23401 వార్తలు

ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సిజెపి నేత తెలిపారు. ప్రతి జిల్లా, గ్రామంలో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చామని అన్నారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద సిజెపి నేతలు మీడియాతో మట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని, కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరచిపోమని తెలియజేశారు. తమ మద్దతు వల్లే నెలన్నరగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయని, వారికి ఆందోళనకారుల నేపథ్యం ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు మౌనం వహిస్తే దేశం ఎప్పుడూ ముందుకు సాగదని, ఈ వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదని సిజెపి పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ అని ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతాయని సూచించారు. కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయని, ఆందోళన ఆపమని చెప్పడం కాదు..సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దనేదే తమ ప్రధాన ఉద్దేశం అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సిజెపి నేతలు కోరారు.





రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా తెరకెక్కిన చిత్రం ‘రామాయణ’. ఈ దీపావళీ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి.. ఈ సినిమా ట్రైలర్‌ని అందులో ప్రదర్శించారు. ఈ రోజు (జూన్ 24)న ఆ ట్రైలర్‌ని యూట్యూబ్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనుకోని కారణాల వల్ల ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు గల కారణాలను నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ‘‘మా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేస్తాము. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో ‘రామాయణ’ ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది. ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్ర











భారతీయ ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు పెద్ద షాక్ ఇచ్చారు. అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. జనరిక్ ఔషధాల తయారీ సంస్థలు అమెరికా లోనే తమ తయారీ యూనిట్లను రెండేళ్లలో ఏర్పాటు చేసుకోవాలని, అంతవరకు అమెరికా లోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండవని, ఆ తరువాత మూడో ఏడాది నుంచి 100%, నాలుగో ఏడాది నుంచి 200% సుంకాలు విధిస్తామని బుధవారం తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ ప్రకటించిన ఈ సుంకాల విధానం ప్రపంచ ఫార్మా రంగాన్ని, ముఖ్యంగా భారతీయ జనరిక్ మందుల పరిశ్రమను తీవ్ర ఆందోళన లోకి నెట్టివేసింది. నిఫ్టీ ఫార్మా సూచిక 1.31 శాతం పడిపోయింది. దీనిలోని 20 కంపెనీల్లో 18 నష్టాలతో ముగిశాయి. ట్రంప్ విధానం ప్రకారం అమెరికాకు ఎగుమతులు చేసే భారత్ ఫార్మా కంపెనీలు అక్కడే తమ తయారీ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకుంటే భారీ టారిఫ్‌లను భరించి అమెరికా మార్కెట్‌లో తమ ఉత్పత్తుల ధరలు అధికంగా పెంచుకోక తప్పదు. ట్రంప్ నిర్ణయం ప్రకారం రాత్రికి రాత్రే తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించడం సాధ్యం క

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ యాక్టు (ఎన్‌ఎస్‌ఎ) నాసా అనే అస్త్రాన్ని బయటకు తీసింది. జాతి విద్రోహులపై ప్రయోగం చేయాల్సిన ఈ నల్లచట్టం పాలుకారే ప్రాయంలో ఉన్న విద్యార్థులు, జెన్‌జెడ్ యువతపై ప్రయోగం చేయనున్నారా? అంటే ఉద్దేశం అదే కావచ్చును. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అభద్రతా భావంలోకి జారిపోయినట్లే! కాక్రోచ్‌ల ఆందోళనకు భయపడినట్లే లెక్క? ఈ భయంకరమైన అస్త్రంతో కేసులు బనాయించి కాక్రోచ్ ఉద్యమాన్ని, తద్వారా మద్దతుగా కదులుతున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే దిశగా కేంద్ర అడుగులు వేస్తుందా? కనీస విచక్షణాధికారం మరచి ఈ నెల 15నుండి దీన్ని అమలు పర్చుతున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ నెల 20న పార్లమెంటు ముట్టడి పిలుపులో భాగంగా గాయపడిన, కేసులు పెట్టబడిన విద్యార్థులమీద ఈ అస్త్రం వినియోగం చేస్తారా? లేక బెదిరింపులకు ఉపయోగిస్తారా? అనేక కేసులతోపాటు, ఆర్నెళ్ల వరకు ఎలాంటి బెయిల్ రాని ఈ నల్లచట్టం ప్రయోగానికి సిద్ధంకావడంలోని ఆంతర్యం ఏమిటి? కేంద్ర పెద్దలు ఇంత అమానుష ఆలోచన, ఈ దిశగా ప్రయాణం చేయడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి? సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జుల


భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా దేశంగా 2025 నాటికి సుమా రు 146 కోట్ల జనాభాతో చైనాను అధిగమించిన ఆనంద సమయంలోనే ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది.దేశంలోని మొత్తం సంతానోత్పత్తి రేటు 2024లో 1.9కు పడిపోయింది. జనాభా స్థిరంగా కొనసాగాలంటే అవసరమైన స్థాయి 2.1 కాగా, ప్రస్తుతం అది దాని కంటే స్పష్టంగా తక్కువగా ఉంది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు; దేశభవిష్యత్తు జనాభా నిర్మాణాన్ని పూర్తిగా మార్చగల పరిణామం. ఒకప్పుడు ‘జనాభా విస్ఫోటనం’ గురించి ఆందోళన చెందిన భారత్, ఇప్పుడు ‘జనాభా తగ్గుదల’ అనే కొత్త సవాలును ఎదుర్కొంటోంది. ఈ మార్పు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటిపైనా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనుంది. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అత్యంత తక్కువగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో అది ఇంకా ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో ఈ రేటు 1.2 కాగా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో 1.3, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో సుమారు 1.4గా ఉంది. సిక్కిం 1.05తో దేశంలోనే అత్యల్ప స్థాయిలో ఉండగా, గోవా, లడఖ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈరాష్ట్రాల్లో పి


