19770 వార్తలు







తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. తిరుమలలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 84,645 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు అని.. ఆదివారం శ్రీవారికి తలనీలాలు 29,700 మంది భక్తులు సమర్పించినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.










అమరావతి: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో దారుణం జరిగింది. మామను, అల్లుడు కత్తితో చంపాడు. ఈ ఘటన ముత్తూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అల్లుడు గున్నస్వామికి, తన భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఒక రోజు అర్థరాత్రి భార్యా, భర్తకు వివాదం జరగడంతో మధ్యలో మామ ఏడుకొండలు అడ్డుపడ్డాడు. అందుకు మామపై కత్తితో పొడిచి చంపాడు. కుటుంబసభ్యులు నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా ఏడుకొండలు మృతి చెందాడు. భార్య మస్తానమ్మకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన అడుగును చాలా జాగ్రత్తగా వేయబోతున్నాడు. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న 100వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది. అందుకోసం మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. స్త్రుతం నాగార్జున.. తన 100వ మూనీని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘కింగ్100’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు. నాగార్జున దేవిశ్రీ ప్రసాద్‌లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాగార్జున ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘కుబేర’ చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా



