలను చక్కగా అమలు పరిచరాు. కెప్టెన్‌గా నా మొదటి విజయం అందుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. వైభవ్ సూర్యవంశీ నిర్భంగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ అసాధారణమైనది. గతంలో వైభవ్ ఇక్కడ ఆడాడు. ఇక్కడి పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉంది. అండర్-19 ఫైనల్‌లో 175 పరుగులు సాధించిన అనుభవం ఉండటంతో మైదానంలోకి అడుగు పెట్టినప్పుడల్లా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అది స్పష్టంగా కనిపించింది. పునరాగమనం చేసిన మయాంక్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు .సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేసి ప్రత్యర్థికి పరుగుల రాబట్టే అవకాశం ఇవ్వలేదు’’ అని శ్రేయస్ అన్నాడు.

ఢిల్లీ: విద్యార్థులకు మూడు డిమాండ్లు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యామంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించే వరకు చర్చలు చేపట్టేది లేదని రాహుల్ గాంధీ సూచించారు.





ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సిజెపి నేత తెలిపారు. ప్రతి జిల్లా, గ్రామంలో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చామని అన్నారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద సిజెపి నేతలు మీడియాతో మట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని, కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరచిపోమని తెలియజేశారు. తమ మద్దతు వల్లే నెలన్నరగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయని, వారికి ఆందోళనకారుల నేపథ్యం ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు మౌనం వహిస్తే దేశం ఎప్పుడూ ముందుకు సాగదని, ఈ వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదని సిజెపి పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ అని ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతాయని సూచించారు. కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయని, ఆందోళన ఆపమని చెప్పడం కాదు..సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దనేదే తమ ప్రధాన ఉద్దేశం అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సిజెపి నేతలు కోరారు.





రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా తెరకెక్కిన చిత్రం ‘రామాయణ’. ఈ దీపావళీ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి.. ఈ సినిమా ట్రైలర్‌ని అందులో ప్రదర్శించారు. ఈ రోజు (జూన్ 24)న ఆ ట్రైలర్‌ని యూట్యూబ్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనుకోని కారణాల వల్ల ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు గల కారణాలను నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ‘‘మా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేస్తాము. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో ‘రామాయణ’ ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది. ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్ర


