19748 వార్తలు




గ్లాస్గో: నాప్‌కిన్‌లపై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించిన గ్లాస్గోలోని రెస్టారెంట్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. భారత బాక్సర్ లవ్లీనాతో పాటు కొందరు అథ్లెట్లు సదరు రెస్టారెంట్‌కి వెళ్లగా.. అక్కడ ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని కొంత భాగం లేని భారత మ్యాప్‌ను గమనించారు. దీనిపై లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాప్ వివాదంపై స్కాట్‌లాండ్‌లోని భారత్ ఎంబసీ కూడా స్పందించింది. ఈ క్రమంలో సదరు రెస్టారెంట్ క్షమాపణలు చెప్పడంతో పాటు.. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేసింది. లోగోను కూడా మారుస్తామంటూ ప్రకటన చేసింది. ‘‘మేము భారతీయ వారసత్వం పట్ల గేం గర్వపడుతున్నాం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 ఏళ్లుగా మేం సేవలు అందిస్తున్నాం. అయితే, భారత మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు తొలుత మేం క్షమాపణలు చెబుతున్నాం. పొరపాటు సరిదిద్దడానికి తక్షణ చర్యలు తీసుకుంటాం. ఇది ఎవరినీ నొప్పించాలని చేసింది కాదు. భారత బృందానికి గర్వంగా సేవలు చేయాలనుకుంటున్నాం. సరైన మ్యాప్‌తో లోగోను మారుస్తాం. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించిన భారత అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లోని బంకిపూర్ బైపోల్ కౌంటింగ్ లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ హవా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించారు. మొత్తం 31 రౌండ్ లకు గాను 22 రౌండ్స్ లో కూడా పీకే ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఆయన విజయం ఖరారు కానుంది. ఆ పార్టీ శ్రేణులు పాట్నాతో పాటు బంకిపూర్ లో సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం రంగులు వెదజల్లుతూ ఆనందం వ్యక్తం […] The post పాట్నాలో జన్ సురాజ్ శ్రేణుల సంబరాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-అచ్చంపేటసినిమా హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన సౌట కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో మున్ముందు ప్రణాళిక ప్రకారంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్‌కు, రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. The post అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి appeared first on Navatelangana.


నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన కత్తల్వాడి గ్రామ సర్పంచ్ గోపాల్ రావు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ గోపాలరావు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు వైద్య శిబిరానికి తరలిరావాలని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య పరీక్షలు, నిర్వహించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు కూడా శుభ్రత పాటించాలని తెలిపారు. […] The post కత్తల్ వాడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ appeared first on Navatelangana.

హైదరాబాద్: సామాన్యులకు ఖరీదైన వైద్యం అందించాలన్న తమ సంకల్పం నెరవేరిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 90 శాతానికి పైగా సర్జరీలు ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ ద్వారా జరిగాయని తెలియజేశారు. వైద్యరంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని రేవంత్ రెడ్డి కోరారు. రోబోటిక్ సర్జరీల్లో నిమ్స్ వైద్యులు ఘనత సాధించారు. నిమ్స్ వైద్యులు మూడేళ్లలోనే దాదాపు 90 శాతం రోబోటిక్ సర్జరీలు ఉచితంగా చేశారు. నిమ్స్ వైద్యులను రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.

నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ పథకంలో మంజూరై, నిర్మాణాలను పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశాలు నిర్వహించామని అన్నారు. అదేవిధంగా లబ్దిదారులకు చిరు కానుకగా గోడగడియారాలను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్థాయి అధికారులను ఆహ్వానించి, గ్రామస్తుల సమక్షంలో […] The post ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడగడియారాలు పంపిణీ appeared first on Navatelangana.







ఢిలీ: నీట్-యుజి నిరసన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ ను విత్ డ్రా చేయాలా, మూసివేయాలా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని, క్రిమినల్ యాంటీసిడెంట్స్ అంటే..గతంలో హత్య, దోపిడీ, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల చరిత్ర ఉన్నవారేనని సుప్రీంకోర్టు తెలిపింది. కేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నమోదైన కేసులను నేర ఘటనలుగా ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ గా పరిగణించరాదని సూచించింది. ప్రశాంతంగా నిరసన తెలిపిన విద్యార్థులకు ఉపశమనం కల్పించవచ్చునని పేర్కొంది. పోలీసులు అతిగా బలప్రయోగం చేసినా, నేరాలకు పాల్పడిన నిరసనకారులైనా చట్టం ముందు జవాబుదారీతనం కావాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరించింది.


– తమ కూతురు వివాహ వేడుకకు హాజరు కావాలని ఆహ్వన పత్రిక అందజేతనవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ను (Mallikarjun Kharge) ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వివాహ మహోత్సవానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు […] The post ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌లను లైంగిక వేధింపుల కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. మహిళల భద్రత, సాధికారత గురించి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్పుకొంటుంటే, మరోవైపు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.’ఒకవైపు యువతకు అండగా […] The post కేంద్రంపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ క్లస్టర్ పరిధిలోని గ్రామాలలో క్షేత్ర స్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్, ప్రత్తి,పెసర, పుచ్చకాయ, మిరప తదితర పంటలను నాగుల్గావ్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సోయాబీన్ పంటలో ఐరన్ లోపం, పచ్చ పురుగు గమనించి దాని నివారణకు ఫార్ములా 6 @ 200గ్రాములు ఎకరాకు దానితో పాటు 19.19.19@1kg ఎకరాకు ,వేపనూనె (1500ppm) 500 ml […] The post ఖరీఫ్ పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారి appeared first on Navatelangana.