24627 వార్తలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా తన నెక్స్ట్ జనరేషన్ టయోటా హైలక్స్ పికప్ ట్రక్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త హైలక్స్ 2026 జూలై 28న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఆవిష్కరించబడనుంది. తాజా డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ మార్కెట్లోకి రానుండటంతో ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త డిజైన్: విడుదల చేసిన టీజర్‌లో కొత్త టయోటా హైలక్స్ ఆరెంజ్, బ్రాంజ్ రంగులో కనిపిస్తోంది. ముందు భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్, హనీకాంబ్ డిజైన్ సెంటర్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హెడ్‌లైట్ల మధ్యలో ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ ట్రిమ్‌పై పెద్ద అక్షరాల్లో టయోటా లోగోను అమర్చారు. పూర్తి డిజైన్‌ను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినా, కొత్త మోడల్ మరింత బలమైన, ఆధునిక రూపాన్ని సంతరించుకున్నట్లు టీజర్ సూచిస్తోంది. ఇంటీరియర్: భారత్‌లో విడుదలయ్యే టయోటా హైలక్స్ ఇంటీరియర్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా చూపించలేదు. అయితే, గ్లోబల్ మోడల్ తరహాలో డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్ కొనసాగనుంది. ఇందులో లెదర్‌తో కప్పిన స్టీరింగ్ వీల్‌పై పెద్ద టయోటా లోగో ఉ

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తొలగిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సీనియర్లు అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరం పడుతుందని, రోహిత్‌కు 2027 వరల్డ్ కప్‌లో చోటు కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. రోహిత్ సేవలను వినియోగించుకొని వరల్డ్ కప్ గెలవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ఆడిన అనంతరం రోహిత్‌కు వీడ్కోలు పలుకుతారని పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంగా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ స్పందించారు.. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సికి 39 ఏళ్లు ఉన్నప్పటికి తన జట్టును ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చాడని గుర్తు చేశారు. సెమీస్ మెస్సి ఒక్క గోల్ చేయనప్పటికి అనుభవంతో కీలకమైన అసిస్ట్ ఇచ్చాడని ప్రశంసించారు. మ్యాచ్‌ను ఫినిష్ చేసేందుకు కురాళ్లు కావాలని, కానీ సరిగ్గా గైడ్ చేయడానికి అనుభవం కలిగిన ఆటగాళ్ల అవసరం ఉందని నొక్కి చెప్పారు. అర్జెంటినా జట్టు మెస్సి సేవలు ఎంతో అవసరమో అలాగే టీమిండియా జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవసరం కూడా ఉందని సూచించారు. అది ఫుట్ బాల్ మ్యాచ్చా.... క్రికెట్ మ్యాచ్చా అనేది అనుభవం పోషి





అసూస్ భారత మార్కెట్‌లో కొత్త అసూస్ అసూస్ ప్యాడ్ T3201 ట్యాబ్‌ను ఆగస్టు 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్‌లో 2.8K OLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్, 9000mAh బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్లు అందించనుంది. కంపెనీ ఇప్పటికే ఈ ట్యాబ్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ధర ఎంత ఉండొచ్చు? అసూస్ ప్యాడ్ T3201 అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం..ఈ ట్యాబ్ భారత మార్కెట్‌లో రూ.40,000 ధర పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ధర, సేల్స్ వివరాలు ఆగస్టు 6న లాంచ్ ఈవెంట్‌లో వెల్లడికానున్నాయి. ఫీచర్లు( అంచనా) డిస్‌ప్లే: అసూస్ ప్యాడ్ T3201లో 12.2 అంగుళాల 2.8K రిజల్యూషన్ కలిగిన డ్యూయల్-లేయర్ OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్తో వస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, డిజిటల్ క్రియేటివ్ పనులకు అద్భుతమైన విజువల్ అనుభవం లభించనుంది. పన



వర్షాకాలం ప్రారంభమైన వెంటనే దోమలు, కలుషిత నీరు, తేమ వాతావరణం కారణంగా అనేక అంటువ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, జలుబు, దగ్గు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పరిశుభ్రత పాటించడం, స్వచ్ఛమైన నీరు తాగడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఏమిటి? వాటి బారిన పడకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దామా? వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు 1. డెంగ్యూ: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు కనిపించవచ్చు. 2. వైరల్ ఫీవర్ (ఫ్లూ): జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, శరీర నొప్పులు ప్రధాన లక్షణాలు. 3. టైఫాయిడ్: కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, కడుపు నొప్పి, అలసట కనిపిస్తాయి. 4. జలుబు, దగ్గు: వాతావరణ మార్పులు, వైరస్‌ల వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. 5. కలరా, విరేచనాలు: కలుషిత నీరు, ఆహారం వల్ల విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన











ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షా ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటి ధరపై 50 శాతం వరకు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ సబ్సిడీ ఎవరికీ వర్తిస్తుంది?: ఈ పథకం సాధారణ ప్రజల కోసం కాదు. కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన బైక్ టాక్సీ పైలట్లు, ఆటోరిక్షా ఆపరేటర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు డ్రైవర్ల నిర్వహణ ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. 70 కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు: సబ్సిడీతో పాటు రాష్ట్రంలో ఈవీ వినియోగం సులభతరం చేసేందుకు ప్రభుత్వం సుమారు 70 కొత్త EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులు ఛార్జింగ్ సమస్య లేకుండా సుదూర ప్రయాణాలు కూడా సులభంగా చేయగలుగుతారు. ఈ కొత్త విధానం ఎందుకు?: కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్-డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం, పరిశుభ్రమైన రవాణాను ప్రోత్సహించడం గోవా ప్ర


హైదరాబాద్: మెహదీపట్నంలో విజయనగర్ కాలనీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం తప్పింది. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తులోని బెడ్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.