21191 వార్తలు





హైదరాబాద్: చిలుకూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చిలుకూరు శివారులో కవిత కాలేజ్ వద్ద అతివేగంతో బైకు నడుపుతుండగా అదుపుతప్పి బైకుపై నుండి కిందపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర కమర్షియల్ టాక్స్ శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గత నెలలో జిఎస్టి, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కలిపి రూ.7,865 కోట్లు వసూలైంది. ఇది రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చరిత్రలోనే అత్యధిక ఆదాయం. గతేడాది జులైతో పోలిస్తే 19 శాతం వృద్ధి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టి వసూళ్లు రూ.5,817 కోట్లు వసూలయ్యాయి. జిఎస్టి వృద్ధి రేటులో హరియాణా తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. దేశవ్యాప్తంగా జులైలో జిఎస్టి వసూళ్లు 10 శాతం వృద్ధి సాధించగా.. తెలంగాణలో మాత్రం 19 శాతం నమోదైంది.




గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. తొలుత మహిళల 54 కెజిల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను ప్రీతి చిత్తు చేసింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించి ఏకగ్రీవంగా విజయం సాధించింది. అనంతరం మహిళల 57 కెజిల విభాగంలో భారత్‌కు మరో పసిడి పతకం దక్కింది. ఫైనల్‌లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై జైస్మిన్ లాంబోరిమయా ఘన విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ (16.58 మీటర్లు) రజతం సొంతం చేసుకోగా.. సెల్వ ప్రభు తిరుమరన్ (16.52 మీటర్లు) కాంస్య పతకం సాధించాడు.


హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఎవరితో పెట్టుకోవద్దో వారితో పెట్టుకున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కొత్తతరానికి సమాజంపై ఎక్కువగా కమిట్ మెంట్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతరం కొత్త తరహాలో ఢిల్లీలో కదం తొక్కిందని కొనియాడారు. స్వేఛ్చకు పరిమితులు ఉండకూడదని సూచించారు. సోషల్ మీడియా లేకపోతే జవాబుదారీతనం వచ్చేది కాదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే ఔట్ డేట్ అయిపోతామని కెటిఆర్ హెచ్చరించారు.దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఎవరో ఒకరికి వత్తాసు పలుకుతున్నాయని, వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదని విమర్శించారు. కేంద్రమంత్రి తనయుడి లైంగిక దాడిని ఏ మీడియా కవర్ చేయలేదని, లగచర్ల దాడిలో రైతులపై కేసులు పెడితే ఏ మీడియా రాయలేదని మండిపడ్డారు. వాట్సాప్ అంకుల్స్.. ఇన్ స్టా పిల్లల్లో ఎవరూ గెలిచారో చూశామని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం పైగా జెన్ జి ఓట్లు వేయబోతున్నారని అన్నారు. తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి దేశంలో ఉందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.










దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ నవ్విస్తూ.. భయపెడుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు వరుణ్ ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఇక కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
