24605 వార్తలు



హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒఆర్ఆర్ లోని ఎగ్జిట్ 18 వద్ద ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా కారు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుబాయ్‌కు వెళ్తున్న తమ స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో సాగనంపేందుకు రెండు కార్లలో స్నేహితులు బయలుదేరారు. కెఎ 29 ఎన్ 1908 అనే నంబర్ గల స్విప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ఖాజా అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో జమీర్, యాకూబ్, అక్బర్ తీవ్రంగా గాయపడడంతో శంసాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నీలాద్రి హాస్పిటల్‌లో చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నల్లగొండ జిల్లా పెద్దవూర గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ పిల్లలు పుట్టకుండా ఉండేందుకు శస్త్రచికిత్స (ఫ్యామిలీ ప్లానింగ్) కోసం నీలాద్రి ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. శస్త్రచికిత్సకు ముందు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల ప్రాణాలు తీశాయని బంధువులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సర్ పై సీరియస్ గా దృష్టి సారించాలని, పార్టీ పరంగా సర్ ఇన్ ఛార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్న చోట ఎంపిలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సర్ పై జూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారని, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్ పై 489 భేటీలు జరిగాయని తెలియజేశారు. వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని, ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని, పదవుల కోసం గాంధీభవన్ లో అపాయింట్ మెంట్లు ఇవ్వొద్దని కోరారు. రేపటి నుంచి ఆగస్టు 3వరకు నేతలు గాంధీభవన్ కు రావొద్దని సూచించారు. కొందరు నేతలు హైదరాబాద్ లో కూర్చోని పనిచేయట్లేదని విమర్శించారు. ఇన్ ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో సర్ పై సమీక్షలు నిర్వహిస్తారని, ఎంపిలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని అన్నారు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్న చోట ఎంపిలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని రేవంత్















భారత స్టార్ షట్లర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస గేముల్లో విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. 21-17, 21-17 తేడాతో యమగుచిని ఓడించింది. ప్రతి గేము చివరి వరకూ హోరాహోరీగానే సాగింది. అయితే, ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు గేమ్‌ను ముగించింది.

హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో యువతను మోసం చేశాయని బిజెపి ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సులో యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, బిఆర్ఎస్, కాంగ్రెస్ ను రాష్ట్రంలో ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కెటిఆర్, సిఎం రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, 9 ఏళ్ల లో రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్.. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేశాయి? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కెటిఆర్ అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని, బిజెపి గురించి మాట్లాడే హక్కు..బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని మండిపడ్డారు. మాయ మాటలకు కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

