23883 వార్తలు


ఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్, అణిచివేత చర్యలకు నిరసనగా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నాచేశారు. మల్లికార్జునఖర్గే, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, ఇతర నేతలు, కాంగ్రెస్ ఎంపిలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలను ధర్నా చేయగా.. గూండాగిరి నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేశారు. చేతులకు తాళ్లు కట్టుకొని.. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని, యువతపై లాఠీఛార్జ్ కి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎన్డిఎ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, నీట్ లీకేజీపై పార్లమెంట్ లో చర్చకు కూడా ఒప్పుకోవడం లేదని, నీట్ అంశంపై మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.




హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రాకాసపాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అకాల వర్షాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నలుగురు రైతులు చనిపోయారని అన్నారు. లక్సెట్టిపేటలో మంచిర్యాల జిల్లాలో బిఆర్ ఎస్ రైతు సదస్సు జరిగింది. సదస్సులో కెటిఆర్, జీవన్ రెడ్డి, జోగురామన్న, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. పిడుగుపాటుతో మరణించిన రైతుల కుటుంబాలను కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన రైతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సాయం చేసిందని తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోలేదని, రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కెటిఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 32 నెలల్లో నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ తరపున రైతులకు అండగా ఉంటున్నామని అన్నారు. ఎల్లంపల్లిలో 7టిఎంసిల నీరు మాత్రమే ఉందని, బాగా వర్షం పడితే ఎస్సారెస్పీ నిండుతుందని చెప్పారు. కడెం నుంచి ఎల్లం పల్లికి నీరు వస్తుందని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. ఒక రోజు నీళ్లు ల





హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్-నినో కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి విపత్తు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మంగళవారం పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో తన అభిప్రాయాలను అధికారిక వేదికపై చెప్పే అవకాశం ఉందని, అసెంబ్లీ సమావేశాలకు ముందే అనవసర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రచారం చేసుకోవాలని రామచంద్రరావు ప్రయత్నిస్తున్నారని చురకలంటించారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, అక్కడ అన్ని పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే పూర్తి అవకాశం ఉంటుందని, బిజెపి తన వైఖరిని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల ద్వారా సభలో వెల్లడించవచ్చని, ముందుగానే గందరగోళం సృష్టిం

నవతెలంగాణ ఢిల్లీ: నేడు కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో పూర్వ సభ్యులు వి.ఎస్. అచ్యుతానందన్ తొలి వర్ధంతి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ లో వి.ఎస్.అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబి మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ […] The post వి.ఎస్. అచ్యుతానందన్ కు ఘన నివాళి appeared first on Navatelangana.







పట్టించుకోని అధికారులు..ఇబ్బందుల్లో ప్రజలునవతెలంగాణ-కుభీర్ మండలంలోని రంగశివిని తండాలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి, వారికి నెల నెల గ్రామ పంచాయతీ నుంచి జీతాలు చెల్లిస్తోంది. అయినా ఇక్కడ మాత్రం ఎలాంటి పనులు చేయకుండా కార్మికులు ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదరంతో మురికి కాలువలు నిండిపోయాయి. మురుగు […] The post అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు appeared first on Navatelangana.

ఢిల్లీ: యువతపై ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ దారుణంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఈ దేశ యువత పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదు అని అన్నారు. సోమవారం పార్లమెంట్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి చేయడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లాను కలిశానని, ఆందోళనపై చర్చించాలని స్పీకర్ ను కోరితే.. ప్రభుత్వాన్ని అడగాలని అంటున్నారని విమర్శించారు. చెదపురుగుల వల్ల విద్య, పరీక్షా విధానం కుళ్లిపోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, పరీక్షా విధానాలపై యువత నిరసన తెలుపుతోందని, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై.. పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

నవతెలంగాణ-హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పరీక్షల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడిన యాదవ్, పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు సరైంద కాదని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏంటని తప్పుబట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవీకి రాజీనామా చేయకుండా […] The post పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం appeared first on Navatelangana.


తహశీల్దార్ వెంకటేష్ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది ఐలాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కట్టడాలు నేలమట్టం అక్రమార్కులకు అధికారుల వార్నింగ్ కూల్చివేతలో పాల్గొన్న ఆర్‌ఐలు, జీపీఓలు నవతెలంగాణ- అమీన్‌పూర్: అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న పలు కట్టడాలను రెవెన్యూ అధికారులు సోమవారం భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న ఈ నిర్మాణాలపై స్థానిక తాహశీల్దార్ వెంకటేష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాహశీల్దార్ ఆదేశాల మేరకు […] The post అమీన్‌పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత appeared first on Navatelangana.