22309 వార్తలు

హరారే: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే అభిషేక్ శర్మ(2) ఔట్ అయ్యాడు. అయితే వైభవ్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 49 బంతులు ఎదురుకున్న వైభవ్.. 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 81 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు చేయగా.. ఆఖర్లో రింకు సింగ్ దూకుడుగా ఆడాడు 14 బంతులు ఎదురుకొని 2 ఫోర్లు 1 సిక్సుతో 25 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలింగ్‌లో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు, సికందర్, బ్రెస్సింగ్, వెస్లీ తలో వికెట్ తీశారు.


ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కష్టాల్లో ఉంటే ఆదుకునే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుటారు. కాగా, తాజాగా చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారు. రమేశ్ ‘గబ్బర్‌సింగ్’తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇటీవలే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరు అపోలో ఆస్పత్రి డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో అతడి భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు తన వంతు సాయంగా రమేశ్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందించారు. రమేశ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.


గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు రెండో పతకం లభించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ రజత పతకం సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్ బిన్ కాస్డన్ 273 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. జోషువా అముంగా (కెన్యా) 260 కేజీలు ఎత్తి కాంస్య పతకం నెగ్గాడు. తొలుత స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తిన రిషికాంత.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమయ్యాడు. ఈ విభాగంలో మూడు ప్రయత్నాల్లో తొలుత 143 కేజీలు ఎత్తగా.. తర్వాతి రెండు రౌండ్లలో విఫలమయ్యాడు. దీంతో రిషికాంత మొత్తం 264 కేజీలు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ కామన్‌వెల్త్ పోటీలో భారత్‌కు ఇది రెండో పతకం కాగా, తొలి రజతం ఇదే.




అమరావతి: నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని ఎపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇష్టమొచ్చినట్టు జివోలు మారుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సిలో అవకతవకలు జరిగాయని,రూ. 10 వేల కోట్లు ఫీజు రీయింబెర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఒకరికో ఇద్దరికో డైరెక్టుగా ఉద్యోగం ఇచ్చేవారని, నీట్ లో అవకతవకలు జరిగితేనే కేంద్రమంత్రి రాజీనామా చేశారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలని, అప్పటి వరకు మంత్రి పదవి నుంచి తప్పించండని కోరారు. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబెర్స్ మెంట్ లేదు అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని క్లియరెన్స్ లు తామే తీసుకొచ్చామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్ హారిజంటల్ బార్‌పై ప్రదర్శన చేస్తుండగా పట్టు తప్పి నేలపై బలంగా పడిపోయాడు. గ్లాస్గోలో జరుగుతున్న పురుషుల జట్టు ఫైనల్‌లో విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో స్టేడియం ఒక్కసారిగా అవాక్కైంది. వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి చేరుకుని చికిత్స అందించారు. తలకు బలమైన గాయం అవ్వడంతో అసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా పోటీ కొంతసేపు నిలిచిపోయింది. తదనంతరం ఆ జట్టు అతడు లేకుండానే పోటీని పూర్తి చేసి రజత పతకం సాధించింది. కెనడా స్వర్ణం, ఆస్ట్రేలియా కాంస్య పతకం గెలుచుకున్నాయి. లాంగ్‌టన్ స్పృహలోనే ఉన్నాడని, వైద్యులతో మాట్లాడుతున్నాడని ఇంగ్లండ్ జట్టు వెల్లడించింది. ఆసుపత్రిలో పలు పరీక్షలు నిర్వహించగా ఫలితాలు సానుకూలంగా వచ్చాయని తెలిపింది. ఎలాంటి తీవ్ర గాయాలు లేవని వైద్యులు తేల్చారు. దీంతో లాంగ్‌టన్‌ను డిశ్చార్జ్ చేసి జట్టు సభ్యులు ఉంటున్న హోటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. రజత పతక స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా.. త్వరలో జట్టుతో కలిసి సంబరాల్లో పాల్గొనే అ



హైదరాబాద్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆయన వ్యక్తిగత విషయం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలలో విదేశీ హస్తం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువత, కాంగ్రెస్ నిరసనలతో కేంద్రం దిగివచ్చిందనేది నిజం కాదని, నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపి చిత్తశుద్ధిని చాటుకుందని రామచందర్ రావు తెలియజేశారు. పీజు రీయింబర్స్ మెంట్ చెల్లించని సిఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటు కోవాలని రామచందర్ రావు సూచించారు.








2027 ప్రపంచకప్‌నకు మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఈసారి మెగా ట్రోఫీని అందుకోవాలని అన్ని జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే టీం ఇండియాలో మాత్రం ఒక కొరత ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. కీలక ఆటగాళ్లను జట్టును నుంచి దూరం పెట్టారని అన్నారు. ‘‘దూబే, హర్షిత్ రాణా వంటి ఆలటగాళ్లు ఆల్‌రౌండర్లు కాదు. వీరిని ఆల్‌రౌండర్లు అంటే.. నాకు నేను గొప్ప ఆల్‌రౌండర్‌ను అని చెప్పొచ్చు. జట్టులో హార్థిక్ ఒక్కడే నిజమైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్ రౌండర్. అతడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు.. కొన్ని ఓవర్లు వేయగలడు. మరోవైపు రవీంద్ర జడేజా వన్డేల నుంచి పూర్తిగా వైదొలగాడని నేను అనుకోవడం లేదు. 2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. అతడు ఓ సైలెంట్ కిల్లర్. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిచలేదు. టెస్టుల్లో అద్భుతంగా రాణించినా అతడికి వన్డే జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. రాణిస్తే జట్టులోకి కూడా తీసుకవావాలి’’ అని శ్రీకాంత్ అన్నారు.
