5331 articles
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అధ్యక్షతన ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలకు అందించడం జరిగిందని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఉదయం పూట ఆరు గంటల లోపే పని ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత పెరిగినందువలన ప్రతి ఒక్కరు చల్లటి వాతావరణం లోనే […] The post ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్ నేటి నుండి మండలంలోని పలు గ్రామాలలో సెన్సెస్ సర్వే ప్రారంభిండం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలో ని పడంపల్లి, నాగుల్ గావ్, బిజ్జల్వాడి , కత్తల్వాడి , చెండేగావ్, లొంగన్ మథురతాండ ,సోపూర్ , డోన్ గావ్, మహమ్మదాబాద్, గుల్లా తాండ, మాదాపూర్, చిన్నగుల్ల, పెద్ద ఏడ్గి, జుక్కల్, దోస్తుపల్లి, వజ్రకండి, ఖండేబల్లూర్, లాడే గావ్, హంగర్గ, ఆయా గ్రామాల గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన సెన్సెస్ మొదటి రోజు సర్వే మ్యాప్ నిర్వహించడం […] The post నేటి నుండి గ్రామాలలో సెన్సెస్ సర్వే appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ , ఉప సర్పంచ్ అంతేశ్వర్ అధ్యక్షతన గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్రంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామంలోని నీటి సమస్యలు గత కొంతకాలంగా తీవ్రం కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులతో చర్చించి నీటి […] The post చెండేగావ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నీటి సమస్య పరిష్కారం appeared first on Navatelangana.
బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ కు వినతినవతెలంగాణ – తిమ్మాజిపేటకేంద్ర మంత్రి బండి సంజయ్, కుమారుడు బండి భగీరథ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా […] The post చట్టం సామాన్యులకేనా.? appeared first on Navatelangana.


బంధువుల ఇంటికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇళ్లు ఖాళీ చేశారు. 30 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ సంఘటన గోషామహల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాహినాయత్‌గంజ్ ముల్తానీపురాలో చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... బేగంబజార్‌లోని స్టీల్ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న మహేష్ భార్యాపిల్లలతో కలిసి షాహినాయత్‌గంజ్ ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. 2వ అంతస్తులో అతని తమ్ముడు, మొదటి అంతస్తులో తల్లి, గ్రౌండ్ ఫ్లోర్‌ను స్టోర్ రూమ్‌గా వాడుకుంటున్నారు. లంగర్‌హౌజ్‌లో బంధువుల వివాహం ఉండటంతో మహేష్ గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ ఉదయం కుటుంబసభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లి, అర్దరాత్రి సమయానికి తిరిగి ఇంటికి వస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లిన మహేష్ స అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఇంటికివచ్చి చూడగా, ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. అనుమానంతో గబగబా మూడవ అంతస్తు పైకి చేరుకోగా ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. బీరువాలో గల 30 తులాల బ
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలిక్కి తీయడంపాఠశాలలపై విశ్వాసం పెంచడంనవతెలంగాణ – మల్హర్ రావువిద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 11 నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు విద్యాశాఖ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు.రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులు ఏడు రకాల కార్యక్ర మాలు చేపడుతున్నారు. సర్కారు బడులపై విశ్వాసం పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడం, తల్లిదండ్రులు,ప్రజా ప్రతినిధులను భాగసామ్యం చేయడమే […] The post సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ appeared first on Navatelangana.

15 రోజుల్లో ప్రక్రియ పూర్తిఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాలో చేరిక జూన్ 1 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సిఎం సువేందు అధికారి నేతృత్వంలో కేబినెట్ తొలి నిర్ణయాలు మేనిఫెస్టోలో హామీల అమలు దిశగా అడుగులు కోల్‌కతా : ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో సోమవారంనాడు జరిపిన పశ్చిమ బెంగాల్ తొలి మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కోసం భూమిని బిఎస్‌ఎఫ్‌కు తక్షణమే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టి తీరుతామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రధానంగా హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు దిశగా సువేందు సర్కార్ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో సువేందు మాట్లాడుతూ.. -బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్‌కు అవసరమైన భూమి బిఎస్‌ఎఫ్ నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. బిఎస్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. సరిహద్దు ఫెన్సింగ్‌ను బిఎస్‌ఎఫ్ సాధ్యమైనంత
నవతెలంగాణ – మల్హర్ రావుభారతదేశ జనాభా గణన 2027 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గణన సోమవారం తాడిచెర్లలో ప్రారంబించినట్లుగా జనగణన సూపర్ వైజర్ బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ జనగణన 16వది స్వతంత్రానంతరం. 8వ జనగణనలో భాగంగా 11,12,13 రోజులలో ఎన్మరేటర్లకు కేటాయించినటువంటి బ్లాకులను గుర్తించి మ్యాపులను వేసి వారి యొక్క సరిహద్దులను సరి చూసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్యుమరేటర్స్ తగిన సలహాలుసూచనలు చేయడం జరిగిందన్నారు. […] The post తాడిచెర్లలో జనగణన ప్రారంభం appeared first on Navatelangana.

భాధితురాలుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలిఆర్టిఐ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుమైనర్ బాలికను లైంగికంగా వేధించిన బండి భగీరథను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని జయశంకర్ భూపాలపల్లి యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్, జిల్లా చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్, చింతల కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన సంఘటన లో భగీరథ ఆరోపణ […] The post బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ ఎండలు మండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు, ముగజీవాలు దాహార్తికి అల్లాడుతున్నాయి. నేపథ్యంలో మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు, కొనుగోలు కేంద్రములో ధాన్యం తూకం వేసే హమాలి కార్మికులకు ఎండనుంచి ఉపశమనం కోసం గ్రామ ఉప సర్పంచ్ రాజేందర్ మజ్జిక ప్యాకేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అజ్మీరా సమ్మయ్య,యూత్ నాయకులు అడ్వాల రాజు, రమేష్, కవిత పాల్గొన్నారు. The post ఉపాధిహామీ కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ అందజేత appeared first on Navatelangana.



చార్మింగ్ స్టార్ శర్వా... డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్ -ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ’భోగి’. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం, శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి వెంచర్‌లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. డింపుల్ హయతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించింది. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల క

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (విబిజిరామ్ జి చట్టం)ను అమల్లోకి తీసుకురానుంది. కొత్త చట్టం వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం సోమవాంరనాడు ప్రకటించింది. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ లభిస్తుంది. ప్రస్తుతం ఎంజీనరేగా ద్వారా 100 రోజుల ఉపాధి మాత్రమే లభిస్తోంది. గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2005 నుంచి అమల్లో ఉన్న ఎంజీనరేగా పథకాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంజీనరేగా నుంచి కొత్త చట్టంలోకి మార్పు సజావుగా జరుగుతుందని, కార్మికులకు ఎలాంటి అంతరాయమూ కలగదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యేంత వరకు, ప్రస్తుతం ఉన్న ఇకెవైసి జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి ఉపాధి లభిస్తుందని, జాబ్ కార్డులు
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని SFI, DYFI, AIDWAలు డిమాండ్ డిమాండ్. బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రి పదవీ నుంచి […] The post బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: SFI appeared first on Navatelangana.
నవతెలంగాణ-వర్ధన్నపేటవర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ మన్నూరు శారద సోము బిఆర్ఎస్ నాయకులు బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని ల్యాబర్తి గ్రామంలో బాటసారులకు వేసవి దృశ్య చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. చీకటి శ్రావణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముండ్లపెళ్లి ప్రశాంత్పార్టీ అధ్యక్షులు గుడికందుల రాజు, నాయకులు నాగపురి రాము, సంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. The post బాటసారులకు మజ్జిగ పంపిణీ appeared first on Navatelangana.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్- స్పోర్ట్ డ్రామా ’పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్-లుక్ పోసర్లు, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ’పెద్ది’ జూన్ 4న పాన్- ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్, ట్రైలర్‌లో సినిమా అసలు కథ, ప్రధాన పాత్రలను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంచనాలను మరింత పెంచుతూ విడుదలైన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ కొత్త గెటప్‌లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్‌తో కనిపించనున్నారు. జాన్వీ కపూర్, శివ రా
నవతెలంగాణ-వర్ధన్నపేటతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి పోశయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో బలోపేతం చేసుకోవాలని, పూర్వ విద్యార్థులు, ఒక వ్యక్తి ఐదుగురు చొప్పున డిగ్రీ కళాశాలలో చేరే విధంగా కృషి చేయడంతో పాటు […] The post ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు appeared first on Navatelangana.

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారంనాడు అనూహ్యంగా మాజీ సిఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. సోమవారంనాడు ఇక్కడి అళ్వారుపేటలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సిఎం విజయ్‌ను స్టాలిన్ తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా అక్కడే ఉన్నారు. వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు రాలేదు.గత ఐదేళ్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన స్టాలిన్ తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో టివికె అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టివికెకు దక్కలేదు. దీంతో డిఎంకె మిత్ర పక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, విసికె, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో విజయ్ సిఎం అయ్యారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ను విజయ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని టివికె ప్రతినిధులు వెల్లడించారు. అనంతరం విజయ్ ఎండిఎంకె నేత వైగోను కూడా కలిశారు.