23466 వార్తలు

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా ‘కలర్ ఫొటో‘, ‘బేబి‘ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ‘. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ మూవీ విడుదలకానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కిరణ్ అబ్బవరం నాలుగు, ఐదు మంచి హిట్స్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీతో కూడా కిరణ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతాడు”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమాతో రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నేను చేసిన స్టీవెన్ శంకర్ రోల్ నాకు ఎంతో ప్రత్యేకం. ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి”అని తెలిపారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ- “ఈ సినిమా సెకండాఫ్‌లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట



ఢిల్లీలో జరుగుతున్నవి రాజకీయ ప్రేరేపిత ధర్నాలు..విద్యార్థులను అడ్డుపెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి






సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ ’కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథి హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ “మొదట ’కామాఖ్య’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ ఫుల్. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ’కర్మాఖ్య’ అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. ‘కర్మాఖ్య’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ “ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. అందరూ ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను. ఒక మలయాళం, హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది”అని తెలిపారు. నిర్మాత వడ్డేపల్లి శ్రీ



బెంగళూరు: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని చంపేసి అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి చెరువులో పడేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కుంబళగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చల్లఘట్టలో జయమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కన గగన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ చేయడంతో అతడు డబ్బులు పొగొట్టుకోవడంతో అప్పుల పాలయ్యాడు. జయమ్మకు ఫోన్ లేకపోవడంతో పక్కింటి వారిని అడిగి తన బంధువులకు ఫోన్ చేసేది. గగన్ ఫోన్ చేయమని15వ తేదీన అడిగింది. ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో వృద్ధురాలని గొంతునులిమి చంపేశాడు. అనంతర మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి యాప్‌లో ఆటో బుక్ చేసుకున్నాడు. రామోహళ్లి ప్రాం తంలో తిమ్మప్ప చెరువు వద్దకు ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లాడు. చీకటి పడిన తరువాత మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయాడు. జయమ్మ కనిపించడంలేదని ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా వృద్ధురాలి కోసం గగన్ ముందుండి వెతికినట్టు నటించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజా

బెంగళూరు: యువ క్రికెటర్‌కు డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయమై డబ్బుల కోసం బెదిరించడంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహారాష్ట్రాకు చెందిన ఓ క్రికెటర్ మ్యాచ్ కోసం బెంగళూరుకు వచ్చాడు. పంచతారా హోటల్‌లో బస చేశాడు. డేటింగ్ యాప్‌లో జులై 17న ఓ యువతి నుంచి సందేశాలు రావడంతో ఆమెతో అతడు వాట్పాప్ కాల్ మాట్లాడాడు. వాట్సాప్ వీడియో కాల్‌లో ఆమె చేష్టలు, మాటలు దారితప్పడంతో వెంటనే ఆపేశాడు. చాటింగ్‌ను రికార్డు చేసి అనంతరం అతడికి పంపించి 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అతడు డబ్బులు చెల్లించాడు. అనంతరం మళ్లీ పోన్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలని బెదిరించింది. అతడు తాను ఇవ్వలేనని కాల్ కట్ చేశాడు. మహారాష్ట్రకు వెళ్లే ముందు స్నేహితుడితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేసి వెళ్లిపోయాడు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతి: ఎంఆర్‌ఒ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలో సిద్దంపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పిజిఆర్‌ఎస్ విభాగంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. అతడి భార్య అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో ఎంపిడిఒగా విధులు నిర్వహించారు. కూతురు అమెరికాలో చదువుకుంటుండగా కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. 2024 ఎన్నికల సమయంలో రామాపురంలో ఎంఆర్‌ఒగా విధులు నిర్వహించారు. పిజిఆర్‌ఎస్ అర్జీపై వచ్చి అభియోగాల కారణంగా విఆర్‌ఒ వెంటకరమణను సస్పెండ్ చేయడంతో పాటు శ్రీనివాసులను కలెక్టరేట్‌లోని కెఆర్‌ఆర్ సి విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేయగా శ్రీనివాసులు అవకతవకలు చేసినట్టు అభియోగాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయనకు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతడి భార్య అనారోగ్యం కారణంగా సెలవుల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు విధుల్లో అభియోగాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాడు. గురువారం సాయంత్రం సిద్దం పల్లెలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూర

జెరూసలేం: ఓ భారతీయుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐలాట్ నగరంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. తన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రక్తస్రావంలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం భారతీయుడిగా గుర్తించారు. 31 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడికి, నిందితుడి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

లండన్: అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నిషేధం విధించాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆన్‌లైన్ వేదికగా పోరాటం చేస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్‌లో నిర్వాహకులు అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలతో జట్టుపై నిషేదం విధించాలనే డిమాండ్‌తో ఆన్‌లైన్ లీగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం 2.50 కోట్ల మంది అభిమానుల సంతకాలతో కూడిన పిటిషన్ దాఖలైంది. కోట్లాది మంది ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతు పలికి సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఈ సంఖ్యను ఐదు కోట్లకు పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేశారు. మరోవైపు ఇటీవల ముగిసిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టి20లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మూడు కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు పార్మాట్‌లలో కలిపి అతి చిన్న వయసులోఅర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా వైభవ్ నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వైభవ్ (15 ఏళ్ల 118 రోజులు) హాఫ్ సెంచరీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (భారత్) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. సచిన్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో (16 ఏళ్ల 213 రోజులు) అర్ధ సెంచరీ సాధించిన అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజాగా జింబాబ్వే మ్యాచ్‌లో వైభవ్ దీన్ని బద్దలు కొట్టాడు. అంతేగాక అంతర్జాతీయ టి20లో అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా కూడా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో 2021లో గిబ్రాల్టర్ బ్యాటర్ లూయిస్ సాధించిన రికార్డును అధిగమించాడు. లూయిస్ 16 ఏళ్ల 58 రోజుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. జింబాబ్వే మ్యాచ్‌లో వైభవ్ దీన్ని తిరగరాశాడు.

తొలి టి20లో జింబాబ్వేపై గెలుపు హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 13.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సూర్యవంశీ స్కోరును పరిగెత్తించాడు. దూకుడుగా ఆడిన వైభవ్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. 24 బంతుల్లలో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు

సెప్టెంబర్ 15 వరకు ‘ఇన్‌స్పైర్’ దరఖాస్తులు..ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ప్రోత్సాహకం


