23357 వార్తలు










నవతెలంగాణ-హైదరాబాద్: మరోమారు పార్లమెంట్ మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ, విద్యార్థుల నిరసనలకు సంఘీభావంగా ప్రతిపక్షాలు ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. ఉభయసభల్లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని, విద్యాశాఖ మంత్రి పదవీకి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా దేశ యువతకు ప్రధాని మోడీ […] The post మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీల ఆందోళన appeared first on Navatelangana.

యాభై ఏళ్ల జీవితం.. రెండు దశాబ్దాల ప్రజాప్రస్థానం.. తెలంగాణ రాజకీయాల్లో కెటిఆర్ సాధించుకున్న ప్రత్యేక అధ్యాయం.. రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రయాణాన్ని అంచనా వేయడం అంటే కేవలం ఆయన పదవులను, ఎన్నికల విజయాలను లెక్కించడం కాదు. ఒక సమాజం కోసం ఆయన కలలు ఏమిటీ, ఆ కలలను సాకారం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటీ, ప్రజల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు ఎంతవరకు ప్రభావం చూపిందన్నదే నిజమైన కొలమానం. అలాంటి దృష్టితో చూసినప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్న నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్). యాభై సంవత్సరాల జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న కెటిఆర్‌కు ఈ రోజు జన్మదిన వేడుకతోపాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ రాజకీయాలనుంచి అభివృద్ధి రాజకీయాల వైపు సాగిన ప్రయాణంలో కొత్త తరం నాయకత్వం ఎదుగుదలను ప్రోత్సహించిన తీరు ఎంతోమంది కార్యకర్తలు, నాయకుల గుండెల్లో కెటిఆర్ చెరగని ముద్రవేసుకున్నారు. యాభై సంవత్సరాలు ఒక నాయకుడి జీవితంలో అనుభవం, పరిపక్వతకు కెటిఆర్ రాజకీయ జీవితం నిదర్శంగా నిలస్తోంది. ఇరవై సంవత్సరాల కెటిఆర్ రాజకీయ అనుభవం ఒక పెద్ద బాధ్యత. ఈ ప్రయాణంలో

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా ‘కలర్ ఫొటో‘, ‘బేబి‘ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ‘. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ మూవీ విడుదలకానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కిరణ్ అబ్బవరం నాలుగు, ఐదు మంచి హిట్స్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీతో కూడా కిరణ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతాడు”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమాతో రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నేను చేసిన స్టీవెన్ శంకర్ రోల్ నాకు ఎంతో ప్రత్యేకం. ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి”అని తెలిపారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ- “ఈ సినిమా సెకండాఫ్‌లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట



ఢిల్లీలో జరుగుతున్నవి రాజకీయ ప్రేరేపిత ధర్నాలు..విద్యార్థులను అడ్డుపెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి






సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ ’కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథి హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ “మొదట ’కామాఖ్య’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ ఫుల్. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ’కర్మాఖ్య’ అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. ‘కర్మాఖ్య’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ “ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. అందరూ ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను. ఒక మలయాళం, హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది”అని తెలిపారు. నిర్మాత వడ్డేపల్లి శ్రీ

