22114 వార్తలు











నవతెలంగాణ – హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తారనే వార్త వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇన్‌స్టాగ్రామ్‌పై ఎలాంటి నిషేధ నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మవద్దని, ధృవీకరించకుండా ఇతరులకు పంపొద్దని సూచించింది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మెటా కూడా ఇలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. […] The post భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ నిషేధం వార్తలు..కేంద్రం క్లారిటీ appeared first on Navatelangana.

లక్నో: నిక్కర్‌లో విద్యార్థి మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై చాకును కాల్చి వాత పెట్టిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రైవేటు ప్లే స్కూల్‌లో కేసరి జయస్‌వాల్ అనే విద్యార్థి చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్‌కు వెళ్లి వచ్చిన తరువాత మర్మాంగం వద్ద నొప్పిగా ఉందని తల్లికి చూపించాడు. వాతలు కనిపించడంతో స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌ను అడగడంతో వారు పట్టించుకోలేదు. బాబు వాష్‌రూమ్‌కు వెళ్తానని టీచర్‌ను అడిగాడు. ఆమె పట్టించుకోకపోవడంతో నిక్కర్‌లో మూత్రం పోసుకున్నాడు. టీచర్ ఆగ్రహంతో బాబు పక్క రూమ్‌కు తీసుకెళ్లి చాకు కాల్చి వాతలు పెట్టింది. దీంతో బాబు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ టీచర్‌తో పాటు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.




మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మల్కాజిగిరిలో రవి కుమార్ అనే యువకుడు టెంట్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. టెంట్‌హౌస్‌కు ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల బాలిక ఆడుకుంటుంది. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ తల్లికి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


అమరావతి: దైవ దర్శనానికి వెళ్తుండగా ఆగి ఉన్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... విశాఖపట్నం, విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు రాయగడకు వెళ్లేందుకు వ్యాన్‌ను బుక్ చేసుకున్నారు. విజయనగర జిల్లా కేంద్రానికి సమీపంలోని చెల్లూరు దగ్గర వ్యాన్‌ను ఆపారు. ఓ లారీ అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టి అనంతరం 500 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడితో సహా ఇద్దరు మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు రామునాయుడు(50), మజ్జి నారాయణరావు(50), బి మోహన్‌నాయుడు(08) గుర్తించారు.




