23456 వార్తలు

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ యాక్టు (ఎన్‌ఎస్‌ఎ) నాసా అనే అస్త్రాన్ని బయటకు తీసింది. జాతి విద్రోహులపై ప్రయోగం చేయాల్సిన ఈ నల్లచట్టం పాలుకారే ప్రాయంలో ఉన్న విద్యార్థులు, జెన్‌జెడ్ యువతపై ప్రయోగం చేయనున్నారా? అంటే ఉద్దేశం అదే కావచ్చును. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అభద్రతా భావంలోకి జారిపోయినట్లే! కాక్రోచ్‌ల ఆందోళనకు భయపడినట్లే లెక్క? ఈ భయంకరమైన అస్త్రంతో కేసులు బనాయించి కాక్రోచ్ ఉద్యమాన్ని, తద్వారా మద్దతుగా కదులుతున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే దిశగా కేంద్ర అడుగులు వేస్తుందా? కనీస విచక్షణాధికారం మరచి ఈ నెల 15నుండి దీన్ని అమలు పర్చుతున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ నెల 20న పార్లమెంటు ముట్టడి పిలుపులో భాగంగా గాయపడిన, కేసులు పెట్టబడిన విద్యార్థులమీద ఈ అస్త్రం వినియోగం చేస్తారా? లేక బెదిరింపులకు ఉపయోగిస్తారా? అనేక కేసులతోపాటు, ఆర్నెళ్ల వరకు ఎలాంటి బెయిల్ రాని ఈ నల్లచట్టం ప్రయోగానికి సిద్ధంకావడంలోని ఆంతర్యం ఏమిటి? కేంద్ర పెద్దలు ఇంత అమానుష ఆలోచన, ఈ దిశగా ప్రయాణం చేయడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి? సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జుల


భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా దేశంగా 2025 నాటికి సుమా రు 146 కోట్ల జనాభాతో చైనాను అధిగమించిన ఆనంద సమయంలోనే ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది.దేశంలోని మొత్తం సంతానోత్పత్తి రేటు 2024లో 1.9కు పడిపోయింది. జనాభా స్థిరంగా కొనసాగాలంటే అవసరమైన స్థాయి 2.1 కాగా, ప్రస్తుతం అది దాని కంటే స్పష్టంగా తక్కువగా ఉంది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు; దేశభవిష్యత్తు జనాభా నిర్మాణాన్ని పూర్తిగా మార్చగల పరిణామం. ఒకప్పుడు ‘జనాభా విస్ఫోటనం’ గురించి ఆందోళన చెందిన భారత్, ఇప్పుడు ‘జనాభా తగ్గుదల’ అనే కొత్త సవాలును ఎదుర్కొంటోంది. ఈ మార్పు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటిపైనా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనుంది. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అత్యంత తక్కువగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో అది ఇంకా ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో ఈ రేటు 1.2 కాగా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో 1.3, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో సుమారు 1.4గా ఉంది. సిక్కిం 1.05తో దేశంలోనే అత్యల్ప స్థాయిలో ఉండగా, గోవా, లడఖ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈరాష్ట్రాల్లో పి










నవతెలంగాణ-హైదరాబాద్: మరోమారు పార్లమెంట్ మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ, విద్యార్థుల నిరసనలకు సంఘీభావంగా ప్రతిపక్షాలు ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. ఉభయసభల్లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని, విద్యాశాఖ మంత్రి పదవీకి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా దేశ యువతకు ప్రధాని మోడీ […] The post మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీల ఆందోళన appeared first on Navatelangana.

యాభై ఏళ్ల జీవితం.. రెండు దశాబ్దాల ప్రజాప్రస్థానం.. తెలంగాణ రాజకీయాల్లో కెటిఆర్ సాధించుకున్న ప్రత్యేక అధ్యాయం.. రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రయాణాన్ని అంచనా వేయడం అంటే కేవలం ఆయన పదవులను, ఎన్నికల విజయాలను లెక్కించడం కాదు. ఒక సమాజం కోసం ఆయన కలలు ఏమిటీ, ఆ కలలను సాకారం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటీ, ప్రజల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు ఎంతవరకు ప్రభావం చూపిందన్నదే నిజమైన కొలమానం. అలాంటి దృష్టితో చూసినప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్న నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్). యాభై సంవత్సరాల జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న కెటిఆర్‌కు ఈ రోజు జన్మదిన వేడుకతోపాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ రాజకీయాలనుంచి అభివృద్ధి రాజకీయాల వైపు సాగిన ప్రయాణంలో కొత్త తరం నాయకత్వం ఎదుగుదలను ప్రోత్సహించిన తీరు ఎంతోమంది కార్యకర్తలు, నాయకుల గుండెల్లో కెటిఆర్ చెరగని ముద్రవేసుకున్నారు. యాభై సంవత్సరాలు ఒక నాయకుడి జీవితంలో అనుభవం, పరిపక్వతకు కెటిఆర్ రాజకీయ జీవితం నిదర్శంగా నిలస్తోంది. ఇరవై సంవత్సరాల కెటిఆర్ రాజకీయ అనుభవం ఒక పెద్ద బాధ్యత. ఈ ప్రయాణంలో

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా ‘కలర్ ఫొటో‘, ‘బేబి‘ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ‘. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ మూవీ విడుదలకానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కిరణ్ అబ్బవరం నాలుగు, ఐదు మంచి హిట్స్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీతో కూడా కిరణ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతాడు”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమాతో రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నేను చేసిన స్టీవెన్ శంకర్ రోల్ నాకు ఎంతో ప్రత్యేకం. ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి”అని తెలిపారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ- “ఈ సినిమా సెకండాఫ్‌లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట



ఢిల్లీలో జరుగుతున్నవి రాజకీయ ప్రేరేపిత ధర్నాలు..విద్యార్థులను అడ్డుపెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి




