24109 వార్తలు





నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టెట్-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టెట్ అర్హత లేకుంటే పదోన్నతులు లభించకపోవడంతో పాటు ఉద్యోగ భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెట్ పాస్ కాని వేలాది మంది ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. […] The post ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్.. నేటి నుంచి దరఖాస్తులు appeared first on Navatelangana.






జగిత్యాల: కోరుట్ల బస్టాండ్‌లో నిలిపిన ఆర్‌టిసి బస్సును ఓ వ్యక్తి ఆపహరించిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల డిపోకు చెందిన టిఎస్ 08 జడ్ 0103 అనే నంబరు గల బస్సుకు ప్రవీణ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబరు ప్లాట్ ఫాంపై బస్సును నిలిపి డ్రైవర్ వాష్ రూమ్ కు వెళ్లాడు. ఓ దుండగుడు బస్సు అపహరించి నిజామాబాద్ వైపు వెళ్లాడు. డ్రైవర్ వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే జీపులో బస్సును పట్టుకునేందుకు వెళ్లారు. ఆగంతకుడు రోడ్డుపై బైక్‌లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. పలువరు ద్విచక్రవాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో గండి హనుమాన్ సమీపంలో రోడ్డుకు లారీని నిలిపి ఉంచారు. దీంతో బస్సు ముందుకు వెళ్లే దారి లేకి ఓ చెట్టును ఢీకొట్టి అనంతరం బస్సు ఆగిపోయింది. 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత బస్సును పోలీసులు పట్టుకున్నారు. ఆగంతకుడు పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకొని విచారిస్తున్నారు.

ఇంటి ముందు చిన్నారి పాపతో కలిసి బైఠాయింపు..! రెండో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడంటూ కన్నీరు.. న్యాయం చేయాలని డిమాండ్ మన తెలంగాణ/సైదాపూర్: మాయమాటలతో తనను నమ్మించి,జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త.. మరో మహిళ మోజులో పడి తనను,తన కన్న బిడ్డను రోడ్డున పడేశాడంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామానికి చెందిన ఈరాల మేఘన రోదిస్తూ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించి మంగళవారం ధర్నాకు దిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన మేఘనను సైదాపూర్ మండలం వెన్కేపల్లికి చెందిన ఈరాల రాజు అనే వ్యక్తితో 2022లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కట్న కానుకలతో వివాహం జరిపించారు.వీరికి ఒక చిన్నారి కూతురు క్రిత్యశ్రీ(3) జన్మించింది.పెళ్లికి ముందే రాజు మరో యువతీతో ప్రేమాయణం నడిపించాడని,ఇదంతా తెలిసి తనతో పెళ్లి చేయించి తనను,తన కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని మేఘన రోధించారు.భర్త ప్రవర్తనలో మార్పును గమనించి భర్తను నిలదీయాగ భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేస్తూ, మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారని తెలిపారు.ఈ క్రమంలోన

బెంగళూరు: భార్య, ఇద్దరు పిల్లలను చంపి అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... హుణసూరు పట్టణం న్యూ మారుతి లే అవుట్లో హరీష్(19), నిశ్చిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరష్ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అనంతరం ఇద్దరు పిల్లలు, భార్య నోటికి ప్లాస్టర్ అంటించి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. తరువాత భర్త ఉరేసుకొని చనిపోయాడు. ఇంట్లో ఉలుకుపలుకు లేకపోవడంతో ఇంటి పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










నవతెలంగాణ – హైదరాబాద్ : సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన కోరుకున్న ఆసుపత్రికి తరలించాలని మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వాంగ్‌చుక్‌కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఎయిమ్స్, […] The post సోనమ్ వాంగ్‌చుక్ కు తీవ్ర అస్వస్థత… appeared first on Navatelangana.