
3478 వార్తలు
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో చలాన్లు పెండింగ్ ఉన్నాయనే కారణంతో వాహనాలను స్వాధీనం చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్ చేయొద్దని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. వాటిని లెక్క చేయకుండా పోలీసులు ఇప్పటికీ వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను సీజ్ […] The post చలాన్ల పేరుతో వాహనాల సీజ్..హైకోర్టు సీరియస్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సీఎస్కే ఇప్పటివరకు 8 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టిక ఏడో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచుల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇవాళ ముంబై ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. The post IPL-2026: నేడు సీఎస్కే vs ముంబై ఇండియన్స్ కీలక పోరు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌లోని జంజాన్ సమీపంలో జరిగిన ఒక భారీ పేలుడులో ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన 14 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ సమయంలో శత్రు దేశాలు ప్రయోగించిన ‘క్లస్టర్ బాంబులు’, ఎయిర్మైన్లు ఈ ఘటనకు కారణమని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. యుద్ధం ముగిసినప్పటికీ, భూమిలో నిక్షిప్తమై ఉన్న ఈ పేలుడు పదార్థాలు ఐఆర్జీసీ దళాలు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. The post ఇరాన్‌లో భారీ పేలుడు.. 14 మంది మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో శనివారం రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగ్రహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. మరోవైపు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఈసీ ఆదేశాలను తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. The post బెంగాల్‌లోని 15 బూత్‌లలో నేడు రీపోలింగ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 5వేల నియామకాలకు ఆమోదం లభించిందని చెప్పారు. ఇక గతంలో మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, SIB విభాగాల్లోని సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామన్నారు. The post పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు: డీజీపీ appeared first on Navatelangana.

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ మేడే కాను కగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమే అని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో శు క్రవారం కెటిఆర్ బిఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. కార్మికులతో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం భారీగా 1000 రూపాయలు పెంచారని అ న్నారు. హోటల్లో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధి పైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 3,315 రూ పాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రె స్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుందని, దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల అభ్యర్థన ను మన్నిస్తూ, ఆర్టీసి ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలను పరిష్కరిస్తామన్న తీపి కబురు అందించారు. ఇటీవల ఆర్టీసి కార్మికు లు చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాల ని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతోపాటు సమ్మె సమయంలో కార్మికులపై నమోదైన పోలీ సు కేసులను కూడా పూర్తిగా ఎత్తివేయాలని సిఎం ఆదేశించారు. కార్మిక సంఘాల నాయకు లు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత ఉ న్నతాధికారులను సిఎం ఆదేశించారు. వేతనా ల చెల్లింపు, కేసుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసి కార్మిక సంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు. తమ సమస్యల పర

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని, అం దులో భాగంగా ప్రతినెలా వెయ్యి కోట్లను విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వంద రోజుల్లో ప్రాధాన్యత క్ర మంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఉద్యో గ సంఘాల ప్రతినిధులకు హామీనిచ్చారు. శుక్రవారం ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల జెఏసి నాయకులతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో టిజిఈజెఎసి నాయకులు మా రం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు, టిజి ఈ జెఎసి చైర్మన్ లచ్చిరెడ్డి, శ్యామ్, ముజీబ్ హుస్సేనీ, లచ్చిరెడ్డి, దామోదర్ రెడ్డి, చావా ర వి, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, మ ధుసూధన్ రెడ్డి, జి.నిర్మల, కె.రామకృష్ణ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల గడప వద్దకు చేరుతున్నాయంటే, అందులో ఉ ద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

న్యూఢిల్లీ: దేశంలో శనివారం వాణిజ్య సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల సిలిండర్ ధరను అమాంతంగా, ఇంతకు ముందెప్పుడూ లేనంతగా రూ.993 వరకూ పెంచారు. దీనితో ఈ సిలిండర్ల వాడకం దార్లు అయిన హోటల్స్, హాస్టల్స్ ఇతర సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో క్రూడాయిల్ ,గ్యాస్ సరఫరా కటకటతో ధరలు పెంచాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపా యి. కమర్షియల్ సిలిండర్లపై ఇది వరుసగా మూ డో నెలవారి పెరుగుదల అయింది. పెరిగిన ధరల మేరకు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఇకపై రూ.3071.5 అ య్యింది. ఇంతకు ముందు ఇది రూ.2078.50 గా ఉంది. ఇంతకు ముందు మార్చి 1వ తేదీన ఈ సిలిండర్ల ధరలను రూ 114.5 వరకూ పెంచారు. ఇప్పుడు ఇది రూ 900 దాటి పోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గల్ఫ్ సంక్షోభం నాటి నుం చి మూడుసార్లు పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ 1303 వరకూ అదనపు భారం పడింది. క్రూడాయిల్ ధరలు, గ్యాస్ ధర పెరిగినప్పటికీ దేశంలో వంటింటి గ్యాస్ ఎల్‌పిజి ధరలు పెంచలేదు. మార్చి 7వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర రూ 60 చొప్పున (14.2 కిలోల పరిణామానికి) పెరిగింది. ఇప్పుడు వంటగ్యాసు సిలిండర్ ధర కొంచెం అటూ ఇటుగా దేశ వ్యా
షిప్స్ రద్దీ 90 శాతం తగ్గుదల26 నౌకలపై దాడులువాషింగ్టన్ : పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణం భారీగా పడిపోయింది. గతంలో రోజుకు సగటున 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ప్రస్తుతం ఆ సంఖ్య 10 కంటే తక్కువకు పరిమితమైంది. అంటే దాదాపు 90 శాతానికి పైగా రద్దీ తగ్గి.. ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు, వాణిజ్య మార్గాలు తీవ్రంగా […] The post హార్ముజ్‌లో రోజుకు 10 నౌకలే ప్రయాణం appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చేవెళ్ల -ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికిగాను తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలబెట్టిన బ్యారేజ్ నిర్మాణనికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్‌ను ఆయన ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపనున్న నేపథ్యంలో ఉభయరాష్ట్రలకు అనువైన పద్ధతిలో ఉండేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.సాంకేతిక వివరాలతో కూడిన పూర్తిస్థాయిలో నివేదికను.. ఈ సందర్భం
వ్యయం రూ.9.48 లక్షల కోట్లుప్రతీ అమెరికన్ కుటుంబంపై 500 డాలర్ల బిల్లుయుద్ధం లెక్కలను అమెరికా దాచిపెడుతోందినెతన్యాహు ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారిందిఇజ్రాయెల్ ఫస్ట్ అంటే అమెరికా లాస్ట్- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ టెహ్రాన్: తమ దేశంతో యుద్ధానికి అమెరికా రూ.9.48 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారి 100 […] The post ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారం appeared first on Navatelangana.
వ్యతిరేకంగా ఐక్య పోరాటాలుసీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాభాస్కర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ పిలుపు నిచ్చారు. మేడేను పురస్కరించుకుని హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో గల తెలంగాణ స్ట్రేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రైతు సంఘాలను కలుపుకుని […] The post విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు appeared first on Navatelangana.
హక్కులు ఇచ్చేవి కావు-పోరాడి సాధించాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి అన్నారు. మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ముందు భాగాన రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ముందుభాగంలో ఎర్ర చీరలు కట్టుకున్న మహిళలు కోలాటాలు వేసుకుంటూ అత్యంత ఉత్సాహంగా ప్రదర్శన చేశారు. ప్రదర్శన స్థానిక సీఐటీయూ కార్యాలయం నుండి సాగర్ ప్రధాని మీద కూడా రౌండ్ వద్దకు చేరుకుంది. […] The post మిర్యాలగూడలో కార్మికుల మహా ప్రదర్శన appeared first on Navatelangana.
మళ్లీ యుద్ధం చేస్తే ట్రంప్ ఏకాకి : రాజ్యసభ మాజీ సభ్యులు పి మధునవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధిఅంతర్జాతీయ యుద్ధ ప్రమాణాల ప్రకారం ఏ దేశం మీదనైనా 60 రోజులకు మించి యుద్ధం చేయరాదని, ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు యుద్దం చేసే గడువు ముగిసిందని, రేపటి నుంచి యుద్ధం చేయాల్సి వస్తే… భద్రతామండలి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు పి. మధు అన్నారు. మేడే సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో సీపీఐ(ఎం) కార్యాలయం సమీపంలో […] The post గడువు ముగిసింది appeared first on Navatelangana.
ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతఇన్సూరెన్స్, ఆర్బీఐ, బ్యాంక్ ఉద్యోగుల మేడే ఉత్సవాలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వాలు స్వతంత్రంగా పాలించకుండా ఐఎంఎఫ్ తదితరుల చెప్పుచేతుల్లో ఉంటూ వారు చెప్పినట్టుగానే వ్యవహరిస్తున్నాయని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత విమర్శించారు. శుక్రవారం ఇన్సూరెన్స్, ఆర్బీఐ, బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ జి.క్రాంతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సుజాత మాట్లా డుతూ […] The post యూనియన్లు ఐక్యంగా ఉండాలి appeared first on Navatelangana.
రాజస్తాన్‌పై ఘన విజయంఛేదనలో రాహుల్, నిశాంక మెరుపులునవతెలంగాణ-జైపూర్హ్యాట్రిక్ ఓటముల నైరాశ్యం నుంచి బయటపడిన ఢిల్లీ క్యాపిటల్స్ జైపూర్‌లో అదిరే విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఛేదనలో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (75, 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుం నిశాంక (62, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు […] The post ఢిల్లీ ధనాధన్ appeared first on Navatelangana.
శివం మావి స్థానంలో ఎంచుకున్న ప్రాంఛైజీహైదరాబాద్ : భారత యువ ఆల్‌రౌండర్, ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్.ఎస్ అంబరీశ్ ఐపీఎల్19లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. సన్‌రైజర్స్ వేలంలో తీసుకున్న పేసర్ శివం మావి గజ్జల్లో గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సన్‌రైజర్స్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అంబరీశ్‌ను ఎంచుకుంది. శివం మావిని సన్‌రైజర్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా.. రూ.30 లక్షల […] The post సన్‌రైజర్స్ గూటికి అంబరీశ్ appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జీఎస్టీ రాబడి వసూళ్లు గతేడా ది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 35 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అధిక పనితీరును వాణిజ్య పన్నుల శాఖ న మోదు చేసింది. ఏప్రిల్ 2025లో రూ.3,433 కో ట్ల జీఎస్టీ రాబడి రాగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జీఎస్టీ రాబడి రూ.4,621 కోట్లుగా నమోదయ్యిం ది. గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.1,188 కో ట్ల రాబడి వాణిజ్య పన్నుల శాఖకు అధికంగా వ చ్చింది. దీంతో ఈ సంవత్సరం ఈ శాఖ 35 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏప్రిల్‌లో వ చ్చిన రూ.4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా వచ్చిన రాబడిగా నమోదు కావడం విశేషం. మార్చి 20 26 నె లలో వాణిజ్య పన్నుల శాఖకు రూ.4,231 కోట్ల రాబడి రాగా, ఏప్రిల్‌లో అది మరింత పెరగడం విశేషం. రాష్ట్ర జీఎస్టీ ఆ దాయం నాలుగు నెలలుగా నిరంతరం రూ.4 వేల కోట్లకు పై గా నమోదవుతోంది, జనవరి 2026 నుంచి వాణిజ్య పన్నుల శాఖ రాబడిని అధిగమిస్తూ వస్తోంది. ఈ నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ద్వార
తాగునీటి సమస్య రాకుండా చూడాలిచలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలి : మంత్రి పొంగులేటి ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, ఆ మేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది-2026లో ఎండలు , వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందనీ, జూన్ 15 వరకు […] The post వడగాలుల పై హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ appeared first on Navatelangana.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క45 డిమాండ్లు పరిష్కరించాలి సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని హామీఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలన్న డిప్యూటీ సీఎంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీజీఈజేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి, సెక్రెటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్, నాయకులు కె రామకృష్ణ, ఎస్ రాములు, బాణాల రాంరెడ్డి, పెంటయ్య, రమేష్‌పాక, నిర్మల, […] The post వంద రోజుల్లో appeared first on Navatelangana.
మండుటెండలో కార్మిక వర్గం కవాతుఆకట్టుకున్న చికాగోఅమరవీరుల స్మృతి చిహ్నంప్రత్యేక ఆకర్షణగా మహిళల కోలాట ప్రదర్శనపూలతో స్వాగతం పలికిన ఎస్‌ఎఫ్‌ఐ బృందందిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసిన కార్మికులునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్మికవర్గం కవాతు చేసింది. నారాయగూడలోని వైఎంసీఏ చౌరస్తా నుంచి గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీఐటీయూ సిటీ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. ర్యాలీ ముందుభాగంలో ఓ వాహనంపై ఏర్పాటు చేసిన చికాగో పోరాట అమరవీరుల స్మృతి చిహ్నం అందర్నీ ఆకట్టుకున్నది. మహిళా కార్మికుల […] The post మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు : డాక్టర్ కె.హేమలత appeared first on Navatelangana.
సోషలిజానికి పెరుగుతున్న ఆదరణదేశంలో మతరాజ్య స్థాపనకు మోడీ కుట్రరాష్ట్రంలో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం‘నవతెలంగాణ’ కార్యాలయంలో ఘనంగా ‘మేడే‘నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సామ్రాజ్యవాదం పతనావస్థకు చేరుకుందనీ, అదే సందర్భంలో సోషలిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని నవతెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెండాను ఆవిష్కరించారు. అనంతరం పత్రిక ఎడిటర్ రాంపల్లి […] The post పతనావస్థలో సామ్రాజ్యవాదం appeared first on Navatelangana.