21217 వార్తలు



హైడ్రా పునరుద్ధరించిన ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పల్ నల్లచెరువు వరద నీరుతో నిండింది. భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారిన ఈ చెరువును హైడ్రా పునరుద్ధరిస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలో వర్షాలు పడినప్పుడు వరద నీరు చెరువులోకి చేరేలా తక్కువ మొత్తంలో పారే మురుగు నీరు బైపాస్ చేసిన కాలువ లోంచి బయటకు పోయేలా కాలువలను హైడ్రా అభివృద్ధి చేసింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువున ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వరద నీరు నల్ల చెరువుకు చేరింది. ఉప్పల్ నల్ల చెరువులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 70 ఎకరాల వరకు విస్తరించిన విషయం విదితమే. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది.ఉప్పల్ నల్ల చెరువుకు ఎగువున ఉన్న నాచారం చెరువుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా రెండు ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు నిందిన తర్వాత వరద నీరు సాఫీగా మూసీకి చేరేలా ఔట్ లెట్ కూడా తీర్చిదిద్దింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్

లండన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండర్ ఆశుతోష్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. అక్కడి వన్డే కప్‌లో హ్యాంప్‌షైర్‌కు అశుతోష్ 4 మ్యాచుల్లో 13 వికెట్ల పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని వైవిధ్యభరితమైన పిచ్‌లపై తన మీడియం పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. దీనికి ముందు మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన అశుతోష్ అంతకు ముందు మ్యాచ్‌లో 4 వికెట్లు, దానికి ముందు మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలతో ఆశుతోష్ ఈ సీజన్‌లో హ్యాంప్‌షైర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఒకటి రెండు మెరుపులతో సరిపెట్టాడు. ఈ టోర్నీలో అశుతోష్ స్కోర్లు వరుసగా 10, 0, 11, 16 పరుగులుగా ఉన్నాయి.







అమరావతి: స్వర్ణాంధ్రకు విజన్ కు కీలకమైన రోజు అని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టం అని అన్నారు. ఈ సందర్భంగా భోగాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ రెండు రికార్డులు సృష్టించామని, ఒకటి ఎయిర్ పోర్టు అని రెండు థింసా డ్యాన్స్ అని పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కారం తెలియజేశారు. ఇవాళ రూ. 18 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను శ్రీకారం చుట్టామని, ఈ ప్రాజెక్టులు ఎపిని శరవేగంగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని మోడీ పేర్కొన్నారు. గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు తన జీవితాన్ని అంకితం చేశారని, 13 వేల మందకి పైగా గిరిజన పిల్లల ఉత్సాహం చూస్తే ముచ్చటేసిందని, ఇది అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల అని కొనియాడారు. ఎయిర్ పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదని, అయోధ్య ఎయిర్ పోర్టుకు వాల్మీకి, ఇక్కడ అల్లూరి పేరును పెట్టుకున్నామని అన్నారు. ఇదే భూమిపై ఇవాళ అభివృద్ధి ల్యాంచ్ ప్యాడ్ ప్రారంభమైందని, 2014 కంటే ముందు 74 ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 166 ఎయిర్ పోర్టులకు చేరుకుందని, ప్రయాణికులు సంఖ్య కూడా పెరిగిందని అన్నారు.





బ్యాకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న మొత్తం 11,403 బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటీఫికేషన్ ను జారీ చేసింది. తెలంగాణలో 191 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు రూ. 175, ఇతరులకు రూ.850 దరఖాస్తు రుసుముగా నిర్ణయించింది ఐబిపిఎస్. అక్టోబర్ లో ప్రిలిమినరీ పరీక్షలు, డిసెంబర్ మెయిన్స్ పరీక్షలుంటాయి. అర్హులైన అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.






అమరావతి: విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నాం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఎపికి ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారు అని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాం, రైల్వే జోన్ తీసుకొచ్చామని అన్నారు. ఈ సందర్భంగా భోగాపురం లో ఆయన మీడియాతో ప్రసంగించారు. విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం అని కొనియాడారు. ఉత్తరాంధ్ర విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం తెలియజేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టుకున్నామని, ఉత్తరాంధ్ర శక్తికి ఈ ఎయిర్ పోర్టు నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశాదిశా మారిందని చెప్పారు. ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంస్కృతి కనిపిస్తోందని, భోగాపురానికి కొబ్బరికాయ కొట్టింది తామే, ఇప్పుడు గుమ్మడికాయ కొట్టింది మనమేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు అని వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలో వలసలు వస్తాయని అన్నారు. ప్రపంచంలో ఐటీ నుంచి ఎఐకి షిప్ట్ అవుతోందని ఉత్తరాంధ్రకు ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయని, 2027 లో పోలవరాన్ని పూర్తి చేస్తామని అన్నారు. 2028 లో అమరావతి మ
