22309 వార్తలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాగల రెండు మూడ్రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిలాో్ల్ల్ల కూడా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది. హైదరా బాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడ చినుకులు లేదా మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ, జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల నివాసితులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ బోగాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన (శనివారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. శనివారం ఉదయం10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కుంటారు. ఉదయం 10:45-10:50 గంటలకు ప్రధాని మోడీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎపి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎపి సిఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:5010:55 గంటలకు కారులో ప్రయాణి కుల టెర్మినల్ భవనానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. 10:5510:58: 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు. 11, 11.15 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. 11.17 - 11.25 గంటలకు టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 11:3012:55 గంటలకు విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 8 నెలల కాలం పూర్తి చేసుకున్న అమెరికా-రష్యా వ్యోమగాములు ఆదివారంనాడు సురక్షితంగా కజకిస్థాన్ భూభాగానికి చేరుకున్నారు. నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా వ్యోమగాములు సెర్గీ కుద్-స్వెర్చ్‌కోవ్, సెర్గీ మిఖాయేవ్‌లు సోయుజ్ ఎంఎస్-28 నౌక ద్వారా దిగారు. అంతరిక్షంలో 241 రోజలు పాటు వీరు గడిపారు. ఇది విలియమ్స్, విఖాయేవ్‌లకు తొలి అంతరిక్ష మిషన్ కాగా, కుద్-స్వెర్చ్‌కోవ్‌కు రెండవది.

లండన్: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు వద్ద భారతీయ నావికులున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి జాడ గల్లంతైనట్టు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారంనాడు తెలిపింది. నల్ల సముద్రంలోని ఒడెసా ఓడరేవు వద్ద ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ వాణిజ్య నౌకపై శనివారం ఈ దాడి జరిగినట్టు వెల్లడించింది. ఘటన జరిగిన సమయంలో నలుగురు భారతీయులు ఆ నౌకలో ఉన్నారని, ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, గల్లంతైన ఇద్దరు భారతీయుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఉక్రెయిన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వివరించింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని కీలక బ్లాక్ సీ పోర్ట్ తరచు దాడులకు గురవుతోంది.


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.దీనికి ముందు విద్యాశాఖ మంత్రి పదవిని తనకు అప్పగించడంపై ప్లహ్లాద్ జోషి స్పందించారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నిర్దేశకత్వంలో నిబద్ధతతో తన బాధ్యతలు నిర్వహిస్తాననిఅన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యారంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారని, జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. ధర్మేంద్ర ప్రధాన్ సైతం తన రాజీనామా లేఖలో, తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధించాయని తెలిపారు. మంత్రిగా తాను బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకేలేదని, మాఫియా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదనే సంకల్పంతోనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.


మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఎఐజి) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణను ఎపి సిఎం చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. గత వారం సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు ఇటీవల మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా చంద్రబాబు తన బావమరిది అయిన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత వేగంగా కోలుకుంటున్నదీ వాకబు చేశారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి బాలకృష్ణకు అందిస్తున్న చికిత్స, తదుపరి పునరావాస ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణుల బృందం పర్య వేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్య బృందం స్పష్టం చేసింది. వైద్యుల సూచనల మేరకు త్వరలోనే బాలకృష్ణ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో బాల కృష్ణ తిరిగి ఇంటికి చేరుకోవాలని, మళ్లీ ఎప్పటి లాగే షూటిం గ్‌లలోనూ, ప్రజా సేవలోనూ వేగంగా పాల్గొనాలని అభిమానులు సామాజిక మాధ్య మాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు.




మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకూ అందని అధికారిక లెక్కల ప్రకారమే 39 కేసులు నమోదయ్యాయి. అయితే అనధికారికంగా మరికొన్ని కేసులుండవచ్చు. ఎపిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో జనంలో ఆందోళన వ్యక్తమవుతుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో కరో నా వైరస్ వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, భయపడా ల్సిన అవసరం లేదని, అనవసర ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కావడంతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచి స్తున్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది ఇన్ పేషెంట్లుగా చేరడం లేదని, హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అంటున్నారు. మృతి చె


మన తెలంగాణ/హైదరాబాద్‌ః జెన్-జీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం కాదు, మంత్రి పదవి ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. జెన్-జీలకు (21-30 ఏళ్ళ వయసు) ఉన్న వారు చట్ట సభలో అడుగు పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పడంపై కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత జెన్-జీలకు మంత్రి పదవి ఇచ్చి ఆచరణలో చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఎంఎల్‌ఎసిలను రాజీనామా చేయించి జెన్-జీ లకు ఆ పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమరి వద్ద హోం, విద్యా, మున్సిపల్ శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖలను జెన్-జీలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ దృష్టిలో జెన్-జీలంటే విహెచ్, కెకె, కోదండ రెడ్డి అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటాలో పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటే కదా అని అన్నారు.దేశం ఫస్ట్, పార్టీ నెక్ట్స్ , పర్సన్ లాస్ట్ తమ పార్టీకి దేశం ప్రథమమని, ఆ తర్వాతే పార్టీ అని, చివరగా వ్యక్తి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు


షార్ట్ సర్కూట్‌తో దగ్ధమైన బొమ్మల దుకాణాలు గ్రామ పంచాయతీ భవనానికీ వ్యాపించిన మంటలు, కీలక రికార్డులు అగ్నికి ఆహుతి కన్నీటి పర్యంతమైన వ్యాపారులు ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆదుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం భరోసా మన తెలంగాణ/నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన చెరువుగట్టులో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. షార్ట్ సర్కూట్ కారణంగా చెలరేగిన మంటలు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలను పూర్తిగా దగ్ధం చేశాయి. వాటికి ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా వ్యాపించిన మంటలు పలు కీలక రికార్డులు బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జీవనాధారం కోల్పోయిన దుకాణా యజమానులు, వారి కుటుంబాలు నిరాశ్రయులై కన్నీటి పర్యంతమయ్యాయి. ఏండ్ల కష్టార్జితం క్షణాల్లో బూడిద కావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. జరిగిన నష్టంపై జిల్లా


గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. భారత్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ చానబమ్ రిషికాంత్ సింగ్ ఆదివారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఎడిషన్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకు ముందు పారా-పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ ఇండియాకు తొలి కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసింది. మ్యాచ్ ప్రారంభంలో 28 ఏళ్ల రిషికాంత్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. స్నాచ్ విభాగంలో రిషికాంత్ తన మూడు ప్రయత్నాలను (116 కిలోలు, 119 కిలోలు, 121 కిలోలు) బరువులు ఎత్తి సక్సెస్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో 121 కిలోల బరువు ఎత్తిన రిషికాంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్నాచ్ రికార్డును కూడా నెలకొల్పాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి అతను మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనిక్‌తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు.తృటిలో చేజారిన స్వర్ణం క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలో 143 కిలోల బరువును సునయాసంగా ఎత్తిన రిషికాంత్ సింగ్.. రెండో ప్రయత్నంలో 148 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పటి వరకూ మూడో స్థానంలో కొనసాగుతున్న మ



బాల్కొండ: నిజామాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ఈతకు దిగి నలుగురు యువకులు మృతి చెందారు. ముప్కాల్ వద్ద ఎస్సారెస్పి బ్యాక్ వాటర్‌లో ఈతకు దిగిన ఐదురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన నలుగురు చనిపోయారు. మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు నిజామాబాద్‌కు చెందిన వారుగా సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్ సింగ్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఎక్స్ వేదికగా ఆమెను మోడీ ప్రశంసించారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమన్నారు. ఈ ఘనత భారత స్క్వాష్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని.. యువతలో స్క్వాష్ క్రీడపై ఆసక్తిని మరింత పెంచుతుందని ప్ఱధాని మోడీ తన సందేశంలో తెలిపారు. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న అనాహత్.. రుకాయ సాలెమ్ (ఈజిప్ట్)ను ఫైనల్స్‌లో ఓడించింది. ఈ టోర్నీలో పతకం సాధించడం 18 ఏళ్ల అనాహత్‌కు ఇది వరుసగా రెండోసారి. నిరుడు కాంస్యంతో నెగ్గిన ఆమె ఈసారి స్వర్ణం చేజిక్కించుకుంది.
