19729 వార్తలు


రాంచీ: జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. సాహిబ్‌గంజ్ డివిజినల్ జైలు నుంచి కన్‌బాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు. అదే అదనుగా భావించిన అతడు ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని చీకట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు చేపట్టగా.. అతడు తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజన్ చేశారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. సుజిత్ సిన్హాపై హత్యలు, వసూళ్లు, ఇతర నేరాలకు సంబంధించిన అనేక కేసులు నమోదై ఉన్నాయి. చాలా కాలంగా అతడు జార్ఖండ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.

నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్‌పై విజయం సాధించారు. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ గెలిచారు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఓడించారు. గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గంలో bjp అభ్యర్థి సతేంద్రభాయ్ […] The post జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ గెలుపు appeared first on Navatelangana.

ఐదేళ్లుగా రూ.20 వేలు పెండింగ్ లో చలాన్లు..నవతెలంగాణ-అచ్చంపేటసాధారణ వ్యక్తుల వాహనాలు చలాన్లు పెండింగ్లో ఉంటే.. ట్రాఫిక్ పోలీసులు ఆర్టీవో అధికారులు పట్టుకొని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ జిల్లా అటవీ శాఖ అధికారికి చెందిన TS 05 FE 9855 నెంబర్ గల వాహనం ఆర్టిఓ, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ , సర్వీస్ రోడ్డులో రాంగ్ పార్కింగ్ లు, ఇలా ఐదేళ్లుగా 20 చలాన్లు వాటి విలువ రూ.20,100/- పెండింగ్ […] The post ట్రాఫిక్ నిబంధనలు పాటించని అటవీశాఖ అధికారి వాహనం appeared first on Navatelangana.





గ్లాస్గో: నాప్‌కిన్‌లపై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించిన గ్లాస్గోలోని రెస్టారెంట్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. భారత బాక్సర్ లవ్లీనాతో పాటు కొందరు అథ్లెట్లు సదరు రెస్టారెంట్‌కి వెళ్లగా.. అక్కడ ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని కొంత భాగం లేని భారత మ్యాప్‌ను గమనించారు. దీనిపై లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాప్ వివాదంపై స్కాట్‌లాండ్‌లోని భారత్ ఎంబసీ కూడా స్పందించింది. ఈ క్రమంలో సదరు రెస్టారెంట్ క్షమాపణలు చెప్పడంతో పాటు.. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేసింది. లోగోను కూడా మారుస్తామంటూ ప్రకటన చేసింది. ‘‘మేము భారతీయ వారసత్వం పట్ల గేం గర్వపడుతున్నాం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 ఏళ్లుగా మేం సేవలు అందిస్తున్నాం. అయితే, భారత మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు తొలుత మేం క్షమాపణలు చెబుతున్నాం. పొరపాటు సరిదిద్దడానికి తక్షణ చర్యలు తీసుకుంటాం. ఇది ఎవరినీ నొప్పించాలని చేసింది కాదు. భారత బృందానికి గర్వంగా సేవలు చేయాలనుకుంటున్నాం. సరైన మ్యాప్‌తో లోగోను మారుస్తాం. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించిన భారత అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లోని బంకిపూర్ బైపోల్ కౌంటింగ్ లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ హవా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించారు. మొత్తం 31 రౌండ్ లకు గాను 22 రౌండ్స్ లో కూడా పీకే ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఆయన విజయం ఖరారు కానుంది. ఆ పార్టీ శ్రేణులు పాట్నాతో పాటు బంకిపూర్ లో సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం రంగులు వెదజల్లుతూ ఆనందం వ్యక్తం […] The post పాట్నాలో జన్ సురాజ్ శ్రేణుల సంబరాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-అచ్చంపేటసినిమా హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన సౌట కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో మున్ముందు ప్రణాళిక ప్రకారంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్‌కు, రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. The post అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి appeared first on Navatelangana.


నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన కత్తల్వాడి గ్రామ సర్పంచ్ గోపాల్ రావు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ గోపాలరావు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు వైద్య శిబిరానికి తరలిరావాలని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య పరీక్షలు, నిర్వహించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు కూడా శుభ్రత పాటించాలని తెలిపారు. […] The post కత్తల్ వాడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ appeared first on Navatelangana.

హైదరాబాద్: సామాన్యులకు ఖరీదైన వైద్యం అందించాలన్న తమ సంకల్పం నెరవేరిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 90 శాతానికి పైగా సర్జరీలు ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ ద్వారా జరిగాయని తెలియజేశారు. వైద్యరంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని రేవంత్ రెడ్డి కోరారు. రోబోటిక్ సర్జరీల్లో నిమ్స్ వైద్యులు ఘనత సాధించారు. నిమ్స్ వైద్యులు మూడేళ్లలోనే దాదాపు 90 శాతం రోబోటిక్ సర్జరీలు ఉచితంగా చేశారు. నిమ్స్ వైద్యులను రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.

నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ పథకంలో మంజూరై, నిర్మాణాలను పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశాలు నిర్వహించామని అన్నారు. అదేవిధంగా లబ్దిదారులకు చిరు కానుకగా గోడగడియారాలను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్థాయి అధికారులను ఆహ్వానించి, గ్రామస్తుల సమక్షంలో […] The post ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడగడియారాలు పంపిణీ appeared first on Navatelangana.







ఢిలీ: నీట్-యుజి నిరసన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ ను విత్ డ్రా చేయాలా, మూసివేయాలా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని, క్రిమినల్ యాంటీసిడెంట్స్ అంటే..గతంలో హత్య, దోపిడీ, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల చరిత్ర ఉన్నవారేనని సుప్రీంకోర్టు తెలిపింది. కేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నమోదైన కేసులను నేర ఘటనలుగా ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ గా పరిగణించరాదని సూచించింది. ప్రశాంతంగా నిరసన తెలిపిన విద్యార్థులకు ఉపశమనం కల్పించవచ్చునని పేర్కొంది. పోలీసులు అతిగా బలప్రయోగం చేసినా, నేరాలకు పాల్పడిన నిరసనకారులైనా చట్టం ముందు జవాబుదారీతనం కావాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరించింది.