
3464 వార్తలు



సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో పర్యావరణ రక్షకుడు ‘దుశ్చర్ల సత్యనారాయణ’పై జరిగిన దాడి కేవలం ఒక భౌతిక దాడి కాదు, అది మన సామాజిక అట్టడుగువర్గాల మధ్య నెలకొన్న అవగాహనా రాహిత్యానికి, వనరుల వినియోగంలో, రక్షణలో ఉన్న వైరుధ్యానికి పరాకాష్ఠ. ‘సహజ వనరుల పరిరక్షణ వేదిక’ అధ్యక్షునిగా, ఒక జర్నలిస్టుగా ఈ ఘటనను కేవలం దాడి ఘటనగానో ‘నేరం - శిక్ష’ కోణంలో కాకుండా, సామాజిక, పర్యావరణ కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్న. ఈ ఘటనలో ఒకవైపు 70 ఎకరాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న పర్యావరణవేత్త ఉంటే, మరోవైపు తమ గొర్రెల మేతకోసం పరితపించే సామాన్య గొర్రెల కాపరులు ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది... పర్యావరణ పరిరక్షణకూ, సామాజిక జీవనోపాధికీ మధ్య జరగాల్సిన సమన్వయం లోపించింది అనేది. దుశ్చర్ల సత్యనారాయణకు ఆ అడవి ఒక పవిత్ర క్షేత్రం. ఒక్కొక్క మొక్కను బిడ్డలా సాకారు. పశువులు అడవిలోకి వస్తే చిన్న మొక్కలు, ఔషధ గుణాలున్న పొదలు నాశనమవుతాయి. ఇది ఆయన దశాబ్దాల తపస్సును బుగ్గిపాలు చేయడమే అవుతుంది. ఇక ఆ చెట్లను నరికే చర్యలను అడ్డుకోవటం సహజమే. గొర్రెల కాపరుల కోణంలో చూస్తే సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు పచ్చని గడ్డి ఎక

ప్రస్తుతం ‘ఎన్‌బికె111’ చిత్రీకరణలో ఉన్న గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎన్‌బికె112’ను అధికారికంగా ప్రకటించారు. ‘ఎన్‌బికె112’కు సెన్సేషనల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ... బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు. డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాత, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మన తెలంగాణ/మోత్కూర్: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో, గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, బీ ఆర్ ఎస్ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల పతాకాలు నాయకులు ఎగురవేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, గీతా పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య, ఏ ఐ టి యూ సి నాయకులు జంగ నర్సయ్య, లక్ష్మీ నర్సయ్య,పుల్కరం మల్లేష్, నిలిగొండ అశోక్, రవి, యాదగిరి, తిరుపతయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట్ నర్సు, సి ఐ టి యూ నాయకులు సామ శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, యాదమ్మ, రాజు, రమేష్, వెంకట్ రెడ్డి, లక్ష్మీ,శేఖర్ రెడ్డి, నర్సయ్య, రాములు, పాపిరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను, మాజీ మార్కెట్ చైర్మన్ తీపి రెడ్డి మెఘా రెడ్డి , మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ , మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కొండ సోమల్లు, కౌన్సిలర్ సుల్తాన్ స్వామి, జిల్లా నాయకులు దాసరి తిరుమలేష్ ,చేగోని సత్యం గౌడ్ కార్మిక విభాగం నాయ

యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు‘. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘భగవంతుడు‘ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ’శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్ చేశారు. శ్రామిక శక్తికి నమస్కరిస్తూ తెరకెక్కించిన ఈ పాటను హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు.

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఆర్‌ఆర్‌పై డిసి ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది. ఆర్‌ఆర్ తొలుత బ్యాటింగ్ చేసి 226 పరుగుల లక్ష్యాన్ని డిసి ముందు ఉంచింది. డిసి మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కెఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జైశ్వాల్ తొలి బంతి సిక్స్ కొట్టి రెండో బంతి గాల్లోకి లేపి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జేమీసన్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. అనంతరం రెండో బంతి యార్కర్ వేయడంతో వైభవ్ బ్యాట్ అంచుకు తాకి వికెట్లను గిరాటేసింది. దీంతో జేమీసన్ ఓవర్‌గా ప్రవర్తించాడు. వైభవ్ కళ్లలోకి చూస్తూ గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ ఔటైనప్పుడు ఢిల్లీ అటగాళ్లు అతిగా సంబరాలు చేసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. అతడు 15 ఏళ్ల బుడ్డోడు కాస్తా సహనంగా ఉంటే మంచిదని జేమీసన్ కు నెటిజన్లు చురకలంటిస్త

హైదరాబాద్: ఫిబ్రవరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య చేసుకున్నాక మార్చిలో ప్రియుడిని రేణుక వివాహం చేసుకుంది. సాఫ్ట్‌వేర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త చనిపోయి నెల రోజులు గడవక ముందే ప్రియుడు రమణా రెడ్డిని రేణుక వివాహం చేసుకుంది. రేణుకతో పాటు రమణారెడ్డిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫిబ్రవరి మొదటి వారంలో బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ బయటికి రావడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. తన భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సీతారాం నోట్ ద్వారా వెల్లడించాడు. ఇలాంటి సంబంధాలు వద్దని భార్యకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని సీతారాం పేర్కొన్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సీతారాం భార్య, పిల్లల

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పరిధిలోని కూత్బుల్లాపూర్‌లో ప్రియుడు ఫోన్ రిఛార్జ్ చేయలేదని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రశాంత్ నగర్‌కు చెందిన కిరణ్మయి అనే యువతి ఓ యువకుడిని 2015లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు కుమారుడు పుట్టిన తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కూకట్‌పల్లిలో సదరు యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. వెంకటేశ్ అనే యువకుడు పరిచయం కావడంతో ప్రేమ మారింది. ఇద్దరు కలిసి ప్రశాంత్ నగర్‌లో సహజీవనం సాగిస్తున్నారు. కిరణ్మయి ఫోన్ రీఛార్జ్ అయిపోవడంతో వెంకటేశ్‌ను రీఛార్జ్ చేయమని కోరింది. వెంకటేశ్ కూత తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్మయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో, ప్రియుడు ఫోన్ రీఛార్జ్ చేయించలేదని మనస్తాపం చెందిన కిరణ్మయి (26) అనే యువతి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుత్బుల్లాపూర్‌లోని ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కిరణ్మయి, ప్రయివేటు ఉద్యోగం చేసే వెంకటేశ్‌తో సహజీవనం చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె ఫోన్ రీఛార్జ్ అయిపోగా, జీతం రాకపోవడంతో రీఛార్జ్ చేసుకోలేకపోయింది. ప్రియుడు కూడా రీఛార్జ్ చేయించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ […] The post ప్రియుడు ఫోన్ రీఛార్జ్ చేయించలేదని యువతి ఆత్మహత్య appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో చలాన్లు పెండింగ్ ఉన్నాయనే కారణంతో వాహనాలను స్వాధీనం చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్ చేయొద్దని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. వాటిని లెక్క చేయకుండా పోలీసులు ఇప్పటికీ వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను సీజ్ […] The post చలాన్ల పేరుతో వాహనాల సీజ్..హైకోర్టు సీరియస్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సీఎస్కే ఇప్పటివరకు 8 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టిక ఏడో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచుల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇవాళ ముంబై ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. The post IPL-2026: నేడు సీఎస్కే vs ముంబై ఇండియన్స్ కీలక పోరు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌లోని జంజాన్ సమీపంలో జరిగిన ఒక భారీ పేలుడులో ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన 14 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ సమయంలో శత్రు దేశాలు ప్రయోగించిన ‘క్లస్టర్ బాంబులు’, ఎయిర్మైన్లు ఈ ఘటనకు కారణమని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. యుద్ధం ముగిసినప్పటికీ, భూమిలో నిక్షిప్తమై ఉన్న ఈ పేలుడు పదార్థాలు ఐఆర్జీసీ దళాలు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. The post ఇరాన్‌లో భారీ పేలుడు.. 14 మంది మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో శనివారం రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగ్రహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. మరోవైపు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఈసీ ఆదేశాలను తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. The post బెంగాల్‌లోని 15 బూత్‌లలో నేడు రీపోలింగ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 5వేల నియామకాలకు ఆమోదం లభించిందని చెప్పారు. ఇక గతంలో మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, SIB విభాగాల్లోని సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామన్నారు. The post పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు: డీజీపీ appeared first on Navatelangana.

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ మేడే కాను కగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమే అని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో శు క్రవారం కెటిఆర్ బిఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. కార్మికులతో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం భారీగా 1000 రూపాయలు పెంచారని అ న్నారు. హోటల్లో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధి పైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 3,315 రూ పాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రె స్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుందని, దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల అభ్యర్థన ను మన్నిస్తూ, ఆర్టీసి ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలను పరిష్కరిస్తామన్న తీపి కబురు అందించారు. ఇటీవల ఆర్టీసి కార్మికు లు చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాల ని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతోపాటు సమ్మె సమయంలో కార్మికులపై నమోదైన పోలీ సు కేసులను కూడా పూర్తిగా ఎత్తివేయాలని సిఎం ఆదేశించారు. కార్మిక సంఘాల నాయకు లు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత ఉ న్నతాధికారులను సిఎం ఆదేశించారు. వేతనా ల చెల్లింపు, కేసుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసి కార్మిక సంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు. తమ సమస్యల పర

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని, అం దులో భాగంగా ప్రతినెలా వెయ్యి కోట్లను విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వంద రోజుల్లో ప్రాధాన్యత క్ర మంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఉద్యో గ సంఘాల ప్రతినిధులకు హామీనిచ్చారు. శుక్రవారం ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల జెఏసి నాయకులతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో టిజిఈజెఎసి నాయకులు మా రం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు, టిజి ఈ జెఎసి చైర్మన్ లచ్చిరెడ్డి, శ్యామ్, ముజీబ్ హుస్సేనీ, లచ్చిరెడ్డి, దామోదర్ రెడ్డి, చావా ర వి, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, మ ధుసూధన్ రెడ్డి, జి.నిర్మల, కె.రామకృష్ణ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల గడప వద్దకు చేరుతున్నాయంటే, అందులో ఉ ద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

న్యూఢిల్లీ: దేశంలో శనివారం వాణిజ్య సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల సిలిండర్ ధరను అమాంతంగా, ఇంతకు ముందెప్పుడూ లేనంతగా రూ.993 వరకూ పెంచారు. దీనితో ఈ సిలిండర్ల వాడకం దార్లు అయిన హోటల్స్, హాస్టల్స్ ఇతర సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో క్రూడాయిల్ ,గ్యాస్ సరఫరా కటకటతో ధరలు పెంచాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపా యి. కమర్షియల్ సిలిండర్లపై ఇది వరుసగా మూ డో నెలవారి పెరుగుదల అయింది. పెరిగిన ధరల మేరకు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఇకపై రూ.3071.5 అ య్యింది. ఇంతకు ముందు ఇది రూ.2078.50 గా ఉంది. ఇంతకు ముందు మార్చి 1వ తేదీన ఈ సిలిండర్ల ధరలను రూ 114.5 వరకూ పెంచారు. ఇప్పుడు ఇది రూ 900 దాటి పోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గల్ఫ్ సంక్షోభం నాటి నుం చి మూడుసార్లు పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ 1303 వరకూ అదనపు భారం పడింది. క్రూడాయిల్ ధరలు, గ్యాస్ ధర పెరిగినప్పటికీ దేశంలో వంటింటి గ్యాస్ ఎల్‌పిజి ధరలు పెంచలేదు. మార్చి 7వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర రూ 60 చొప్పున (14.2 కిలోల పరిణామానికి) పెరిగింది. ఇప్పుడు వంటగ్యాసు సిలిండర్ ధర కొంచెం అటూ ఇటుగా దేశ వ్యా
షిప్స్ రద్దీ 90 శాతం తగ్గుదల26 నౌకలపై దాడులువాషింగ్టన్ : పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణం భారీగా పడిపోయింది. గతంలో రోజుకు సగటున 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ప్రస్తుతం ఆ సంఖ్య 10 కంటే తక్కువకు పరిమితమైంది. అంటే దాదాపు 90 శాతానికి పైగా రద్దీ తగ్గి.. ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు, వాణిజ్య మార్గాలు తీవ్రంగా […] The post హార్ముజ్‌లో రోజుకు 10 నౌకలే ప్రయాణం appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చేవెళ్ల -ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికిగాను తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలబెట్టిన బ్యారేజ్ నిర్మాణనికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్‌ను ఆయన ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపనున్న నేపథ్యంలో ఉభయరాష్ట్రలకు అనువైన పద్ధతిలో ఉండేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.సాంకేతిక వివరాలతో కూడిన పూర్తిస్థాయిలో నివేదికను.. ఈ సందర్భం
వ్యయం రూ.9.48 లక్షల కోట్లుప్రతీ అమెరికన్ కుటుంబంపై 500 డాలర్ల బిల్లుయుద్ధం లెక్కలను అమెరికా దాచిపెడుతోందినెతన్యాహు ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారిందిఇజ్రాయెల్ ఫస్ట్ అంటే అమెరికా లాస్ట్- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ టెహ్రాన్: తమ దేశంతో యుద్ధానికి అమెరికా రూ.9.48 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారి 100 […] The post ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారం appeared first on Navatelangana.
వ్యతిరేకంగా ఐక్య పోరాటాలుసీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాభాస్కర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ పిలుపు నిచ్చారు. మేడేను పురస్కరించుకుని హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో గల తెలంగాణ స్ట్రేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రైతు సంఘాలను కలుపుకుని […] The post విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు appeared first on Navatelangana.