21187 వార్తలు








ప్రభుత్వ సేవలు పొందేందుకు అవసరమైన కుటుంబ వివరాలను ఒకే పత్రంలో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికెట్' విధానాన్ని ప్రారంభించింది. ఈ సర్టిఫికెట్‌ను మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత సాధారణంగా రెండు పని దినాల్లో సర్టిఫికెట్ జారీ కానుంది.


హైదరాబాద్: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. జులై 10న విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీన ప్రముఖ ఒటిటి సంస్థ జి5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒటిటి సంస్థ ప్రచార చిత్రాన్ని పంచుకుంది. అలాగే ఈ మూవీ నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్ కూడా విడుదలైంది. తమన్ స్వయంగా స్వరాలు సమకూర్చి ఆలపించడం విశేషం. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు.

రాజమండ్రి: గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక్కడ నీటి మట్టం 13 అడుగులు నమోదైంది. నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.




అమరావతి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆడబిడ్డలు ప్రదర్శించిన థింసా నృత్యం రాష్ట్రానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 13 వేల మందికిపైగా నృత్యం చేసి.. ప్రపంచ రికార్డు నెలకొల్పారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రదర్శన మన సంప్రదాయాలు, భవిష్యత్ ఆకాంక్షలను చాటి చెప్పిందన్నారు. అద్భత ప్రదర్శన చేసిన మహిళలు, చిన్నారులు, వారి గురువులకు ధన్యవాదాలు తెలిపారు. మన వారసత్వం అభివృద్ధి పథంలో వెళ్లడమే నిజమైన ‘వికాస్ భీ - విరాసత్ భీ’ స్పేూర్తి అని అన్నారు.


హైదరాబాద్: అత్యవసర చికిత్స కోసం అవయవాలను తరలించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ ఛానల ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తల్ని తరలించేందుకు సహకరించారు. వైద్యులు 14 కి.మి దూరంలో కిమ్స్‌కు కేవలం 25 నిమిషాల్లో వాటిని విజయవంతంగా చేర్చారు. అత్యవసర ఆరోగ్య కార్యక్రమాల కోసం మెట్రో మద్దతిస్తుందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కాపాడే వైద్య చర్యలకూ తమ వంతు సహకారం ఉంటుందన్నారు.





