21988 వార్తలు




లక్నో: అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓ వివాహిత తన ప్రియుడితో మాట్లాడుతుండగా మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండడంతో అతడి గొంతు నులిమి చంపేసింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మథుర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రుచి జిందాల్(32) అనే మహిళ తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి బల్‌దేవ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త మెడికల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నెల రోజుల క్రితం అకస్మాత్తుగా కుమారుడు చనిపోవడంతో దహనసంస్కారాలు నిర్వహించారు. కుమారుడిని ఏడుస్తుండగా గొంతు నులిమి చంపిన విషయం ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త చాటుగా విన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి రుచి జిందాల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బాధితుడు హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ నివాసి బాలయ్య(70) అనే వృద్ధుడిగా గుర్తించారు. సమాచారం మేరకు క్కడికి చేరుకున్న పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నాలా మరమ్మత్తుల సమయంలో ఈ ఘటన జరగినట్లు తెలుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై బాధితుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The post మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు appeared first on Navatelangana.

ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యా చ్‌ల టెస్టు సిరీస్ కో సం టీమిండియాను ఎంపిక చేశారు. శ్రీ లంక గడ్డపై ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ జరుగనుంది. ఇందు కోసం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కెఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్ సరాంశ్ జైన్ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సరాంశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయితేనే అతను సిరీస్‌లో పాల్గొంటాడు. ఇక సాయి సుదర్శన్ కూడా ఫిట్‌నెస్‌లో నెగ్గితేనే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఇక హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు లభించింది. జట్టు వివరాలు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్‌ప్రిత్ బుమ్రా, సిరాజ్, గుర్నూర్ బ్రార్, పడిక్కల్, సరాంశ్ జైన్.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెట్ షర్మిలా ధన్‌ఖడ్ షాట్‌పుట్ విభాగంలో స్వర్ణం సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. 40 ఏళ్ల వయసులో షర్మిలా ధన్‌ఖడ్ ఏకంగా పసిడి పతకం గెలిచి ఔరా అనిపించింది. పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్ ఎఫ్ 57విభాగం ఫైనల్లో షర్మిలా 9.81 మీటర్ల దూరంలో త్రోను విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు పతకం సాధించి పెట్టింది. హర్యానాకు చెందిన షర్మిల జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. ఒకవైపు కుటుంబ కలహాలు మరోవైపు పోలియో, ఆర్థిక సమస్యలు దాటుకుని కామన్వెల్త్ వంటి అగ్రశ్రేణి క్రీడల్లో స్వర్ణం సాధించి నయా చరిత్ర సృష్టించింది. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన మరో అథ్లెట్ శిల్పా శైల కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఎఫ్ 57 ఈవెంట్‌లో శిల్ప అద్భుత ఆటతో అలరించింది. ఈ క్రమంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దకించుకుంది. కాగా, అసాధారణ ఆటతో పసడి పతకాన్ని సాధించి భారత ఖ్యాతిని చాటిన షర్మిలాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అభినందించారు.అజయ్‌కు సిల్వర్ కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు కుర్రాడ











నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మారోసారి వరస సూచన చేసింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీలో అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ […] The post నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు కాకినాడ ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్‌లో బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ‘ఈ రోజు నేను డ్యూటీకి రావడం లేదు. ఉరివేసుకుని చనిపోతున్నాను’ అని కొలీగ్ నరేంద్ర కుమార్‌కు ప్రస్కిల్లా ఫోన్ చేసి చెప్పింది The post ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్రాన్స్‌లో 420 చదరపు కిలోమీటర్లకుపైగా, స్పెయిన్‌లో 1,25,000 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. గిరాండ్ ప్రాంతంలో కోట్ల విలువచేసే 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. యూరోపియన్ యూనియన్ అధికారులు నవంబర్ మొదటి వారం వరకు కార్చిచ్చు కొనసాగవచ్చని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్‌లలో ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. The post ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో కార్చిచ్చు విధ్వంసం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం తెలంగాణపై ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా 16 జిల్లాల్లో […] The post తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు appeared first on Navatelangana.

మన తెలంగాణ / హైదరాబాద్ : అత్యాధునిక సాం కేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అ నుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె చందన, సహ వ్యవస్థాపకుడు, ము ఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకా మం గళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మ ర్యాదపూర్వకంగా కలిశారు.భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్- 1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వా త ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్ర యోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భార త్ నిలిచిందని తెలిపారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పు రోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన- అ భివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వ, -ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి అభినందించారు. వారు సాధి
