
4147 వార్తలు

హైదరాబాద్: కవిత పార్టీ పెట్టినందుకు టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(టిఆర్ఎస్)గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. దోపిడీపై కవిత వివరణ ఇవ్వడం లేదని.. సిఎం రేవంత్‌పై కవిత వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా.. కాంగ్రెస్‌కి తిరుగులేదని స్పష్టం చేశారు. కెసిఆర్ చుట్టు ఉన్న గుంటనక్కల విషయం పదేళ్లలో కవితకు తెలియదా? అని ప్రశ్నించారు. కెటిఆర్‌కు రాజకీయం తెలియదన్న కవిత వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చని.. రాజకీయాల్లో ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు అని పేర్కొన్నారు.
















భారత టెక్ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. శాంసంగ్, పోకో వంటి అనేక బ్రాండ్‌లు ఈ విభాగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పెద్ద డిస్‌ప్లేలు, మంచి కెమెరాలతో ఉండే ఈ ఫోన్‌లు రోజువారీ ఉపయోగం, ప్రయాణం లేదా సెకండరీ డివైస్‌గా ఆదర్శంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.10,000 లోపు ధరలో లభించే కొన్ని స్మార్ట్ ఫోన్ల లిస్ట్ చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ M07ఇందులో మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 4GB RAM + 64GB స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ డ్యూయల్ కెమెరా ఉంది. ఇందులో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఒక రియర్ కెమెరా ఉన్నాయి. ఇది ఛార్జర్ లేకుండా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ బ్లాక్ కలర్‌లో రూ.9,999 ధరకు లభిస్తుంది.పోకో సి71ఈ ఫోన్‌లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉన్న ఈ ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని సగటు బ్యాటరీ లైఫ్ 15 గంటల వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో 32MP వెనుక కెమెరా, 8MP ముందు కెమెరా ఉన్నాయి. కాగా, ఈ ఫోన్ ధర రూ.8,985.లావా బోల్డ్


యాదాద్రి: మద్యం మత్తు అనేది ఎంత భయంకరమైనదో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. చిన్న వయస్సులోనే యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేదా నేరాలు, హత్యలు చేస్తున్నారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మేడిపల్లిలో మద్యం మత్తులో మధు(25) అనే యువకుడిని చరణ్, నవీన్ అనే యువకులు హతమార్చారు. ఈ నెల 21వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకూ ముగ్గురు కలిసి నాలుగు ఫుల్ బాటిల్స్ మద్యం సేవించారు. అయితే అందులో చివర్లో వచ్చే లక్కీ డ్రాప్స్ తనకు రాలేదని మధు మిగితా ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన చరణ్, నవీన్‌లు మధుపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భయంతో ఈ విషయాన్ని తన తల్లికి తెలిపాడు. దీంతో చరణ్ తల్లి అతడిని పోలీసులకు అప్పగించింది.


